GHMC: శరణార్థుల సర్టిఫికెట్లపై.. నివేదిక కోరిన కేంద్రం!
GHMC(IMAGE CREDIT: TWIIER)
హైదరాబాద్

GHMC: శరణార్థుల సర్టిఫికెట్లపై.. నివేదిక కోరిన కేంద్రం!

GHMC: హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ (GHMC)ద్వారా జారీ అవుతున్న జనన, మరణ ధృవీకరణ పత్రాల (Birth and death certificates) జారీపై కేంద్ర ప్రభుత్వం (CentralGovernment) దృష్టి సారించినట్లు సమాచారం. నగరంలోని పలు ప్రాంతాల్లో నివసిస్తున్న రోహింగ్యాలు, ఇతర దేశాల నుంచి వచ్చిన శరణార్థులకు జారీ చేసిన సర్టిఫికెట్లపై ఇప్పటికే నిఘా వర్గాలు సమర్పించిన నివేదికల ఆధారంగా, త్వరలోనే కేంద్రం జీహెచ్‌ఎంసీని (GHMC) సమగ్ర నివేదికలు కోరనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. 2021 నుంచి ఇప్పటి వరకు జారీ చేసిన పలు బర్త్, డెత్ సర్టిఫికెట్లకు సంబంధించి అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి.

గత కమిషనర్ ఇలంబర్తి (Commissioner Ilambarthi) ఈ అంశంపై ఇంటెలిజెన్స్ వర్గాలతో దర్యాప్తు చేయించగా, కొందరు హెల్త్ అసిస్టెంట్లు లంచాలు తీసుకుని అడ్డదారిలో సర్టిఫికెట్లు జారీ చేసినట్లు వెల్లడైంది. దీనిపై జీహెచ్‌ఎంసీ (GHMC)  17 మంది హెల్త్ అసిస్టెంట్లతో పాటు మరో ఆరుగురు వైద్యాధికారులపై చర్యలు తీసుకుంది. కొద్ది రోజుల క్రితం జరిగిన కౌన్సిల్ సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లు, జీహెచ్‌ఎంసీ (GHMC) పరిధిలో ‘హోమ్ బర్త్’ పేరుతో అడ్డదారిలో జనన, మరణ ధృవీకరణ పత్రాలు జారీ అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని బీజేపీ కార్పొరేటర్లు, నేతలు పలువురు కేంద్ర మంత్రుల ద్వారా కేంద్ర ప్రభుత్వం (Central Government) దృష్టికి తీసుకెళ్లారు. దీనితో కేంద్రం నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసినట్లు తెలిసింది. స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ దర్యాప్తు చేయించగా, భారీ సంఖ్యలో నకిలీ సర్టిఫికెట్లు జారీ చేసిన విషయం వెలుగు చూసింది.

 Also Read: Farmer Welfare Initiatives: రైతుల సంక్షేమంపై.. తెలంగాణ ప్రభుత్వం భేష్!

కేంద్రం నివేదిక కోరింది..
దీంతో, 2021లో సుమారు 21 వేలకు పైగా బర్త్ సర్టిఫికెట్లను రద్దు చేసిన ఘటనపై నివేదికలను సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం (Central Government) రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జీహెచ్‌ఎంసీని (GHMC) కోరినట్లు సమాచారం. 2021 నుంచి ఇప్పటి వరకు జారీ చేసిన బర్త్, డెత్ సర్టిఫికెట్లతో పాటు రద్దు చేసిన సర్టిఫికెట్ల వివరాలు, బాధ్యులపై తీసుకున్న చర్యలపై నివేదికలు సమర్పించాలని కేంద్రం సూచించడంతో, ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ అధికారులు నివేదికల రూపకల్పనలో నిమగ్నమైనట్లు తెలిసింది.

యూఎన్‌హెచ్‌సీఆర్ మార్గదర్శకాలు..
ఇతర దేశాల నుంచి నగరానికి వచ్చిన వారికి అవసరమైతే బర్త్, డెత్ సర్టిఫికెట్లు (Birth and death certificates) జారీ చేయాలంటే, వాటిపై యూఎన్‌హెచ్‌సీఆర్ అని కోడ్ చేస్తూ జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం జీహెచ్‌ఎంసీకి (GHMC) సిఫార్సులు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే, 2021లో జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులు ఈ పదాన్ని కోడ్ చేయకుండా జారీ చేసిన బర్త్, డెత్ సర్టిఫికెట్లలో చాలా వరకు దుర్వినియోగమైనట్లు కూడా ఆరోపణలున్నాయి. శరణార్థులను మన దేశంతో పాటు వివిధ దేశాల్లో ఉంచేందుకు, తరలించేందుకు ఐక్యరాజ్య సమితి ఒక ఎన్జీఓను కూడా నియమించినట్లు సమాచారం.

కానీ, జీహెచ్‌ఎంసీ (GHMC)  బర్త్, డెత్ సర్టిఫికెట్లలో యూఎన్‌హెచ్‌సీఆర్ అనే పదం లేకుండానే జారీ చేస్తూ, ఇలా జారీ చేసిన సర్టిఫికెట్ల వివరాలను ప్రత్యేకంగా ఒక రిజిస్టర్‌లో నమోదు చేస్తున్నట్లు తెలిసింది. ఇలాంటి వివరాలతోనే కేంద్ర ప్రభుత్వానికి నివేదికలను పంపేందుకు అధికారులు సిద్ధమైనట్లు సమాచారం. కేవలం రిజిస్టర్‌లో యూఎన్‌హెచ్‌సీఆర్ అని రాసిన బర్త్ సర్టిఫికెట్లను ఇప్పటి వరకు పాతబస్తీలోని బార్కాస్‌తో పాటు పాతబస్తీలోని జీహెచ్‌ఎంసీ (GHMC) సరిహద్దు ప్రాంతంలో నివసించేవారికి జారీ చేయగా, చాంద్రాయణగుట్ట సమీపంలోని బండ్లగూడ ప్రాంతంలో కూడా ఈ రకమైన బర్త్ సర్టిఫికెట్లను జారీ చేసినట్లు తెలిసింది. కేంద్రం ఆదేశాలను జీహెచ్‌ఎంసీ (GHMC) సంపూర్ణంగా అమలు చేయకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

 Also Read: Local Body Election: లోకల్ బాడీ ఎన్నికల్లో.. పట్టు కోసం పార్టీలు తాపత్రయం!

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..