PJR Flyover: అత్యంత రద్దీగా ఉండే ఐటీ(IT) కారిడార్ లోని అత్యంత రద్దీ, ట్రాఫిక్‌తో ఉన్న ఔటర్ రింగ్(ORR) రోడ్డు నుండి కొండాపూర్ రూట్ లో ట్రా ‘ఫికర్’ కు త్వరలోనే చెక్ పడనుంది. ఔటర్ రింగ్(ORR) రోడ్డు నుంచి కొండాపూర్ రూట్ లో వాహానాలను మరింత వేగంగా ప్రయాణించేందుకు వీలుగా స్ట్రాటెజికల్ రోడ్ డెవలప్ మెంట్ ప్రొగ్రామ్(Strategic Road Development Program) కింద జీహెచ్ఎంసీ(GHMC) ప్రతిపాదించిన పీజేఆర్ ఫ్లై ఓవర్ ప్రారంభానికి ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. ప్రస్తుతం ఈ రూట్ లో ప్రస్తుతం ప్రతి రోజు 50 వేల వాహానాలు రాకపోకలు సాగిస్తున్నట్లు అధికారులు అంచనాలేశారు. ఈ రూట్‌లో ఒక వాహానం ట్రాఫిక్‌ను అధిగమించి ఫ్లై ఓవర్ నిర్మించిన 1.2 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు సుమారు 12 నిమిషాల 25 సెకనుల సమయం పడుతుండగా, ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే ఈ జర్నీ సమయం 2 నిమిషాల 25 సెకనులకు తగ్గుతుందని జీహెచ్ఎంసీ(GHMC) అధికారును చెలిపారు.
ఏటా రూ. 1100 కోట్లు
కొండాపూర్, శిల్పా లే అవుట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ వేగంగా ముందుకు సాగే వీలు కల్గుతుందని తెలిపారు. అలాగే ఈ రూట్‌లో రాకపోకలు సాగించే వాహానాల ఫ్లూకు తరుచూ అడ్డంకులేర్పడుతుండటంతో రాకపోకలు సాగించే సుమారు 50 వేల వాహానాల్లో సుమారు 3 వేల 7 లీటర్ల ఇంధనం వృథా ఖర్చవుతుందని, ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ ఇంధనం కూడా ఆదా కానున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ప్రస్తుతమున్న పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్ కు రూ. వంద వేసుకున్నా, ఏటా రూ. 1100 కోట్లు, నెలకు దాదాపు రూ.90 లక్షల వరకు ఇంధనం ఖర్చు కూడా ఆదా కానున్నట్లు జీహెచ్ఎంసీ(GHMC) అధికారులు లెక్కలేస్తున్నారు. ఈ నెల 28వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేతుల మీదుగా ఈ ఫ్లై ఓవర్ ను ప్రారంభించనున్నట్లు జీహెచ్ఎంసీ వెల్లడించింది.
Also Read: Srinivas Goud: మహబూబ్ నగర్‌ను ఏం చేయదలుచుకున్నారు.. శ్రీనివాస్ గౌడ్
ఫ్లై ఓవర్ పై రయ్.. రయ్
ప్రస్తుతం ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటూ అడుగడుగునా అడ్డంకులేర్పడుతూ మెల్లిగా సాగుతున్న ట్రాఫిక్ ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత రయ్ రయ్ మంటూ పరుగులు పెట్టనుంది. అంతేగాక ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొండాపూర్(Kondapur), హఫీజ్‌పేట్ మార్గాల్లో వెళ్లే వాహనాలకు ఈ ఫ్లై ఓవర్ చాలా ఉపయోగకరంగా మారనుంది. హైటెక్ సిటీ(Hitec City), ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు మెరుగైన కనెక్టివిటీ ఏర్పడుతుందని అధికారులు భావిస్తున్నారు. కొండాపూర్ ప్రాంతం నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్(Shamshabad), అక్కడి నుండి కొండాపూర్ ప్రాంతాలకు వెళ్ళేందుకు గచ్చిబౌలీ వద్ద ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా నేరుగా వెళ్లే వెసులుబాటు కలగనుంది. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ మౌలిక సదుపాయాల అభివృద్ధి మరో అడుగు ముందుకు పడినట్టవుతుందని అధికారులు భావిస్తున్నారు.
Also Read: MP Kishan Reddy: క్రాస్ రోడ్‌లో తెలంగాణ ప్రజలు.. పూర్తిగా విఫలమైన కాంగ్రెస్