YS Jagan
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

YS Jagan: జగన్.. రప్పా రప్పా అంటే ఇదేనా?

YS Jagan: ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ (YSRCP) అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఇటీవల గుంటూరు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో విషాదకర ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. వెంగళాయపాలెనికి చెందిన వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి చెందగా, జగన్ ప్రయాణిస్తున్న కారు ఢీకొనడంతోనే అతడు ప్రాణాలు కోల్పోయినట్టుగా ప్రాథమికంగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన మరో కీలక వీడియో వెలుగులోకి వచ్చింది. కారు ముందు టైర్‌ కింద సింగయ్య (Singaiah Death) పడినట్టు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. వృద్ధుడు కారు కింద పడ్డాడంటూ జగన్ కారు పక్కనే ఉన్న కొందరు స్థానికులు అరుస్తున్నప్పటికీ డ్రైవర్ గానీ, జగన్‌ గానీ, ఇతర వైసీపీ శ్రేణులు కూడా పట్టించుకోలేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్‌గా మారింది.

Read this- US bombs Iran: ఇరాన్‌లో అమెరికా దాడులు.. ఎప్పుడూ ఉపయోగించిన బాంబుల వర్షం

ఈ వీడియో ద్వారా సింగయ్య మృతి కేసులో పోలీసులకు క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని సమాచారం. ఏటూకురు బైపాస్ వద్ద సింగయ్య ప్రమాదానికి గురయ్యాడు. కారు కింద పడడంతో తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ చనిపోయారు. సింగయ్య మృతిపై కేసు నమోదవ్వగా, వీడియోల ఆధారంగా ఘటనా స్థలంలో ఉన్నవారి నుంచి పోలీసులు సమాచారం సేకరిస్తున్నారని తెలుస్తోంది.

రప్పా.. రప్పా.. అంటే ఇదేనా

వీడియోతో క్లారిటీ రావడంతో జగన్ కారు కింద పడి సింగయ్య మరణించినట్లుగా ఆధారాలు లభించినట్టేనని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. జగన్ కారు ముందు కుడి పక్క టైర్ కింద సింగయ్య పడిపోవడం, అతడి మెడ మీదుగా కారు వెళ్లినట్టుగా అనిపిస్తోంది. వీడియో రూపంలో అంతా స్పష్టంగా కనిపిస్తుండడంతో ఆధారంగా పరిగణించి కేసు నమోదు చేయాలని పోలీసుల నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. మనిషి టైర్ కింద పడినట్లు అర్థమైనప్పటికీ డ్రైవర్ ఆగకుండా కారును ముందుకు పోనించాడనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కనీసం మానవత్వం లేకుండా ఎలా ముందుకు వెళ్లారంటూ ప్రశ్నిస్తున్నారు. ‘రప్పా.. రప్పా’ అంటే ఇదేనా? అంటూ మరికొందరు జగన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. సొంత పార్టీ కార్యకర్త స్వయంగా తన కారు కిందే పడినా ఎలా ముందుకెళ్లారంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. కాగా, ఇది మార్ఫింగ్ వీడియో అంటూ వైసీపీ శ్రేణులు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇది ఎడిటింగ్ వీడియో అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Read this- Iran Trump: ఇరాన్‌ అణుకేంద్రాలపై దాడి తర్వాత ట్రంప్ సంచలన ప్రకటన

ప్రాణం కంటే ప్రచారం గొప్పది కాదు: ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు
సింగయ్య మృతికి సంబంధించిన వీడియో వెలుగులోకి రావడంపై టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘ఒక నేత ర్యాలీకి వెళ్లిన ఎవరికీ ప్రాణం పోయే పరిస్థితి రాకూడదు. ప్రజల ప్రాణాలకంటే ఏ నాయకుడి ప్రచారమూ గొప్పది కాదు. ఈ విషాద ఘటనపై ఎటువంటి బాధ్యత తీసుకోకుండా, ఇదొక సంఘటన మాత్రమే అన్నట్టుగా వ్యవహరించటం అత్యంత దుర్మార్గం. ప్రజల ప్రాణాలను తాకట్టు పెట్టే ఈ రాజకీయం ఇప్పటికైనా ఆగాలి. రాజకీయాల కారణంగా ప్రాణాలు పోకూడదు. ర్యాలీలు, రోడ్‌షోలు జనాలకు నమ్మకాన్ని కల్పించాలి. అంతేకానీ, విషాదానికి దారితీయకూడదు. ప్రజల జీవితానికి భద్రత, గౌరవం, మానవీయతతో వ్యవహరిద్దాం. నిర్లక్ష్యాన్ని వీడుదాం’’ అని ఎంపీ పిలుపునిచ్చారు.

అంబటిపై కేసు
వైఎస్ జగన్ పర్యటన సమయంలో నిషేధాజ్ఞలు ఉల్లంఘించారంటూ వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది. నల్లపాడు, పాత గుంటూరు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదైనట్టు సమాచారం. అంబటి రాంబాబుతో పాటు మరికొందరు వైసీపీ నేతలపై కూడా ఎఫ్‌ఐఆర్‌లు నమోదైంది. జగన్ రెంటపాళ్ల పర్యటనలో పోలీసు అధికారులతో అంబటి రాంబాబు ఘర్షణకు దిగారు.

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?