Textile Park: రంగారెడ్డి జిల్లాలో టెక్స్ టైల్ పార్కు(Textile Park) కోసం 22 ఏండ్ల కిందట సేకరించిన భూములవి. టెక్స్ టైల్ పార్కు అటకెక్కింది. ఖాళీగా ఉన్న ఆయా భూములకు నేడు విపరీతమైన డిమాండ్ ఉండడంతో ఆ భూములపై గత ప్రభుత్వంలో కొంతమంది పెద్దల కన్ను పడింది. ఇదే క్రమంలో పార్కు పేరుమీద ఉండాల్సిన 141.24 ఎకరాల భూముల్లో 19.31 ఎకరాలు మాయం అయ్యాయి. కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన భూములను అక్రమంగా అమ్ముకుంటున్నారని సొసైటీలోని నేతన్నలు ఆందోళనలు చేపడుతుండగా ఉపాధి పేరుతో తక్కువ ధరకే భూములను కొనుగోలు చేసి మోసం చేశారని రైతాంగం గగ్గోలు పెడుతోంది. తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) జోక్యం చేసుకుని 22 ఏండ్ల పోరాటానికి తెర దించాలని బాధితులు కోరుతున్నారు.
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో
వస్త్ర పరిశ్రమ అభివృద్దిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం(Centrel Govt) 2003 సంవత్సరంలో టెక్స్టైల్ పార్కు(Textile Park)ను మంజూరు చేయగా అప్పటి ప్రభుత్వం రంగారెడ్డి(Ranga Reddy) జిల్లా నందిగామ మండలంలోని చేగూరు గ్రామ ప్రాంతంలో పార్కును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేయాలనుకున్న ఈ పార్కు నిర్మాణానికి 141.24 ఎకరాల భూమిని సేకరించారు. ఇందులో కొంత ప్రభుత్వ భూమి(Govt Land) ఉండగా చాలా వరకు రైతుల నుంచి పట్టా భూములను కొనుగోలు చేశారు.
Also Read: Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రదాడి దర్యాప్తులో కీలక పరిణామం
108 మంది సభ్యులతో హైదరాబాద్ టెక్స్ టైల్ పార్కు(Hyderabad Textile Park) పేరుతో సొసైటీని ఏర్పాటు చేసి రూ.7.46కోట్లను వెచ్చించి భూములు కొనుగోలు చేసినట్లు పద్మశాలీ సామాజిక వర్గానికి చెందిన నేత కార్మికులు చెబుతున్నారు. ఆ భూములను సొసైటీలోని సభ్యులకు షేర్ల రూపంలో మార్పిడి చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని భావించారు. అయితే హైటెక్ టెక్స్ టైల్ పార్కు(HiTextile Park) కాస్తా నిబంధనలకు విరుద్దంగా హైటెక్ టెక్స్ టైల్ పార్కు ప్రైవేట్ లిమిటెడ్‌గా మారింది. ఈ క్రమంలోనే ఆయా భూములను అక్రమంగా విక్రయించేందుకు కుట్రలు జరుగుతున్నాయని భూములను సొసైటీ సభ్యులకు అప్పగించాలంటూ ఏండ్ల తరబడిగా సొసైటీ సభ్యులు ఆందోళనలు చేపడుతూ వస్తున్నారు.
తాజాగ ఆదివారం సైతం టెక్స్టైల్ పార్కు నిర్మాణ ప్రాంతం వద్ద పలువురు సొసైటీ సభ్యులు ఆందోళన నిర్వహించారు. తమ పిల్లలకు ఉపాధి, ఉద్యోగాలు(Jobs) దొరుకుతాయన్న ఆశతో తక్కువ ధరకే భూములను అమ్ముకున్నామని, తీరా పరిశ్రమల ఏర్పాటు కాక తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయంటూ భూములు విక్రయించిన రైతులు సైతం ఆందోళన చేశారు.
నిధులతో పాటు భూములు మాయం
టెక్స్ టైల్ పార్కు కోసం కేంద్ర ప్రభుత్వం(Central Govt) విడుదల చేసిన నిధులు పక్కదారి పట్టాయి. అలాగే టెక్స్ టైల్ పార్కు కార్యరూపం దాల్చకపోవడంతో పార్కు కోసం సేకరించిన భూములు క్రమక్రమంగా మాయమవుతున్నాయి. రూ.58కోట్ల అంచనా వ్యయంతో 12 నెలల వ్యవధిలో పార్కును పూర్తి చేసేలా అప్పట్లో ప్రణాళికలు రూపొందించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తన వాటాగా రూ.23.20కోట్ల గ్రాంట్‌ను ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు 2006 సంవత్సరంలో తొలి విడతలో రూ.4కోట్లు, 2008 సంవత్సరంలో రూ.8కోట్లను విడుదల చేసింది.
Also Read: Anil Kumar Transferred: ఇరిగేషన్ ఈఎన్సీ అనిల్ కుమార్‌పై బదిలీ వేటు
రూ.1.10 కోట్లను మంజూరు
రాష్ట్ర ప్రభుత్వం సైతం రూ.1.10 కోట్లను మంజూరు చేసింది. అయితే కొంతమేర నిర్మాణాలు చేపట్టి గాలి కొదిలేశారు. కేంద్రం ఇచ్చిన రూ.12 కోట్లకు లెక్కలు చూపకపోవడంతో నిధులను నిలిపివేయంతోపాటు రికవరీ కోసం 2011 ఆగస్టులో టెక్స్టైల్ పార్కు ఛైర్మన్‌కు కేంద్రం లేఖ రాసింది. సంబంధిత నిధులను చెల్లించేవరకు పార్కు కోసం సేకరించిన భూముల క్రయ విక్రయాలను నిలిపివేయాలంటూ కేంద్ర టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ కొత్తూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సైతం లేఖ రాసింది. దీంతో 22ఏ కింద ఆయా భూములను నిషేధిత జాబితాలో చేర్చారు.
అంతర్గత ఒప్పందం
గత బీఆర్‌ఎస్(BRS) ప్రభుత్వ హయాంలో కొంతమంది పెద్దల కన్ను టెక్స్ టైల్ పార్కు కోసం సేకరించిన భూములపై పడింది. టెక్స్టైల్ పార్కు ప్రైవేట్ లిమిటెడ్ లో భాగస్వామ్య ఒప్పందం చేసుకున్న కొంతమంది వ్యక్తులతో అంతర్గత ఒప్పందం చేసుకుని తెరవెనుక నుంచి ప్రభుత్వ పెద్దలు తతంగం నడిపించినట్లు తెలిసింది. సొసైటీ ఛైర్మన్‌తోపాటు మరికొందరు డైరెక్టర్లతో సూత్రధారులుగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
బినామీ పేర్లతో ఎకరాకు
ఈ క్రమంలోనే ధరణి వచ్చాక నిషేధిత జాబితాలో ఉన్న 141.24 ఎకరాల్లో 19.31 ఎకరాల భూములు జాబితా నుంచి మాయం అయ్యాయి. పార్కుకు సంబంధించిన ఈ భూముల విలువ రూ.500కోట్ల వరకు ఉండగా గత ప్రభుత్వంలోని రాష్ట్ర స్థాయి మహిళా నేత ఆడపడుచు భర్త కొంతమంది బినామీ పేర్లతో ఎకరాకు రూ.75లక్షల నుంచి రూ.కోటి వెచ్చించి భూములను కొనుగోలు చేసేందుకు ఒప్పందాలు కూడా చేసుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ప్రభుత్వం మారడంతో వారి ప్రయత్నాలకు కొంత బ్రేక్ పడగా తిరిగి అవే ప్రయత్నాలు ప్రస్తుత ప్రభుత్వంలోనూ జరుగుతున్నట్లు టాక్ నడుస్తోంది
Also Read: Konda vs Congress: కొండా వర్సెస్ కాంగ్రెస్.. వరంగల్ నేతల మధ్య కోల్డ్‌వార్!