Chandrababu and YS Jagan
ఆంధ్రప్రదేశ్

YS Jagan: వైఎస్ జగన్ ఉంగరం వెనుక పెద్ద కథే ఉందిగా!

YS Jagan: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) మునుపు ఎన్నడూ లేని విధంగా కొత్తగా చేతికి ఉంగరం పెట్టుకోవడంపై పెద్ద చర్చే జరుగుతోంది. అసలు ఆ ఉంగరం వెనుక కథ ఏంటి? ఏం జరుగుతోంది..? అని సొంత పార్టీలోనే చర్చ జరుగుతున్నది. వాస్తవానికి ఆడంబరాలకు జగన్ చాలా దూరంగా ఉంటారు.. ఐతే ఉంగరం పెట్టుకోవడం అందులోనూ అది బంగారం కాకుండా ఏదో నలుపు రంగులో ఉండటంతో ఏదో తేడా కొడుతోంది అని మీడియా.. సోషల్ మీడియాలోనూ చర్చ సాగుతోంది. ఇంతకీ ఈ ఉంగరం వెనకున్న కథేంటి? ఎందుకు ఇది వాడతారు? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి..

ఇదీ అసలు కథ..
అవును.. ఇప్పుడు అంతా టెక్నాలజీ యుగం కదా..! ఏదైనా సాధ్యమే అవుతుంది. నిద్ర లేచింది మొదలుకొని పడుకునే వరకూ అన్నీ టెక్నాలజీతోనే నడుస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే టెక్నాలజీ అనేది మన జీవనంలో భాగం అయ్యింది. ఐతే ఇప్పుడు జగన్ కూడా అదే టెక్నాలజీతోనే ముందుకు సాగుతున్నారని తెలుస్తోంది. ఎవరైనా జ్యోతిష్య నిపుణుల సూచనల మేరకు ఈ ఉంగరం ధరించారా? లేదంటే సీఎం చంద్రబాబును అచ్చు గుద్దినట్టుగా ఫాలో అవుతున్నారా..? అని కూడా చర్చ జరుగుతున్నది. ఐతే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. జగన్‌ ఎడమ చేతి మధ్య వేలికి ఉంగరంలా ఉంది కానీ.. అది ఉంగరం కాదు హెల్త్‌ ట్రాకర్‌ రింగ్‌.

Also Read- Air India Flights Cut: విమానాల్లో వరుస సమస్యలు.. ఎయిర్ ఇండియా షాకింగ్ నిర్ణయం.. సారీ అంటూ!

అటు బాబు.. ఇటు జగన్!
వాస్తవానికి.. సీఎం చంద్రబాబు ఈ మధ్య ప్రతి సమావేశంలోనూ పదేపదే హెల్త్‌ ట్రాకర్‌ రింగ్‌ గురించి ప్రస్తావిస్తున్న సంగతి తెలిసిందే. తాను ఎంతసేపు ఏయే పనులు చేస్తున్నానని తెలుసుకోవడానికి.. మరీ ముఖ్యంగా ఎంతసేపు నిద్రపోతున్నాననేది తెలుసుకోవడానికి రింగ్‌ వాడుతున్నట్లు చంద్రబాబు పలుమార్లు చెప్పారు. దీంతో అచ్చం చంద్రబాబు మాదిరిగానే జగన్‌ కూడా కూడా అలాంటి ఉంగరం పాటిస్తున్నారు. ఇప్పుడిదే రాష్ట్ర రాజకీయాల్లో సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది. తొలుత ఈ ఉంగరం రిషికేశ్ వెళ్ళినప్పుడు పూజలు చేపించి చేతికి ధరించారని హడావుడి జరిగింది.. కానీ, గురువారం నాడు మీడియా సమావేశంలో పదే పదే ఉంగరం తిప్పుతూ కనిపించడంతో ఇది దేవుళ్ళకు సంబంధించినది అని అంతా అనుకున్నారు కానీ.. అబ్బే అస్సలు కానీ కాదని టెక్నాలజీకి సంబంధించినదని తేలిపోయింది.

Also Read- Tirumala Darshan Tickets: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఇవాళే మంచి ఛాన్స్.. త్వరపడండి!

ఉంగరం ఎలా పనిచేస్తుంది?
అది అందరూ అనుకున్నట్టుగా ఉంగరం కాదు.. హెల్త్ మానిటర్ ఎక్యూప్మెంట్. మైక్రో చిప్ సాయంతో ఆరోగ్యాన్ని మానిటరింగ్ జరుగుతుంది. కాగా, అటు అధికారం కోల్పోవడం.. ఇటు తనపై, పార్టీ నేతలపై వరుస కేసులు, అరెస్టులతో జగన్ ఈ మధ్య ఎక్కువగా టెన్షన్ పడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ క్రమంలోనే జగన్ పల్స్ రేటు, బీపీ, ఇతర ఆరోగ్యపరమైన అంశాలను ఈ ఉంగరం అనలైజ్ చేయనున్నది. అందులోని డేటా ఆధారంగా డాక్టర్లు సలహాలు, వైద్యం అందించనున్నారు. ఐతే.. సోషల్ మీడియాలో మాత్రం టీడీపీ, జనసేన కార్యకర్తలు, నేతలు చిత్ర విచిత్రాలుగా కామెంట్స్ చేస్తున్నారు. రింగ్ లో పవర్ ఉందని చంద్రబాబును చూసి జగన్ తెలుసుకున్నారు కాబట్టే ఇలా ఫాలో అవుతున్నారని సెటైర్లు వేస్తున్న పరిస్తితి. ఇక దీన్ని కౌంటర్ చేయడానికి వైసీపీ నానా తిప్పలు పడుతున్నది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు