CM Revanth Reddy: నిజాం ప్రభు కంటే.. కేసీఆర్ ఫ్యామిలీ ఇప్పుడు ధనవంతులయ్యారని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పేర్కొన్నారు. వాళ్లు అధిపతులై, తెలంగాణ రాష్ట్రాన్ని 8 లక్షల కోట్లు అప్పుల్లో ముంచేశారన్నారు. మంగళవారం సచివాలయం వద్ద జరిగిన రైతు భరోసా (Farmer Assurance) విజయోత్సవ సభలో సీఎం మాట్లాడుతూ, సచివాలయం సాక్షిగా రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు పండుగ చేసుకుంటున్నారన్నారు. ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ రైతాంగం అండతో చిన్న వయసులో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టానని గుర్తు చేశారు. అందుకే ప్రజా ప్రభుత్వంలో తమ మొదటి ప్రాధాన్యత రైతుల, ఆడబిడ్డలు, ఉద్యమకారులు, విద్యార్థులేనని వెల్లడించారు.
617 కోట్లు వారి ఖాతాల్లో
కేసీఆర్ (KCR) ప్రభుత్వం రైతు బంధును ఎగ్గొడితే తమ ప్రభుత్వం రాగానే వెంటనే రూ. 7625 కోట్ల నిధులను విడుదల చేశామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అప్పుల్లో కూరుకుపోయినా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి ఆత్మగౌరవాన్ని నిలబెట్టామన్నారు. 25 లక్షల 35 వేల 964 మంది (Farmers) రైతులకు రూ.20 వేల 617 కోట్లు వారి ఖాతాల్లో వేసి రుణ విముక్తులను చేశామన్నారు. సరిగ్గా15 ఆగస్టు 2024న రైతులను రుణ విముక్తులను చేశామన్నారు. గతంలో వరి వేస్తే ఊరి వేసుకున్నట్లేనని కేసీఆర్ చెప్పారని సీఎం మండిపడ్డారు. కానీ, ప్రభుత్వం వరికి బోనస్ కూడా ఇస్తుందన్నారు. అంతేగాక చివరి గింజ వరకు కొంటూ మద్ధతు ధరతో పాటు బోనస్ ఇస్తున్నామన్నారు.
తమ మాటపై నమ్మకంతో రైతులు (Farmers) దేశంలోనే అత్యధికంగా వరి పండించే రాష్ట్రంగా నిలబెట్టారన్నారు. ఇప్పటి వరకు 2 కోట్ల 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి దేశంలోనే తెలంగాణను మొదటి స్థానంలో నిలిపారన్నారు. దళారుల దోపిడీని నిలువరించి రైతును ఆదుకున్న చరిత్ర ప్రజా ప్రభుత్వానిదని స్పష్టం చేశారు. సాంబ వడ్లకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ అందిస్తున్నామన్నారు.
Also Read: BRS Party: సిట్టింగ్ స్థానం నిలబెట్టుకునేందుకు కసరత్తు!
ఆర్థిక వ్యవస్థకు క్యాన్సర్
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు క్యాన్సర్ వచ్చేలా కేసీఆర్ నిర్ణయాలు తీసుకొని తమకు అప్పగించారని సీఎం వెల్లడించారు. రాష్ట్ర వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్నారు. మామకు తగ్గట్లుగా అల్లుడు కూడా ఆగమై మాట్లాడుతున్నారన్నారు. గతంలో రైతు భరోసా ఇవ్వాలంటే కోకాపేటలో భూములు అమ్మారన్నారు. రైతు రుణమాఫీ కోసం ఔటర్ రింగ్ రోడ్డును కూడా అమ్మేశారన్నారు. రైతుల (Farmers) పేరుతో అప్పులు చేసి, దోపిడీకి పాల్పడ్డారంటూ సీఎం మండిపడ్డారు. (Farmers)రైతులకు నీళ్లిస్తామని కాళేశ్వరం పేరిట మోసాలకు పాల్పడ్డారన్నారు. కాళేశ్వరం కూలి లక్ష కోట్లు కొట్టుకుపోయాయని వెల్లడించారు. రాష్ట్రం రాక ముందు కేసీఆర్ అండ్ ఫ్యామిలీ అర్థిక పరిస్థితి ఎలా ఉండేదో? ప్రజలంతా గమనించాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఇప్పుడు మొయినాబాద్‌లో హరీశ్ రావు, జన్వాడలో కేసీఆర్, గజ్వేల్‌లో కేసీఆర్‌కు ఫాంహౌస్‌లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.
60 వేల ఉద్యోగాలు ఇచ్చాం
బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేండ్లలో చేయలేనివన్నీ తాము నెరవేర్చుతూ ముందుకు సాగుతున్నామని సీఎం పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశామన్నారు. లెక్కపెట్టుకుంటామంటే ఎల్బీ స్టేడియంలో తలలు లెక్క గట్టి అప్ప చెప్పి నిరూపిస్తానని వెల్లడించారు. పదేండ్లలో బీఆర్‌ఎస్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో? ప్రకటించాలన్నారు. 18 నెలల్లో లక్షా 4 వేల కోట్లను కేవలం రైతుల కోసం చేసిన ఘనత కాంగ్రెస్ కు దక్కుతుందన్నారు. రైతును రాజుగా చేసి వ్యవసాయాన్ని పండుగ చేసిన ప్రజా పాలన తమదని వెల్లడించారు. దమ్ముంటే కేసీఆర్ చర్చకు సిద్ధంగా ఉండాలని సీఎం సవాల్ విసిరారు. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ లక్ష కోట్లు కొల్లగొడితే, 18 నెలల్లో రైతుల కోసం లక్షా 4 వేల కోట్లు ఖర్చు చేసి, రైతులను ఆదుకున్న చరిత్ర కాంగ్రెస్‌కు దక్కుతుందన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు.
ఊర్లల్లో చర్చ పెట్టాలే?
పదేళ్లలో బీఆర్‌ఎస్ (KCR) ఏం చేసింది, 18 నెలల్లో కాంగ్రెస్ ఏం చేసిందనే అంశాలపై ఊర్లలో చర్చ పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రజలకు పిలుపు నిచ్చారు. దావత్‌లు, కల్లు దుకాణాలు, మార్కెట్లు, ఇలా తదితర చోట్ల డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉన్నదన్నారు. కుట్రలు కుతంత్రాలతో కాంగ్రెస్ హయాంలో మొదలుపెట్టిన సాగునీటి ప్రాజెక్టులను బీఆర్‌ఎస్ (BRS) ఒక్కటి కూడా పూర్తి చేయలేదన్నారు. లక్ష కోట్ల కోసం మాత్రం కాళేశ్వరాన్ని ఎంపిక చేశారన్నారు. ప్రాజెక్టు కూలిపోయినందుకు కేసీఆర్‌ను ఊరి తీసినా తప్పులేదని అక్కడి రైతాంగం అంటున్నారని సీఎం చెప్పారు. కేసీఆర్ కంట్రాక్టర్లకు దాదాపు 2 లక్షల కోట్లు చెల్లించారని, కానీ, పెండింగ్ ప్రాజెక్టులన్నీ ఎక్కడివి అక్కడే ఉన్నాయన్నారు.
బనకచర్చపై స్పెషల్ అసెంబ్లీ
బనకచర్లపై ప్రత్యేక అసెంబ్లీ పెడతామని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)పేర్కొన్నారు. స్పీకర్‌లు లేఖరాయాలని సూచించారు. బీఆర్‌ఎస్ చెప్పిన తేదికే అసెంబ్లీ నిర్వహిస్తామన్నారు. మొత్తం వివరాలన్నీ ప్రజల ముందు ఉంచుతామన్నారు. గోదావరి వివరాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరన్నదానిపై ప్రజల ముందు ఉంచుతామన్నారు. లక్ష కోట్లు దోచుకొని వేల ఎకరాలు ఆక్రమించిన బీఆర్‌ఎస్ నేతలు, తనపై దుర్మార్గపు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. తాను చంద్రబాబుతో అంటకాగుతున్నానని బీఆర్‌ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. చంద్రబాబు కోసం నిలబడే వాడినైతే అక్కడే ఉండేవాడినని వివరించారు.
Also Read: Shubhanshu Shukla: సర్వం సిద్ధం.. ట్విస్టులు ఉంటాయా?