Viral Video: 100 మీటర్ల లోయ.. గాల్లో ప్రమాదకరంగా వేలాడిన ట్రక్!
Cargo truck (Image Source: Twitter)
Viral News, లేటెస్ట్ న్యూస్

Viral Video: 100 మీటర్ల లోయ.. గాల్లో ప్రమాదకరంగా వేలాడిన ట్రక్.. వీడియో వైరల్!

Viral Video: చైనాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ కార్గో ట్రక్.. సగం కూలిన హైవే వంతెనపై వేలాడుతున్న దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. సినీ ఫక్కీలో ట్రక్ సగ భాగం రోడ్డుపై.. మిగిలిన సగభాగం 100 మీటర్ల లోతున్న నది పైభాగంలో వేలాడుతూ కనిపించింది. ఒళ్లుగగుర్పొడిచేలా ఉన్న ఈ దృశ్యాలను చూసి నెటిజన్లు షాక్ కు గురవుతున్నారు.

చైనాలోని గుయిజౌ ప్రావిన్స్ (Guizhou province) లో ఈ నెల 24న ఈ ఘటన చోటుచేసుకుంది. సాండు కౌంటీ (Sandu County)లోని G76 జియారాంగ్ హైవే (G76 Xiarong highway)పై హౌజీ రివర్ బ్రిడ్జి (Houzi River Bridge) ఉంది. చుట్టూ ఎత్తైన కొండలతో కూడిన ఆ మార్గంలో 24వ తేదీన భారీ వర్షం కురిసింది. దీంతో హౌజీ నది వంతెనపై భారీగా కొండచరియాలు విరిగిపడ్డాయి. దీంతో వంతెన మధ్యభాగం కుప్పకూలి.. 100 మీటర్ల కింద ఉన్న నదిలో శిథిలాలు పడిపోయాయి.

అయితే వంతెన కుప్పకూలిన క్షణాల వ్యవధిలోనే ఆ మార్గంలోకి భారీ కార్గో ట్రక్ వచ్చింది. వంతెన కూలిపోవడాన్ని గమనించిన ట్రక్ డ్రైవర్ గట్టిగా బ్రేక్స్ ను తొక్కిపట్టాడు. అయితే హెవీ వెహికల్ కావడంతో బ్రేక్స్ అనుకున్నంత త్వరగా పడలేదు. ఈ క్రమంలో ట్రక్కు ముందు భాగం.. వంతెన పైకి దూసుకొచ్చింది. దీంతో సగ భాగం గాల్లో.. మిగిలిన పార్ట్ రోడ్డుపై ఉండేలా ట్రక్ ఆగిపోయింది. దీంతో డ్రైవర్ ప్రమాదకరంగా గాల్లోనే ఉండిపోయాడు.

Also Read: Kavitha on CM Revanth: చంద్రబాబుకు బిర్యానీ పెట్టి.. గోదావరి నీళ్లు గిఫ్ట్‌గా ఇచ్చారు.. సీఎంపై కవిత ఫైర్!

అటుగా వచ్చిన వాహనదారులు.. ట్రక్ పరిస్థితిని గమనించి.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్ చాకచక్యంగా ట్రక్ నుంచి డ్రైవర్ ను కాపాడింది. దీంతో అక్కడి వారంతా ఊపిరిపీల్చుకున్నారు. చైనాలోని గుయిజౌ ప్రావిన్స్ ప్రాంతం.. పర్వతాలు, భారీ వర్షాలకు ప్రసిద్ధి అని అధికారులు తెలిపారు. ఇక్కడ కురిసే ఎడతెరిపే లేని వర్షాలకు కొండచరియలు విరిగిపడటం సర్వ సాధారణంగా మారిపోయిందని పేర్కొన్నారు.

Also Read This: Bhatti vikramarka: కాంగ్రెస్ అంటేనే వ్యవసాయం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క