Tollywood: హీరోయిన్ శిరీష లెల్ల(Shirisha Lella) మనందరికీ సుపరిచితమే. నారా రోహిత్(Nara Rohit) హీరోగా తెరకెక్కిన ‘ప్రతినిధి-2′(Prathinidhi-2) చిత్రంలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటించింది.
తన మొదటి చిత్రంతోనే మంచి పేరు తెచ్చుకుని వరుస అవకాశాలతో దూసుకెళ్తుంది. ఇక, ఈ మూవీ సమయంలోనే హీరో రోహిత్‌తో పరిచయం ప్రేమగా మారింది. అలా వీరిద్దరూ కొన్నేళ్ళు లవ్ చేసుకున్నారు. ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఇక నిశ్చితార్థంఅయిన దగ్గర నుంచి కొత్త ప్రదేశాలకు వెళ్తూ ఈ లవ్ కపుల్ చిల్ అవుతున్నారు.

ప్రేమ పెళ్లి చేసుకోనున్న నారా రోహిత్
ఈ నేపథ్యంలోనే సిరిలెల్ల ఇంస్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా, ఈ బ్యూటీ తన ఇన్‌స్టా(Instagram)లో కొన్ని ఫొటోలను అభిమానుల కోసం షేర్ చేసింది. వీరిద్దరూ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ రోహిత్ తో సరదాగా దిగిన ఫొటోలను పోస్ట్ చేసింది. వారిద్దరూ హగ్ చేసుకున్న ఫొటో కూడా షేర్ చేయడంతో ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఈ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది.
Also Read: Maneru River: ‘మానేరు’ అవినీతిపై విచారణ చేపట్టాలని.. సీఎంను కోరిన మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి
భైరవం మూవీతో హిట్ కొట్టిన నారా రోహిత్
ఇక నారా రోహిత్ (Nara Rohit)చాలా గ్యాప్ తీసుకుని విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన భైరవం చిత్రంలో నటించాడు. ఈ మూవీలో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , మనోజ్ మంచు కూడా నటించారు. ఈ సినిమాకి శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందించారు. సినిమాటోగ్రఫీ హరి కె వేదాంతం పనిచేశారు. ఇక ఎడిటింగ్ కి చోటా కె ప్రసాద్ వర్క్ చేయగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకం పై కె కె రాధామోహన్ నిర్మించారు. ఈ సినిమా లాంగ్ రన్ లో కలెక్షన్స్ సాధించి హిట్ గా నిలిచింది. రిలీజైన మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లింది.
Also Read: SpiceJet flight: హైదరాబాద్ – తిరుపతి విమానంలో సాంకేతిక సమస్య.. ఫ్లైట్‌లో 80 మంది ప్రయాణికులు!