BRS Porubata: తెలంగాణలో అధికార కాంగ్రెస్(Congresss) ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు బీఆర్‌ఎస్ (BRS) ‘పోరుబాట’ పట్టేందుకు సిద్ధమవుతున్నది. ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు, నీటి పంపకాలపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టాలని భావిస్తున్నది. పార్టీ అధినేత కేసీఆర్ (KCR) ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులను ప్రజల్లోకి పంపేందుకు కార్యాచరణను రూపొందించింది.
బనకచర్లపై ‘క్లాస్’..
ఈ ప్రణాళికలో భాగంగా, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు (Harish Rao) పార్టీ నాయకులకు తెలంగాణ భవన్‌లో ఇరిగేషన్ ప్రాజెక్టులపై రెండున్నర గంటల పాటు అవగాహన కల్పించారు. ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉన్న బనకచర్ల ప్రాజెక్టు (ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్నది) వల్ల తెలంగాణకు జరగబోయే అన్యాయంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్టును ఏపీ నిర్మించడానికి గల కారణాలు, ఎన్ని టీఎంసీలు తరలించుకుపోతారు, గోదావరి జలాల్లో తెలంగాణకు అన్యాయం ఎలా జరుగుతుంది, పరీవాహక ప్రాంతాల్లో (Farmers) రైతులకు, ప్రజలకు జరిగే నష్టం వంటి అంశాలను వివరించారు. నేతలు మీడియా డిబేట్లకు వెళ్లినప్పుడు, గ్రామాలకు వెళ్లినప్పుడు ఈ విషయాలను క్లుప్తంగా వివరించేందుకు సిద్ధం చేశారు.
Also Read: BJp vs BRS: కాళేశ్వరం అవినీతిపై.. మాటల యుద్ధం!
ఏపీ జలదోపిడీపై ప్రభుత్వ నిర్లక్ష్యంపై పోరాటం
బనకచర్ల ప్రాజెక్టు
బనకచర్ల ప్రాజెక్టును (Banakacharla Project) ఏపీ నిర్మిస్తుండటంతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వం గత 6 నెలలుగా “మౌన ప్రదర్శన” చేస్తుందని, కేవలం లేఖలతోనే సరిపెడుతున్నదని బీఆర్‌ఎస్ (BRS) ‘ ఆరోపిస్తుంది. భవిష్యత్తులో తెలంగాణకు జరిగే నష్టాన్ని ప్రజలకు వివరించేందుకు సిద్ధమైంది. బనకచర్లను ఆపడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయకుండా “గ్రీన్ సిగ్నల్” ఇస్తున్నదని లెక్కలతో సహా వివరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
నీటి పంపకాలు
గోదావరిలో వెయ్యి, కృష్ణాలో 500 టీఎంసీలు ఇచ్చి “ఎంతైనా తీసుకుపో” అనడంతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని బీఆర్‌ఎస్ (BRS) ‘ వాదిస్తున్నది. (KCR) కేసీఆర్ 968 టీఎంసీలు తమకు కేటాయించారని, 3000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని, అందులో 1950 టీఎంసీలు తమకు కావాలని కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ రాశారని, అయితే రేవంత్ రెడ్డి (Revanth Reddy) మాత్రం వెయ్యి టీఎంసీలు ఇచ్చి మొత్తం తీసుకో అంటున్నారని గులాబీ నేతలు వివరించనున్నారు. ఎవరు ఏపీకి “దాసోహం” అవుతున్నారనే విషయాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని భావిస్తున్నారు.
గత పోరాటాలు
కేసీఆర్ (KCR) తెలంగాణ కోసం, నీళ్ల కోసం చేసిన పోరాటం, ఆయన పాదయాత్ర తర్వాత అప్పటి ప్రభుత్వం దిగివచ్చి ఎడమ కాలువ లిఫ్టులు కూడా కుడి కాలువల్లాగే ప్రభుత్వమే మెయింటైన్ చేస్తున్నదనే విషయాన్ని వివరించాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. 750 టీఎంసీల నీళ్లు రావాలని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు రాష్ట్రం తరఫున బీఆర్‌ఎస్ వాదించిన విధానం, సెక్షన్ 3 కోసం కేసీఆర్ (KCR) చేసిన పోరాటం, అలాగే కాంగ్రెస్ (Congress) పాలన (2004-14)లో 6.64 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా, బీఆర్‌ఎస్ (BRS) ‘పాలన (2014-23)లో 48.74 లక్షల ఎకరాలు సాగులోకి తెచ్చిన విషయాన్ని వివరించనున్నారు.
గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కమిటీలు..
గోదావరి నది పరీవాహక ప్రాంతాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాలపై బీఆర్‌ఎస్ (BRS) ‘ ప్రత్యేక దృష్టి సారించింది. బనకచర్ల వల్ల ముంపు గ్రామాలు, నష్టం జరిగే ప్రాంతాల నేతలతో కమిటీలు వేయబోతున్నట్లు సమాచారం. ఆ కమిటీలతో నిరసన కార్యక్రమాలు, ధర్నాలు నిర్వహించి, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం, ఏపీ వైఖరిని వివరించాలని భావిస్తుంది. అదే విధంగా, కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మరోసారి ప్రజలకు వివరించి, కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని ఇప్పటికే గులాబీ నేతలకు పార్టీ ఆదేశించింది. ఒక వైపు గోదావరిలో నష్టం, మరోవైపు కృష్ణా నీళ్లలో తెలంగాణకు (Congress) కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను లెక్కలతో సహా వివరించేందుకు ప్రణాళికలు రూపొందించారు.
ప్రభుత్వంపై విమర్శలకు సన్నద్ధం
(Harish Rao) హరీశ్ రావు తన క్లాసులో, కాంగ్రెస్ (BRS) ‘ అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయలేదని, ఒక్క ఎకరానికి నీరు ఇవ్వలేదని, ఒక్క చెక్ డ్యామ్ నిర్మించలేదని విమర్శించారు. పెద్దవాగు కొట్టుకుపోయిన అంశం, ఎస్ఎల్బీసీ కూలిన అంశం, వట్టెం పంపు మునిగిన అంశాలపై కూడా కూలంకషంగా నేతలకు వివరించారు. కాంగ్రెస్అ (Congress)ధికారం లోకి రాగానే శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ లైనింగ్ పనులు ప్రారంభమయ్యాయని, దీంతో ఎక్కువగా నీటిని తరలించుకుపోయే ప్రమాదం ఉందని హరీశ్ రావు (Harish Rao ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే అంశాన్ని ప్రజలకు వివరించాలని నేతలకు సూచించారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు భవితవ్యం ఎలా ప్రశ్నార్థకమైందనే విషయాన్ని ప్రజలకు వివరించాలని కోరారు. ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టాలని, అనుసరిస్తున్న తీరును ఎండగట్టాలని భావిస్తుంది.
కేసీఆర్‌తో హరీశ్ భేటీ..
పార్టీ అధినేత KCR) కేసీఆర్‌తో హరీశ్ రావు తాజాగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. అదే విధంగా ప్రభుత్వం పార్టీ నాయకులపై పెడుతున్న కేసులను, ప్రాజెక్టులపై అనుసరిస్తున్న విధానంపై ఇరువురూ చర్చించినట్లు తెలిసింది. కృష్ణా, గోదావరి నీటిపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ఎండగట్టేలా నాయకులు క్షేత్రస్థాయికి వెళ్లి ప్రచారం చేయాలని, ప్రజలను చైతన్యం చేయాలని కేసీఆర్ KCR) ఆదేశించినట్లు సమాచారం.
అవసరమైతే నియోజకవర్గ కేంద్రాల్లోనూ నేతలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయాలని సూచించినట్లు తెలిసింది. కేసీఆర్ KCR) ఆదేశాల మేరకే పార్టీ నేతలకు పీపీటీ ఇచ్చినట్లు తెలిసింది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లోకి బలంగా వెళ్లి, ఇరిగేషన్, రైతులపై అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని బీఆర్‌ఎస్ (BRS) భావిస్తుంది. పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసి, ప్రజలను సైతం తమవైపు తిప్పుకునే ప్రయత్నంను ప్రారంభించబోతుంది.
Also Read: Phone Tapping Case: ప్రభాకర్ రావు ఎవరి కనుసన్నల్లో పనిచేసినట్టు!