Liquor Seized: అక్రమంగా మద్యం రవాణా చేసి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వేర్వేరు ఘటనల్లో అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి మొత్తం 72 టీచర్స్ విస్కీ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం (Shahnawaz Qasim) తెలిపిన వివరాల ప్రకారం.. సులువుగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో దండు వెంకట సుబ్బయ్య (Venkata Subbaiah)( అనే వ్యక్తి తరచుగా ఢిల్లీకి వెళ్లేవాడు. అక్కడ డిఫెన్స్‌కు చెందిన టీచర్స్ విస్కీ ఒక్కో బాటిల్‌ను రూ.850కి కొనుగోలు చేసి (Hyderabad) హైదరాబాద్‌కు తీసుకువచ్చేవాడు.
Also Read: Anganwadi – Panchayat: అంగన్‌వాడీ పంచాయతీ భవనాలకు త్వరలో శంకుస్థాపన!
ఒక్కో బాటిల్‌ను రూ.1,800
దమ్మాయిగూడ, నాగారం ప్రాంతాల్లో ఒక్కో బాటిల్‌ను రూ.1,800కి విక్రయిస్తున్నాడు. ఎప్పటిలాగే ఇటీవల ఢిల్లీ (Delhi) వెళ్లి రెండు బ్రీఫ్‌కేసుల్లో 52 బాటిళ్ల డిఫెన్స్ మద్యాన్ని తీసుకుని హైదరాబాద్ (Hyderabad) చేరుకున్నాడు.(Secunderabad) సికింద్రాబాద్‌లోని ఆల్ఫా హోటల్ వద్ద అతను నిలబడి ఉండగా సమాచారం అందుకున్న జిల్లా టాస్క్‌ఫోర్స్ సీఐ సావిత్రి (Task Force CI Savitri)తన సిబ్బందితో కలిసి దాడి చేసి పట్టుకున్నారు. నిందితుడి నుంచి మద్యం బాటిళ్లను సీజ్ చేసి కేసు నమోదు చేశారు.
హర్యానా నుంచి..
మరో ఘటనలో, హర్యానా నుంచి డిఫెన్స్ మద్యాన్ని (Hyderabad) హైదరాబాద్‌కు తీసుకువస్తున్న ముగ్గురిని (Ranga Reddy) రంగారెడ్డి జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. నగరానికి చెందిన శ్రీనాథ్ రెడ్డి, జీవన్ రెడ్డి, అన్వేశ్ రెడ్డి, సురేందర్ రెడ్డి తరచుగా కారులో హర్యానా వెళ్లి డిఫెన్స్ మద్యాన్ని కొనుగోలు చేసి (Hyderabad) హైదరాబాద్‌కు తీసుకువస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న సీఐ సుభాష్ చంద్ర తన సిబ్బందితో కలిసి వికారాబాద్ (Vikarabad) సమీపంలోని ఎన్నపల్లి క్రాస్‌రోడ్స్ వద్ద మాటు వేశారు. నలుగురు నిందితులు కారులో అటుగా రాగానే వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 20 బాటిళ్ల మద్యాన్ని సీజ్ చేశారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి వారిపై కేసులు నమోదు చేశారు.
Also Read: Sridhar Rao Audio Leak: కలకలం రేపుతున్న.. సంధ్య శ్రీధర్ ఆడియో!