Yuvatha Poru
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

Yuvatha Poru: కదం తొక్కిన యువత.. రప్పా రప్పా బ్యాచ్‌తో విధ్వంసమా?

Yuvatha Poru: ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ చంద్రబాబు (Chandrababu) నాయకత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ పోరుబాట ప‌ట్టింది. వివిధ అంశాలపై ఇప్పటికే నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టిన సోమవారం ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా చేప‌ట్టిన యువ‌త పోరు కార్యక్రమంలో యువ‌త‌, విద్యార్థులు క‌దం తొక్కారు. మాట తప్పి.. వెన్నుపోటు పొడిచిన కూటమి ప్రభుత్వ తీరుకు నిర‌స‌న‌గా జిల్లా కలెక్టరేట్ల వద్ద వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఆందోళ‌న కార్యక్రమాలు చేప‌ట్టారు. యువతకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టర్‌లకు యువతీయువకులతో కలిసి వైసీపీ యువజన విభాగం నేతలు వినతిపత్రాలు అందించారు. ధర్నాచౌక్‌లో వైసీపీ ఆధ్వర్యంలో యువత పోరు నిరసన కార్యక్రమం చేప‌ట్టారు. ఈ యువత పోరుపై పోలీసుల జులుం విధించారు. చంద్రబాబు తమకి చేసిన మోసాల్ని నిలదీస్తూ కలెక్టరేట్‌కి వెళ్తున్న యువకుల్ని నరసరావుపేటలో అడ్డుకుని విచక్షణారహితంగా పోలీసులు లాఠీలతో కొట్టారు. దీంతో.. ఎన్నికల సమయంలో ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగభృతి హామీల అమలుపై యువత నిలదీస్తే ఇలా కొట్టిస్తారా చంద్రబాబు..? అంటూ వైసీపీ ప్రశ్నిస్తూ వీడియోను పోస్టు చేసింది.

Read Also- Kuberaa: ‘కుబేర’ సినిమా కొత్త రికార్డ్.. మొదటి రోజు కంటే మూడో రోజే షాకింగ్ కలెక్షన్స్?

ప్రాణాలు చాల్లేదా?
ఈ ఘటనపై టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ‘ యువత పోరు అంటే ఏంటి జగన్ రెడ్డీ? (YS Jagan Mohan Reddy) రప్పా రప్పా బ్యాచ్‌తో విధ్వంసం సృష్టించడమా? నీ సత్తెనపల్లి పర్యటనలో సృష్టించిన విధ్వంసం, బలి తీసుకున్న ప్రాణాలు చాల్లేదా జగన్? నీ ఐదేళ్ల పాలనలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా యువతను గంజాయి మహమ్మారికి అప్పచెప్పిన నువ్వు ఏ మొహం పెట్టుకుని యువత పోరు అంటున్నావ్? గంజాయి దొరకడం లేదని పోరాడమంటావా?’ అని జగన్‌కు టీడీపీ గట్టిగానే ఇచ్చి పడేసింది.

YSRCP Vs TDP

భ‌య‌ప‌డేది లేదు!
కూట‌మి ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులు, అరెస్టుల‌కు, లాఠీచార్జీల‌కు వైసీపీ శ్రేణులు భ‌య‌ప‌డ‌ర‌ని మాజీ ఎమ్మెల్యే కాసు మ‌హేష్‌రెడ్డి (Kasu Mahesh Reddy) హెచ్చరించారు. సోమ‌వారం న‌ర‌స‌రావుపేట‌లో నిర్వహించిన య‌వ‌త పోరు కార్యక్రమంలో మాట్లాడుతూ.. నరసరావుపేటలో శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే దారుణంగా పోలీసులు లాఠీఛార్జ్‌ చేయడం సిగ్గుచేటన్నారు. పల్నాడు జిల్లా పర్యటనలో మా అధినేత వైఎస్ జగన్‌పై తప్పుడు కేసు పెట్టారు. మీరు లాఠీఛార్జ్‌ చేసినా ఎవరూ భయపడరు. మా యువత కదం తొక్కితే తట్టుకోలేకపోయారా? అన్యాయం చేసిన పోలీసులు కూడా జాగ్రత్తగా ఉండాలి. జగన్ సైన్యం ఎక్కడా భయపడకుండా పోరాడింది, కానీ పారిపోలేదు. నాడు అట్టడుగు వర్గాల వారికి కూడా రిజర్వేషన్లు కల్పిస్తే ఉన్నతంగా చదువుకుని సమాజంలో ముందుకువెళతారని మహానుభావులు రిజర్వేషన్లు కల్పించారు. డాక్టర్ వైఎస్సార్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తీసుకొచ్చి పేదలను ఉన్నత విద్య వైపు నడిపించారు. కానీ చంద్రబాబు దానిని తుంగలో తొక్కారు. తర్వాత జగన్ ఎంత ఫీజులు ఉంటే అంత తమ ప్రభుత్వమే చెల్లించి చదివించి విద్యారంగాన్ని అభివృద్ది చేశారు. ఇప్పుడు చంద్రబాబు మళ్ళీ సీఎం కాగానే విద్యావ్యవస్ధను సర్వశాననం చేశారు. అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చి పేదలకు విద్యను దూరం చేస్తున్నారు. ఉద్యోగం వచ్చింది పవన్‌ కళ్యాణ్‌కు.. లోకేష్‌కు, ఒకరు డిప్యూటీ సీఎం, మరొకరు మంత్రి అయ్యారు. చంద్రబాబు మీరు రెండు ఎకరాల నుంచి యాభై వేల కోట్లు సంపాదించారు. ఇప్పుడు పీ-4 అంటున్నారు. మీరు ముందు కుటుంబానికి రూ.10 లక్షలు ఇచ్చి ఇతరులకు ఆదర్శంగా ఉంటే వారు కూడా మీ బాట అనుసరిస్తారు. ఏది ఏమైనా వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి. నిరుద్యోగులకు గత ఏడాది ఇవ్వాల్సిన రూ.36 వేలు, ఈ ఏడాది రూ. 36 వేలతో కలిపి వెంటనే విడుదల చేయాలి అని కాసు మ‌హేష్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Read Also- Pawan Kalyan: హామీ ఇస్తున్నా.. వైసీపీ మళ్లీ రానే రాదు..!

 

Read Also- Mani Ratnam: మణిరత్నం సారీ చెప్పేశారు.. నెక్ట్స్ ఇచ్చిపడేస్తారట!

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?