Akhil Akkineni: ‘ ఏజెంట్’ (Agent) సినిమా అఖిల్ కెరీర్ లో ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో మనందరికీ తెలిసిందే. రీసెంట్ గా అఖిల్ గ్రాండు గా పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలుసు. అఖిల్ (Akhil) రెండేళ్ళు గ్యాప్ తీసుకుని ‘లెనిన్’ (Lenin) అనే సినిమా చేస్తున్నాడు. తన కెరీర్లో ఆరో సినిమా గా ఇది తెరకెక్కుతుంది. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ (Vinaro Bhagyamu Vishnu Katha) ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు (Murali Kishor Abburu) ఈ మూవీకి దర్శకత్వం చేస్తున్నాడు. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
Also Read: Man Vs Leopard: ఆర్ఆర్ఆర్ సీన్ రిపీట్.. తారక్ తరహాలో చిరుతతో సామాన్యుడి ఫైట్.. వీడియో వైరల్!
‘మనం ఎంటర్టైన్మెంట్స్’ పై నాగార్జున (Nagarjuna), సుప్రియ యార్లగడ్డ (Supriya Yarlagadda) నిర్మాణ భాగస్వాములుగా ఉన్నారు. ఈ మూవీ .తిరుపతి బ్యాక్ డ్రాప్ లో సాగే కుటుంబ కథా చిత్రం. ఇప్పటికే సగం సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ చేశారు. కొద్దిరోజుల క్రితం గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. దానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉండగా.. ‘లెనిన్’ (Lenin) చిత్రంలో శ్రీలీల (Sreeleela) హీరోయిన్ గా సెలెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ , గ్లింప్స్ లో కూడా ఈ ముద్దుగుమ్మ కనిపించింది.
Also Read: Kannappa: ‘కన్నప్ప’కు సెన్సార్ షాక్.. 13 నిమిషాల సినిమా లేపేశారు.. ఫైనల్ నిడివి ఎంతంటే?
ఏ హీరోకి లేని అఖిల్ కే ఇన్ని కష్టాలు , బాధలు ఏంటి ? ఇప్పటి వరకు ఒక్క సరైన హిట్ కూడా పడలేదు. ఇక తన సినీ కెరీర్ మొత్తం ఇలాగే ఉంటుందా అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు అఖిల్ కి సినిమా గండం ఉందనుకుంటా .. మొదటి నుంచి ఇలాగే అవుతుంది.
Also Read: Tollywood: బ్రేకింగ్.. సినిమాలకు గుడ్ బై చెప్పిన తెలుగు నటుడు.. ఇకపై కనిపించనంటూ సంచలన వీడియో రిలీజ్
సినిమా రిలీజ్ అవ్వక ముందు వరకు హైప్ బాగానే ఉంటుంది. రిలీజ్ అయ్యాక సీన్ మొత్తం రివర్స్ అవుతుంది. అఖిల్ సినీ కెరీర్ లో ఆహా అనుకున్న ఒక్క సినిమా కూడా లేదు? అయ్యగారు ఒక్క హిట్ కొడితే చూడాలని ఉందంటూ ఫ్యాన్స్ కూడా ఎంత గానో ఆశ ప
డుతున్నారు.స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.