Banakacherla Project( IMAGE CREDIT: TWITTER)
Politics

Banakacherla Project: ప్రతిపక్షం మిస్టేక్స్ పై కాంగ్రెస్ ఎటాక్!

Banakacherla Project: ఏపీలో నిర్మించబోతున్న బనకచర్ల ప్రాజెక్టు (Banakacharla Project) ఇప్పుడు రాజకీయ ఎజెండాగా మారిపోయింది. గత వారం రోజులుగా అన్ని పార్టీలు బనకచర్లపైనే మాట్లాడుతున్నాయి. అన్ని పార్టీల లీడర్ల మధ్య ఈ అంశం వివాదాస్పద చర్చకు తెరలేపింది. రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ Congress). బీజేపీ, (BJP)  బీఆర్ఎస్‌ (BRS)  పార్టీలపై విరుచుకు పడుతున్నది. ఈ రెండు పార్టీలు తెలంగాణ హక్కులు కాలరాసేందుకు ప్రయత్నించాయని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)  వెల్లడించారు.

ఇటీవల ఎంపీలతో జరిగిన అఖిల పక్షం మీటింగ్‌లోనే ఆయన అదే స్టాండ్‌పై నిలుచున్నారు.  (Banakacharla Project)బనకచర్లపై ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్లడానికి కారణం బీఆర్‌ఎస్సే అంటూ సీఎం నొక్కి చెప్పారు. బీఆర్‌ఎస్‌కు కేంద్రంలోని బీజేపీ కూడా సహకరిస్తూ వచ్చిందని రెండు పార్టీలను దోషులుగా నిలపెట్టేందుకు కాంగ్రెస్ తన‌దైన శైలీలో ప్రయత్నించడం గమనార్హం. ఈ ప్రాజెక్టు అంశంతోనే తన రాజకీయ ప్రత్యర్థులను దెబ్బకొట్టే విధంగా కాంగ్రెస్ వ్యూహాత్మకగా వ్యవహరిస్తున్నది. బనకచర్ల మిస్టేక్స్‌ను రాజకీయాస్త్రంగా మలుచుకొని బీఆర్‌ఎస్ ఖాతాలో మరో తప్పిదాన్ని వేయాలని కాంగ్రెస్ భావిస్తున్నది.

 Also ReadKonda vs Congress: కొండా వర్సెస్ కాంగ్రెస్.. వరంగల్‌ నేతల మధ్య కోల్డ్‌వార్!

ఇందుకోసం గత ప్రభుత్వం హయంలో ఈ ప్రాజెక్టుపై తీసుకున్న స్టాండ్ ఏమిటీ? సీడబ్ల్యూసీతో కేసీఆర్ ఏం చెప్పారు? మినిట్స్‌లో ఏమున్నాయి, కేంద్రం ఎలా సహకరించింది, దీని వలన తెలంగాణ ప్రజలకు ఎలాంటి నష్టాలు జరగబోతున్నాయి, (Banakacharla Project) బనకచర్లపై బరిగీసి కొట్లాడేదెవరనే తదితర అంశాలపై కాంగ్రెస్ సాక్ష్యాలతో ప్రజలకు వివరించాలని ప్లాన్ చేసింది. సంపూర్ణ వివరాలను లీకులు ఇస్తూ బీఆర్‌ఎస్ వైఫల్యాలను పబ్లిక్‌లోకి తీసుకువెళ్లనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం, పార్టీలో ప్రత్యేకంగా టెక్నికల్, పొలిటికల్, లీగల్ కమిటీలను కూడా వేయాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇప్పటికే ప్రాథమిక వివరాలతో ఎటాక్ చేయాలని టీపీసీసీ స్పోక్స్ పర్సన్లకు ఆదేశాలు ఇచ్చింది.

ప్రతిపక్షంపై రేవంత్ ఎటాక్
బనకచర్ల ప్రాజెక్టును తాము వ్యతిరేకించినట్లు బీఆర్ఎస్ (BRS) చెబుతున్న మాటల్లో నిజం లేదని సీఎం రేవంత్ (Revanth Reddy కొట్టి పరేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వమే గోదావరి జలాలు తరలింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఆయన మండిపడుతున్నారు. అంతేగాక పార్టీ ఆధ్వర్యంలోనూ బీఆర్‌ఎస్ (BRS) తప్పిదాలను బలంగా తీసుకువెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. బీఆర్‌ఎస్ (BRS) చేసిన కుట్రలను త్వరలోనే బయటపెడతామని సీఎం కూడా అఖిల పక్షం మీటింగ్‌లోనే స్పష్టం చేశారు.

ఈ ప్రాజెక్టును తప్పకుండా అడ్డుకుంటానని, ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు రాకుండా కేంద్రాన్ని నిలదీస్తానని సీఎం హామీ ఇచ్చారు. నీళ్లు, నిధులు, నియామకాల ఎజెండాలోనే తెలంగాణ సాధించుకున్నామని, కానీ, గడిచిన పదేళ్లలో ఈ మూడు ట్యాగ్ లైన్లు నిర్వీర్యమయ్యాయని వివరించారు. నిధులన్నీ నిర్లక్ష్యం చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు. నియామకాల్లో గోల్‌మాల్‌ క్రియేట్ చేసి పోస్టులు భర్తీ కాకుండా కుట్రలు పన్నారని సీఎం వివరిస్తూ వస్తున్నారు. ఇక నీళ్ల విషయంలో దోపిడీ జరిగిందనడానికి బనకచర్లనే ఊదాహరణగా కాంగ్రెస్ చెబుతున్నది. పదేళ్లలో సొంత రాష్ట్రంలోనే ఎక్కువ దోపిడీ, అన్యాయం జరిగిందంటూ కాంగ్రెస్ పెత్త ఎత్తున ప్రచారానికి సిద్ధం అయింది. కేసీఆర్‌ను ద్రోహిగా నిలపెట్టేందుకు కాంగ్రెస్ వినూత్నంగా స్ట్రాటజీని ఎంచుకున్నది.

ఇచ్చింది కాంగ్రెస్సే.. రక్షించేది కాంగ్రెస్సే
‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్, రక్షించేదీ కాంగ్రెస్సే’ అనే స్లోగన్‌ను ఆ పార్టీ ఎత్తుకోనున్నది. తెలంగాణ పరిరక్షణ (Congress)  కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందని సీఎం కూడా స్పష్టం చేశారు. ఒక వైపు (BRS) బీఆర్‌ఎస్‌ను మోసపూరిత పార్టీగా చిత్రీకరిస్తూనే, తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ మాత్రమే అండగా ఉంటుందనే విషయాన్ని జనాల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లనున్నారు. ఇదే అంశంపై టీపీసీసీ అధ్యక్షుడు కూడా పార్టీ నేతలకు ఆదేశాలు ఇచ్చారు.

తాము అధికారం చేపట్టగానే తెలంగాణ ప్రయోజనాలను రక్షించేందుకు బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకుంటున్నామని (Congress) కాంగ్రెస్ స్పష్టమైన సంకేతాన్ని ఇవ్వనున్నది. మళ్లీ ప్రాంతీయ సెంటిమెంట్‌ను క్రియేట్ చేసి త ద్వారా లబ్ధి పొందాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. అంతేగాక (Banakacharla Project) బనకచర్ల ప్రాజెక్టుపై నిరంతరం చర్చలు పెట్టి, ప్రతిపక్ష పార్టీలపై ప్రజలు విశ్వాసం కోల్పోయేలా చేయాలనిది కాంగ్రెస్ భావన.

 Also Read: MLC Kavitha: కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడి తీసుకురావాలి!

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు