Maneru River ( Image Source: Twitter)
తెలంగాణ

Maneru River: ‘మానేరు’ అవినీతిపై విచారణ చేపట్టాలని.. సీఎంను కోరిన మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి

Maneru River: కరీంనగర్ మానేరు రివర్‌ ( Maneru River ) ఫ్రంట్‌ పనుల్లో జరిగిన అవినీతి, అక్రమాలపై, సంబంధిత గుత్తేదారుపై, అలాగే గత పాలకుల పాత్రపై సమగ్ర విజిలెన్స్ విచారణ చేపట్టాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని సీఎం రేవంత్ రెడ్డిని (Revanth Reddy) గురువారం కలిసి ఆయన ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. మానేరు రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధి పనుల పేరుతో గత ప్రభుత్వం రూ. 500 కోట్లు మంజూరు చేసిందన్నారు. అందులో పర్యాటక శాఖ రూ. 100 కోట్లు, నీటిపారుదల శాఖ రూ. 100 కోట్లు నిధులు విడుదల చేశాయని తెలిపారు.

Also Read: Kuberaa Twitter Review: ‘కుబేర’ ట్విట్టర్ టాక్.. తిప్పరా మీసం అంటున్న అక్కినేని ఫ్యాన్స్.. హిట్ కొట్టినట్టేనా?

గత ప్రభుత్వ హయాంలో ఈ రివర్‌ ఫ్రంట్‌ నిర్మాణ పనులు చేపట్టారని, అయితే పనులను తమ అనుచరులకు అప్పగించి, నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా గుత్తేదారు నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. పనులు పూర్తి కాకుండానే బిల్లులు చెల్లించారని, నిర్మాణంలో భారీ అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని అన్నారు. రివర్‌ ఫ్రంట్‌ పరిధిలో నిర్మించిన చెక్ డ్యామ్‌లు వర్షాకాలంలో కురిసిన వర్షాలకు పూర్తిగా కొట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. చెక్ డ్యామ్‌లు కొట్టుకుపోయిన తర్వాత కూడా రివర్‌ ఫ్రంట్‌ నిర్మాణ పనులకు నిధులు విడుదల చేశారని ఆరోపించారు. ఐదు సంవత్సరాలు గడుస్తున్నా ఈ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదని ఆయన గుర్తు చేశారు. మానేరు రివర్‌ ఫ్రంట్‌ పనుల్లో జరిగిన అవినీతి, అక్రమాలపై తక్షణమే విజిలెన్స్ విచారణ చేపట్టాలని సీఎంను కోరారు.

Also Read: Janhvi Kapoor: చేయి పట్టుకుని.. లండన్‌లో లవర్‌తో ఛిల్ అవుతోన్న జాన్వీ కపూర్.. పక్కనే చెల్లి కూడా?

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు