Gajarla Ravi: కన్నీరు మున్నీరవుతున్న గాజర్ల రవి కుటుంబం
Gajarla Ravi ( Image Source: Twitter)
Telangana News

Gajarla Ravi: వీడిన 33 ఏళ్ల అజ్ఞాతం.. కన్నీరు మున్నీరవుతున్న గాజర్ల రవి కుటుంబం

Gajarla Ravi: మావోయిస్టు పార్టీ ఆంధ్రా, ఒడిశా కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ గణేష్, అలియాస్ ఉదయ్ మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. ఇతనిది జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామం. తెలంగాణ ప్రాంతం నుంచి మావోయిస్ట్ ఉద్యమంలో కీలక నేతగా కొనసాగాడు. 2004లో ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో కమిటీ ప్రతినిధిగా హాజరయ్యాడు. తాజాగా ఇతని మృతి విషయం తెలిసి కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామస్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఉద్యమాల పురిటి గడ్డగా పేరొందిన వెలిశాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. గతంలో చర్చల్లో పాల్గొన్న ముగ్గురు ప్రతినిధులు మృతి చెందడం హాట్ టాపిక్‌గా మారింది.

Also Read: Ye Maaya Chesave : నాగ చైతన్యతో కలిసి సమంత మూవీ ప్రమోషన్స్? ఫ్యాన్స్ కోరిక నెరవేరుతోందా?

గాజర్ల రవి 1984లో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్‌లో యాక్టివ్‌గా పని చేసి అరెస్ట్ అయ్యాడు. రైతు కూలీ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించాడు. డిగ్రీ చదువుతూ మావోయిస్టు పార్టీ ఉద్యమ బాట పట్టాడు. అంచలంచెలుగా ఎదుగుతూ ఆంధ్రా, ఒడిశా కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాడు. నాలుగేళ్ల కిందట దండకారణ్యంలో జరిగిన ఎన్ కౌంటర్‌లో ఇతని భార్య జిలానీ బేగం మరణించింది. తాజాగా రవి చనిపోయాడు. దీంతో అతడి 33 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం ముగిసినట్టైంది.

Also Read: Air India Flights Cut: విమానాల్లో వరుస సమస్యలు.. ఎయిర్ ఇండియా షాకింగ్ నిర్ణయం.. సారీ అంటూ!

మృతదేహాన్ని వెంటనే అప్పగించాలి

ఎన్ కౌంటర్‌లో మరణించిన గాజర్ల రవి మృతదేహాన్ని తమకు అప్పగించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇప్పటికే వారంతా ఏపీకి బయలుదేరి వెళ్లారు.

Also Read: Ashu Reddy: లైవ్ లో అషు రెడ్డిని అక్కడ టచ్ చేసి ముద్దు పెట్టిన కమెడియన్.. రిలేషన్షిప్ నిజమే అంటూ కామెంట్స్

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..