Commissioner Karnan: అవును జీహెచ్ఎంసీ(GHMC)లో అదనపు కమిషనర్ల సంఖ్యను కుదించేందుకు కమిషనర్ కర్ణన్(Commissioner Karnan) చాలా సీరియస్ గా వర్కవుట్ చేస్తున్నట్లు సమాచారం. సుమారు రెండు నెలల క్రితం కమిషనర్ గా బాధ్యత చేపట్టిన తర్వాత జీహెచ్ఎంసీలో(GHMC) ఇంత మంది అదనపు కమిషనర్ల అవసరమా? అంటూ కమిషనర్ పలు సందర్భాల్లో తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసిన కమిషనర్ సీడీఎంఏ(CDMA) నుంచి త్వరలోనే జీహెచ్ఎంసీకి సుమారు 30 మంది ఆఫీసర్లు వివిధ హొదాల్లో రానున్నట్లు సమాచారం. వారి వచ్చిన వెంటనే అదనపు కమిషనర్ల సంఖ్యను 11 నుంచి ఆరుకు కుదించనున్నట్లు తెలిసింది. వీరిలో సీనియర్ ఆఫీసర్లకు ప్రియార్టీ ఇచ్చి,వారిని రెండు నుంచి మూడు విభాగాలకు అదనపు కమిషనర్ గా నియమించేందుకు కమిషనర్ సిద్దమైనట్లు విశ్వసనీయ సమాచారం.
రెండు నుంచి మూడు విభాగాలను కేటాయిస్తూ
కానీ ప్రస్తుతం ఒక్క విభాగానికి ఒక అదనపు కమిషనర్ ఉన్నా, ఆయా విభాగాలపై ప్రజల నుంచి ఫిర్యాదుల అందుతూనే ఉన్నాయి. క్షేత్ర స్థాయిలో అనేక రకాలైన ఆరోపణలు, విమర్శలు తప్పటం లేదు. రేపు కమిషనర్ అదనపు కమిషనర్ల సంఖ్యను కుదించిన తర్వాత ఏకంగా ఒక్కో అదనపు కమిషనర్‌కు రెండు నుంచి మూడు విభాగాలను కేటాయిస్తూ, వారు సమర్థవంతంగా పర్యవేక్షిస్తారా? అన్న ప్రశ్న తలెత్తుతుంది. ప్రస్తుతమున్న అదనపు కమిషనర్లలో ఎక్కువ మంది వివిధ విభాగాలపై పట్టు కల్గిన వారే ఉన్నందున కమిషనర్ వారి విషయంలో కాన్ఫెడెంట్‌గా ఉన్నట్లు సమాచారం.
Also Read: Honeymoon Murder Case: హనీమూన్ కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్.. అందరి అంచనాలు తలకిందులు!
కోత పడే ఆ అయిదుగురు అదనపు కమిషనర్లు ఎవరు?
జీహెచ్ఎంసీలో కొద్ది రోజుల క్రితం వరకు మొత్తం 14 మంది అదనపు కమిషనర్లు విధులు నిర్వర్తించేవారు. వీరిలో ముందుగా ఓ అదనపు కమిషనర్ బదిలీ కాగా, మిగిలిన వారిలో ఇద్దరు ఐఏఎస్(IAS) లు కూడా ఇటీవలే బదిలీ అయ్యారు. ఇక మిగిలిన 11 మంది అదనపు కమిషనర్లలో ప్రసాదరావు(Prasada Rao Committee) కమిటీ సిఫార్సు మేరకు కమిషనర్ కర్ణన్ అదనపు కమిషనర్ల సంఖ్యను ఆరుకు కుదించాలని నిర్ణయించిన నేపథ్యంలో మిగిలిన ఆ అయిదుగురు అదనపు కమిషనర్లు ఎవరు? అన్న అంశంపై జీహెచ్ఎంసీ(GHMC)లో వాడీవేడీ చర్చ జరుగుతుంది. ఎవరెవరి పోస్టులు కట్ అవుతాయోనన్న భయంతో పలువురు అదనపు కమిషనర్లు భయాందోళనకు గురవుతున్నారు. వీరిలో ఒకరిద్దరు అదనపు కమిషనర్లు కమిషనర్ తమను డిమోషన్ చేసే వరకు ఎందుకు వేచి ఉండాలని భావించి, బదిలీ కోసం సర్కారు వద్ద ఆర్జీలు పెట్టుకున్నట్లు సమాచారం.
అధికారులు అంగీకరిస్తారా
మరి కొందరు పోస్టు ఏదైతే ఏమున్నది జీహెచ్ఎంసీలోనే కొనసాగాలని భావిస్తున్నట్లు తెలిసింది. కానీ ఇప్పటి వరకు అదనపు కమిషనర్లుగా విధులు నిర్వర్తించి, ఇపుడు జాయింట్ కమిషనర్, సర్కిళ్లకు డిప్యూటీ కమిషనర్లుగా విధులు నిర్వహించేలా మార్పులు చేస్తే, అందుకు అధికారులు అంగీకరిస్తారా? అన్న ప్రశ్న తలెత్తుతుంది. కానీ ఈ విషయంలో కమిషనర్ ఒక క్లారిటీగా ఉన్నట్లు తెలిసింది. సీనియర్ అధికారులకు ప్రాధాన్యతనిచ్చి, వారికి ముఖ్యమైన రెండు నుంచి మూడు విభాగాల బాధ్యతలను కట్టబెట్టాలని భావిస్తున్నారు. ప్ర్రస్తుతం వివిభ విభాగాలకు జాయింట్ కమిషనర్‌గా వ్యవహారిస్తున్న పలు మహిళా ఆఫీసర్లను అదనపు కమిషనర్లుగా ప్రమోట్ చేయాలని కూడా కమిషనర్ భావిస్తున్నట్లు సమాచారం.
Also Read: MP Kishan Reddy: క్రాస్ రోడ్‌లో తెలంగాణ ప్రజలు.. పూర్తిగా విఫలమైన కాంగ్రెస్