Gold Rate ( 19-06-2025) ( Image Source: Twitter)
బిజినెస్

Gold Rate ( 19-06-2025): మళ్లీ పెరిగిన గోల్డ్ రేట్స్.. సామాన్యులకు ఇక అందనట్టేనా?

Gold Rate ( 19-06-2025): ఏపీ, తెలంగాణలోని మహిళలు బంగారానికి (Gold Rate ) అధిక ప్రాధాన్యతను ఇస్తారు. అయితే, దేశంలో ఆర్ధిక సమస్యలు పెరగడంతో ..  కొద్దీ రోజుల నుంచి పసిడి ధరలు తగ్గుతూ.. పెరుగుతున్నాయి. ఇక, గోల్డ్ రేట్స్ పెరిగితే ఎవరూ కొనుగోలు చేసేందుకు వెళ్ళడం లేదు.  తగ్గితే మాత్రం బంగారాన్ని కొనడానికి  జనాలు ఎగబడుతుంటారు. ఎందుకంటే, ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారాన్ని తప్పకుండా కొనుగోలు చేస్తారు. ఏదైనా ఫంక్షన్ లో మహిళలు బంగారు ఆభరణాలు పెట్టుకుని మురిసిపోతుంటారు.

పెళ్లిళ్లు ఎక్కువ ఉండటంతో ధరలు ఇలా అమాంతం పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా పెళ్లిళ్ల సీజన్లో ఎంతో కొంతో బంగారం రేటు పెరగడం సహజం. మరి, ఇంతలా పెరగడం ఇదే మొదటి సారి. ప్రస్తుతం రూ. 1,01,080 గా ఉంది. పెళ్లిళ్ల సీజన్బం ముగిశాక గోల్డ్ రేట్స్ తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల క్రమంలో బంగారం ధరలు తగ్గుతాయని అంటున్నారు.

నిన్నటి మీద పోలిస్తే.. రెండు రోజుల నుంచి పెరిగిన గోల్డ్ ధరలు ( Gold Rates ) మళ్లీ పెరగడంతో మహిళలు బంగారం కొనాలన్న కూడా ఆలోచిస్తున్నారు. 24 క్యారెట్స్ బంగారం ధర రూ.170 కు పెరిగి రూ. 1,01,080 గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 కు పెరిగి రూ.92,650 గా ఉంది. కిలో వెండి ధర రూ.1,22,000 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్ ( Hyderabad ) , విజయవాడలో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..

22 క్యారెట్ల బంగారం ధర

హైదరాబాద్ ( Hyderabad ) – రూ.92,650

విజయవాడ ( Vijayawada) – రూ.92,650

విశాఖపట్టణం ( visakhapatnam ) – రూ.92,650

వరంగల్ ( warangal ) – రూ.92,650

24 క్యారెట్లు బంగారం ధర

విశాఖపట్టణం ( visakhapatnam ) – రూ. 1,01,080

వరంగల్ ( warangal ) – రూ. 1,01,080

హైదరాబాద్ ( Hyderabad ) – రూ. 1,01,080

విజయవాడ – రూ. 1,01,080

వెండి ధరలు

గత కొన్ని రోజుల నుంచి వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. నాలుగు రోజుల క్రితం కిలో వెండి ధర మార్కెట్లో రూ.1,06,000 వద్ద ఉండగా.. మరో రూ.16,000 కు పెరిగింది. ప్రస్తుతం, కిలో వెండి రూ.1,22,000 గా ఉంది. ఒక్కో రోజు ఈ ధరలు తగ్గుతున్నాయి, మళ్లీ అకస్మాత్తుగా ధరలు వేగంగా పెరుగుతున్నాయి.

విజయవాడ – రూ.1,22,000

విశాఖపట్టణం – రూ.1,22,000

హైదరాబాద్ – రూ.1,22,000

వరంగల్ – రూ.1,22,000

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!