Samvidhan Hatya Diwas: దేశ చరిత్రలో మాయని మచ్చగా నిలిచిన ఎమర్జెన్సీ విధించి జూన్ 25వ తేదీకి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని బీజేపీ(BJP) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 25, 26, 27 తేదీల్లో రాజ్యాంగ హత్యా దివస్ అభియాన్ ను ఘనంగా నిర్వహిస్తున్నామని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి(Manohar Reddy) తెలిపారు.
మీడియా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో విద్యార్థులు, యువతతో సమావేశాలు, ఎమర్జెన్సీ కాలంలో మీసా చట్టం(Visa Act), డీఐఆర్(DIR) కింద జైలు జీవితాన్ని గడిపిన పోరాటయోధులకు, బీజేపీ(BJP) నాయకులకు సన్మానం చేయనున్నామన్నారు. ఎమర్జెన్సీ ని గుర్తుచేస్తూ ఫొటో ఎగ్జిబిషన్, ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బీజేవైఎం(BJYM) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 500 మండలాల్లో విద్యార్థి, యువజన సమ్మేళనాలు నిర్వహిస్తున్నామన్నారు.
Also Read: Rinku Singh: నిశ్చిత్తార్థం తర్వాత పెళ్లిపై రింకూ సింగ్ కీలక నిర్ణయం
ప్రజాస్వామ్య హక్కులను తానే కాలరాసిన ప్రధాని
1975 జూన్ 25 దేశ చరిత్రలో మరిచిపోలేని చీకటి రోజు ఒకవైపు ప్రభుత్వ యంత్రాంగాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించగా, మరోవైపు భారత రాజ్యాంగం(Indian Constitution) తనకు ఇచ్చిన ప్రజాస్వామ్య హక్కులను తానే కాలరాసిన ప్రధానిగా ఇందిరాగాంధీ(Indira Gandhi) చరిత్రలో నిలిచిపోయారన్నారు. 1977లో ఎన్నికలు వచ్చాకే ప్రజలు ఆ దుర్మార్గాన్ని తిరస్కరించి, కాంగ్రెస్(Congress) కు గట్టి బుద్ధి చెప్పారన్నారు.
మళ్లీ దేశంలో ప్రజాస్వామ్యం పునరుద్ధరణ అయిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాడిన వేలాది కార్యకర్తల త్యాగాలను స్మరిస్తూ, ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రతి ఏటా జూన్ 25న ‘రాజ్యాంగ హత్యా దినంగా’ పాటిస్తూ, చరిత్రను ప్రజలకు గుర్తుచేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా, అలాగే తెలంగాణలోనూ వివిధ కార్యక్రమాలు, సదస్సులు నిర్వహిస్తోందన్నారు.
Also Read: HYDRAA: హద్దులు దాటుతున్న హైడ్రా?.. ఓఆర్ఆర్ బయటకు వెళ్లి మరీ..
నాయకుల వివరాలను
సదస్సుల్లో జిల్లాల వారీగా పాల్గొననున్న నాయకుల వివరాలను పార్టీ ప్రకటించింది. కేంద్రమంత్రి పీయూష్ గోయల్(హైదరాబాద్ జిల్లా), కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ(రంగారెడ్డి రూరల్ జిల్లా), బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ (హన్మకొండ), మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు (కరీంనగర్ జిల్లా),
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ(నల్లగొండ జిల్లా), ఏంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ (రంగారెడ్డి అర్బన్ జిల్లా), ఎంపీ ఈటల రాజేందర్(ఖమ్మం జిల్లా),ఎంపీ ధర్మపురి అర్వింద్ (మహబూబ్ నగర్ జిల్లా), ఎంపీ రఘునందన్ రావు(వికారాబాద్ జిల్లా), ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి(మేడ్చల్ అర్భన్ జిల్లా), ఎంపీ గోడెం నగేశ్ (పెద్దపల్లి జిల్లా), బీజెఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి(యాదాద్రి భువనగరి జిల్లా), ఎమ్మెల్యే పాయల్ శంకర్ (సిద్దిపేట జిల్లా),
ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి (సికింద్రాబాద్ జిల్లా), ఎమ్మెల్యే రామారావు పాటిల్ (ఆసిఫాబాద్ జిల్లా), ఎమ్మెల్సీ మల్కకొమురయ్య (నిర్మల్ జిల్లా), ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి (నారాయణపేట్ జిల్లా), తమిళనాడు జాతీయ కో ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి(రంగారెడ్డి రూరల్ జిల్లా)లో పాల్గొననున్నారు. ఫొటో ఎగ్జిబిషన్ కార్యక్రమాలను ప్రారంభిస్తారు.
Also Read: HYDRAA: హద్దులు దాటుతున్న హైడ్రా?.. ఓఆర్ఆర్ బయటకు వెళ్లి మరీ..