Kannappa Censor
ఎంటర్‌టైన్మెంట్

Kannappa: ‘కన్నప్ప’కు సెన్సార్ షాక్.. 13 నిమిషాల సినిమా లేపేశారు.. ఫైనల్ నిడివి ఎంతంటే?

Kannappa: మంచు విష్ణు (Manchu Vishnu) ‘కన్నప్ప’ సినిమాకు సెన్సార్ షాకిచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాపై ఎటువంటి కాంట్రవర్సీ నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్రాహ్మణ సంఘాలు ఈ సినిమాను కత్తి పట్టుకుని వెంటాడుతున్నారు. సెన్సార్ టీమ్‌కు కూడా వారు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ‘కన్నప్ప’ సినిమాను చాలా జాగ్రత్తగా సెన్సార్ చేసినట్లుగా తెలుస్తుంది. దాదాపు 13 నిమిషాల నిడివి గల సన్నివేశాలను సినిమా నుంచి తొలగించినట్లుగా సెన్సార్ సర్టిఫికెట్ తెలియజేస్తుంది. మొదటి నుంచి ఈ సినిమాపై వ్యక్తమవుతున్న అభ్యంతరాలను నిర్దాక్షిణంగా తొలగించేశారు. ఈ క్రమంలో ఒక పాట మొత్తాన్ని తొలగించడం విశేషం.

Kannappa Censor Certificate

దాదాపు 13 నిమిషాల సన్నివేశాలను తొలగించినా కూడా.. ఈ సినిమా నిడివి 182 నిమిషాలు (3 గంటల 2 నిమిషాలు) ఉండటం సెన్సార్ సర్టిఫికెట్‌లో గమనించవచ్చు. సెన్సార్‌కు 195.02 నిమిషాల సినిమాను పంపించగా, అందులో కటింగ్స్ పోయిన తర్వాత కూడా ఈ సినిమా 3 గంటలకు పైగా ఉండటం చూస్తుంటే.. ఎడిటింగ్ టేబుల్ మీదకు ఎన్ని గంటల సినిమా వెళ్లి ఉంటుందో అనేలా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సెన్సార్ కొన్ని సన్నివేశాలను రీప్లేస్ చేయగా, కొన్ని మాత్రం పూర్తిగా తొలగించారు. ఆ వివరాల్లోకి వెళితే.. (Kannappa Censor Cuts)

Kannappa Censor Certificate

Also Read- Manchu Family: న్యూజిలాండ్‌లో 7 వేల ఎకరాలు కొన్నాం.. అసలు విషయం ఇదే!

-రాబందు చిన్న పిల్లాడిని విడిచి పెట్టడం
-తిన్నడు, టెంకనను చంపి కోపంతో చూడటం
-గూడెం లీడర్స్ పరిచయ గీతం దాదాపు పూర్తిగా తొలగించారు
-తిన్నడు పరిచయం గీతం ఒక నిమిషం 7 సెకన్ల విజువల్స్ తొలగించారు.
-కాలాముఖుడు కోపంగా కత్తి ఉన్న రక్తాన్ని ముఖానికి తుడుచుకోవడం
-తిన్నడు, నెమలి వాటర్‌లా ఫామ్ అయ్యి డ్యాన్స్ చేస్తున్న తమ రూపాల్ని చూసి ఆశ్చర్యపోవడం
-సగమై సరి సగమై పాటలోని 44 సెకన్ల విజువల్స్ తొలగించారు.
-కాలాముఖుడు సైన్యం మరియు గూడెం ప్రజల మధ్య యుద్ధం సన్నివేశాల్లో 38 సెకన్ల విజువల్స్ తొలగించారు.
-జటవీ గలజ్జల ప్రవాహ డైలాగ్ సంబంధించి 5 నిమిషాల 20 సెకన్ల సన్నివేశాలు తొలగించారు.
-నెమలి తన వాళ్లని విడిచి వెళ్లే సన్నివేశంలో 11 సెకన్లు తొలగించారు.

Kannappa Censor Certificate

Also Read- NBK: పెద్దల్లుడితో హ్యాపీనే.. చిన్నల్లుడితోనే ప్రాబ్లమ్! బాలయ్య సంచలన వ్యాఖ్యలు

ఇవి కాకుండా ‘పిలక, గిలక’ ప్లేస్‌లో చవటతో రీప్లేస్ చేశారు. ఇంకొన్ని సన్నివేశాలకు అభ్యంతరం చెప్పగా వాటన్నింటినీ తొలగించడంతో ఫైనల్‌గా ఈ సినిమాకు యుబైఏ సర్టిఫికెట్‌ను సెన్సార్ సభ్యులు జారీ చేశారు. ఈ కట్స్‌తో ఈ సినిమాపై పోరాటం చేస్తున్న వారంతా కాస్త శాంతించే అవకాశం అయితే లేకపోలేదు. ఈ సినిమా తెలుగు వెర్షన్‌కు సంబంధించి బుధవారం నుంచి అడ్వాన్స్ బుకింగ్ మొదలవుతాయని విష్ణు మంచు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. విష్ణు సరసన ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్, మంచు మోహన్ బాబు, శరత్ కుమార్, ముఖేష్ రుషి వంటి వారంతా కీలక పాత్రలలో నటించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?