Pawan On Jagan
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

Pawan Kalyan: హామీ ఇస్తున్నా.. వైసీపీ మళ్లీ రానే రాదు..!

Pawan Kalyan: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం అమరావతిలో జరుగుతున్న ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ వైసీపీ, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సంచలన కామెంట్స్ చేశారు. అనవసరంగా రెచ్చకొట్టద్దని జగన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. శాంతి భద్రతలు క్షీణిస్తే సహించం.. ఏ మాత్రం ఉపక్షించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. చాలా దెబ్బతిని ఇక్కడి వరకు వచ్చామన్నారు. నాడు ఫైవ్ స్టార్ హోటల్స్‌లో ఉన్నా రక్షణ లేదన్న విషయాన్ని పవన్ గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం మెతక ప్రభుత్వం కాదని.. సమర్ధవంతమైన ప్రభుత్వమని తేల్చి చెప్పారు. ఈ ప్రభుత్వంలో పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే తొక్కిపెట్టి నార తీస్తామని హెచ్చరించారు.

Read Also- Pawan Kalyan: విజయ్‌తో తలపడనున్న పవన్ కళ్యాణ్.. పెద్ద ప్లానే!

మక్కెలు విరగ్గొడతాం..
అధికారం లేకపోయినా వైసీపీ రౌడీయిజం చేస్తోంది. వైసీపీ నేతలు ఏ మాత్రం మారలేదు. పోలీస్ అధికారులను బెదిరిస్తున్నారు. ఇది సరైన విధానం కానే కాదు. ఇటువంటి అసాంఘిక చర్యలను ఏమాత్రం మా ప్రభుత్యం సహించదు. మహిళలకు, ఆడబిడ్డలకు పెద్దపీట వేస్తాం, రక్షణ ఇస్తాం. గొంతు కోస్తామంటే భయపడేవాడు లేడు. అలాంటివన్నీ చూసి.. ఆఖరికి మీలాంటి వారిని కూడా చూసి ఇక్కడి దాకా వచ్చాం. అధికారులంతా రాజ్యాంగాన్ని అమలు చేయాలి. శాంతి భద్రత విషయంలో అవినీతి లేకుండా ముందుకెళ్లాలి. వైసీపీ ప్రభుత్వం రాదు రావట్లేదు. 15 ఏళ్ల పాటు ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది. కూటమిలో ఎలాంటి విభేదాలు లేవు, ఉండవు. శాంతి భద్రతల విషయంలో ఇష్టానుసారంగా చేస్తే మక్కెలు విరగగొడతాం. ఈ ప్రభుత్వం చాలా పద్ధతిగా ఉంది.. ఉంటున్నాం. మాది మంచి ప్రభుత్వమే కానీ, మెతక ప్రభుత్వం మాత్రం కాదు. పిచ్చి వేషాలు వేస్తే తొక్కి పట్టి నారతీస్తాం. మళ్లీ జగన్ ప్రభుత్వం రానే రాదు. నేను ప్రజలకు ఆ హామీ ఇస్తున్నాను. కనీసం పదిహేనేళ్లపాటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. మళ్లీ జగన్ ప్రభుత్వం ఎప్పటికీ రాదు. తలలు తీస్తామని సినిమా డైలాగులు చెబితే మక్కెలు విరగ్గొడతాం అని జగన్ రప్పా రప్పా డైలాగ్‌పై పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు.

Pawan Kalyan

Read Also- YS Jagan: చంద్రబాబూ.. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయా?

గొంతుకలు కోస్తారా?
ఏడాది కాలంలో బ్రాండ్ ఏపీ పునరుద్ధరణ జరిగింది. రాష్ట్రంలో 20 వేల కిలోమీటర్ల రోడ్ల మరమ్మతులు జరిగాయి. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాం. గత ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కూడా దుర్వినియోగం జరిగాయి. కుదేలైన ఆర్ధిక వ్యవస్థను చంద్రబాబు గాడిలో పెడుతూన్నారు. వైసీపీ హయాంలో అధికారులు భయపడేవారు. ఆఖరికి సీఎం చంద్రబాబును కూడా వేధించారు. 5 లక్షల కుటుంబాలకు గ్రామీణ ఉపాధి హామీలో పని కల్పించాం. ప్రజాస్వామ్య విధానాలపై వైసీపీకి ఏమాత్రం గౌరవం లేదు. ఎక్కడ ఉన్నా వెంటాడుతాం అనే వైసీపీ ప్రకటనలు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అప్రజాస్వామిక విధానాలు సహించే ప్రసక్తే లేదు. ఆడపిల్లల భద్రతకు ప్రాధాన్యత ఇస్తాం. గొంతుకులు కోస్తాం అంటే సహించం. పిచ్చి పిచ్చి బెదిరింపులు చేయొద్దు. సంస్కారం ఉంది కాబట్టి ఇలా మాట్లాడుతున్నాం. లా అండ్ ఆర్డర్ విషయంలో కరప్షన్ లేని విధానం కోరుకుంటున్నాం అని పవన్ కళ్యాణ్ హితవు పలికారు.

Read Also- Janasena: పుంజుకుంటున్న బీజేపీ.. మంత్రి పదవికే అంకితమైన పవన్.. జనసేనకు ఎందుకీ గతి?

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు