KTR Responds to ACB Notice( IMAGE credit: twitter)
Politics

KTR Responds to ACB Notice: ఏసీబీ నోటీసుపై కేటీఆర్ లేఖ.. సుప్రీం కోర్టు ఇదే చెప్పిందని వెల్లడి!

KTR Responds to ACB Notice: ఫార్ములా ఈ రేసు కేసులో (Formula E race case) గతంలో తాను ఉపయోగించిన మొబైల్ ఫోన్‌ను సమర్పించాలని ఈ నెల 16న ఏసీబీ ఇచ్చిన నోటీసుపై  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) లేఖ ద్వారా సమాధానం పంపారు. మొబైల్ ఫోన్ సమర్పించాలని కోరడం ప్రాథమిక హక్కులకు, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనని, సుప్రీంకోర్టు (Supreme Court) కూడా ఇదే విషయాన్ని చెప్పిందని కేటీఆర్ తన లేఖలో స్పష్టం చేశారు. ఈ నెల 13న ఏసీబీ (ACB Notice) పంపిన లేఖ మేరకు 16వ తేదీ ఉదయం 10 గంటలకు ఏసీబీ (ACB) కార్యాలయంలో స్వయంగా విచారణకు హాజరయ్యానని కేటీఆర్ (KTR)  తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగిన విచారణకు అన్ని రకాలుగా పూర్తి సహకారం అందించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. విచారణలో భాగంగా ఏసీబీ (ACB)  అధికారులు లేవనెత్తిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లు కేటీఆర్ (KTR) వెల్లడించారు.

మొబైల్ ఫోన్ సమర్పణపై అభ్యంతరం..
ఫార్ములా రేసు కేసులో ఈ నెల 16న విచారణ పూర్తయిన తరువాత బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 94 ప్రకారం తనకు మరో నోటీసును అందించారని కేటీఆర్ (KTR)  పేర్కొన్నారు. అందులో తాను నవంబర్ 1, 2021 నుంచి డిసెంబర్ 1, 2023 వరకు వాడిన మొబైల్ ఫోన్‌ను, (Mobile phone) ల్యాప్‌టాప్, ట్యాబ్, ఐపాడ్ వంటి ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఏసీబీకి సమర్పించాలని కోరినట్లు తెలిపారు. అయితే, బీఎన్ఎస్ఎస్‌లోని సెక్షన్ 94 కింద ఇచ్చిన నోటీసులో తాను ఆ కాలంలో వాడిన సెల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను ఎందుకు సమర్పించాలనే కారణం కానీ, ఉద్దేశం కానీ పేర్కొనలేదని కేటీఆర్ వెల్లడించారు.

ఫార్ములా కేసు విచారణకు సంబంధించి అవసరమైన అన్ని రకాల అధికారిక సంప్రదింపుల రికార్డులన్నీ రాష్ట్ర ప్రభుత్వంలోని పురపాలక శాఖ వద్దే ఉన్నాయని స్పష్టం చేశారు. అవన్నీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ మంత్రి హోదాలో తీసుకున్న నిర్ణయాలని ఆయన చెప్పారు.

 Also Read: Hyderabad District Collector: అంగన్‌వాడీ కేంద్రాల్లో.. కలెక్టర్ తనిఖీ!

ప్రాథమిక హక్కులకు భంగం..
ఫిర్యాదులో తనపై చేసిన ఆరోపణల్లో గతంలో వాడిన ఎలక్ట్రానిక్ వస్తువుల ప్రస్తావన కానీ, సంబంధం కానీ లేనప్పటికీ, వాటిని సమర్పించాలని కోరడం రాజ్యాంగం ఒక పౌరుడిగా తనకు కల్పించిన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే అని కేటీఆర్ పేర్కొన్నారు. కేసు విచారణ కోసం తాను వాడిన ఎలక్ట్రానిక్ వస్తువులు అవసరమనే ప్రాతిపదికను ఎక్కడా కూడా ప్రస్తావించలేదని గుర్తుచేశారు.

సుప్రీంకోర్టు ఆదేశాలు..
విచారణలో భాగంగా ఎలక్ట్రానిక్ వస్తువులను సేకరించాల్సి వస్తే సుప్రీంకోర్టు నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుందని కేటీఆర్ (KTR)  తెలిపారు. ఒకవేళ ప్రత్యేక పరిస్థితుల్లో సేకరించే ఎలక్ట్రానిక్ వస్తువులను విచారణ సంస్థల అధికారులు ట్యాంపర్ చేయకుండా ఉండేందుకు కఠిన నిబంధనలను పాటించాలని సుప్రీంకోర్టు పేర్కొందని గుర్తుచేశారు.

వ్యక్తిగత గోప్యతతోపాటు, విచారణ పేరుతో ఒక పౌరుడి నుంచి సరైన కారణం చెప్పకుండా ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకోవడం, సేకరించిన సమాచారాన్ని ఆయనకే వ్యతిరేకంగా వాడటం సరికాదని, ‘రైట్ ఎగైనెస్ట్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్’ అనేవి అత్యంత ముఖ్యమైనవని, వాటికి భంగం కలగకుండా ఉండేందుకే ఈ జాగ్రత్తలు సూచించిందని పేర్కొన్నారు. ఇదే అంశంలో రిట్ పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్‌కి సుప్రీంకోర్టు ఉపశమనం ఇచ్చిన విషయాన్ని కేటీఆర్ (KTR) తన లేఖలో ప్రస్తావించారు.

ఆ కేసులో రెస్పాండెంట్‌గా ఉన్న ఈడీకి, పౌరుడి మొబైల్ ఫోన్‌ను వాడటం కానీ, అందులోని సమాచారాన్ని కాపీ చేయడం కానీ చేయవద్దని కూడా స్పష్టం చేసిందని వెల్లడించారు. వివిధ దర్యాప్తు సంస్థలు విచారణలో భాగంగా సేకరించిన ఎలక్ట్రానిక్ వస్తువుల కేసులు అనేకం కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఫోన్ తనవద్ద లేదు..
2024 మొదటి త్రైమాసికంలో తాను మొబైల్ ఫోన్ మార్చానని, తాను గతంలో వాడిన ఆ పాత ఫోన్ ఇప్పుడు తన దగ్గర లేదని స్పష్టం చేశారు. తాను ఫోన్ కాకుండా ఏ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను వాడలేదని కూడా కేటీఆర్ (KTR) తన లేఖలో వెల్లడించారు.

 Also Read: MP Dharmapuri Arvind: అభద్రతా భావం ఉంటే అమెరికా వెళ్లిపో.. నా ఫోన్ ట్యాప్ ఎందుకు చేశావ్!

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు