Local Body Election( image credit: twitter)
Politics

Local Body Election: లోకల్ బాడీ ఎన్నికల్లో.. పట్టు కోసం పార్టీలు తాపత్రయం!

Local Body Election: లోకల్ బాడీ ఎన్నికల్లో  (Local Body Election) పోటీ చేయాలని భావిస్తున్న లీడర్లకు ఖర్చుల అంచనాలు నిద్ర లేకుండా చేస్తున్నాయి. టిక్కెట్లపై క్లారిటీ ఇస్తున్న పార్టీ పెద్దలు, ఎన్నికల ఖర్చుపై మాత్రం ఇవ్వడం లేదట. దీంతో పోటీ చేయాలా? వద్దా? అని ఆయా నేతలు డైలమాలో ఉన్నారట. అధికార పార్టీ నుంచి టిక్కెట్ల హామీ లభిస్తున్న నేతలు కాస్త కూల్‌గానే ఉన్నప్పటికీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ లీడర్లలో మాత్రం స్పష్టమైన ఆందోళన కనిపిస్తున్నది. పైగా ఈ దఫా స్థానిక ఎన్నికల్లో భారీగా ఖర్చు ఉండవచ్చని నేతలు భావిస్తున్నారు.

జెండాలు, లీడర్ల సమన్వయం, పోస్టర్లు, ట్రాన్స్‌పోర్ట్, ప్రచార వేదికలు, సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్, పుడ్ తదితరవన్నీ తడిసి మోపవుతాయని లీడర్లు టెన్షన్ పడుతున్నారు. అయితే అధికార పార్టీ నుంచి మనీ వస్తుందనే భరోసాతో క్షేత్రస్థాయిలో లీడర్లు ఉండగా, ప్రతిపక్ష పార్టీ నుంచి మాత్రం ఇప్పటి వరకు ఇటు టిక్కెట్లు, ఆర్థిక సపోర్టుపై స్పష్టత రాలేదని స్థానిక నేతలు వాపోతున్నారు. పైగా కాంగ్రెస్, (Congress)  బీఆర్ఎస్ (BRS) పార్టీల నుంచి క్షేత్రస్థాయిలోని ఒక్కో టిక్కెట్ కోసం మినిమం నలుగురు నుంచి ఐదుగురు రేసులో ఉంటున్నారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు రసవత్తరంగా మారే ఛాన్స్ ఉన్నది.

Also Read:Local Elections: గ్రౌండ్ ప్రిపరేషన్‌లో అధికార కాంగ్రెస్!

నోటిఫికేషన్ రాకముందే హడావుడి

ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే గ్రామాల్లో రాజకీయ హడావుడి నెలకొన్నది. వాస్తవానికి ఎంపీటీసీ, MPTC) జడ్పీటీసీ (ZPTC) అభ్యర్థులకు పార్టీ గుర్తును కేటాయిస్తారు. దీంతో ఈ సీట్లకు పోటీ చేయాలని భావిస్తున్న వారు భారీగానే ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. పార్టీల మధ్య పోటీ కావడంతో స్టేట్ పార్టీ విభాగం నుంచి కొంత ఆర్థిక భరోసా అనవాయితీగా వస్తున్నది. ఈ దఫా కూడా వస్తుందనే భరోసాతో ఆశావహులు ఉన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ (Congress Party)  అయితే ఇప్పటికే ఆర్థిక సపోర్టుపై ఆయా అభ్యర్థులకు కొంత క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం.

బీఆర్ఎస్ (BRS) నుంచి ఎలాంటి స్పష్టత రాలేదని గ్రౌండ్‌లోని లీడర్లు చెప్తున్నారు. ఇక సర్పంచ్ అభ్యర్థులకు ఎలాంటి పార్టీ సింబల్స్ ఉండవు. కానీ బ్యాక్ గ్రౌండ్‌లో ఉండి తమ అభ్యర్థిగా భావిస్తున్న నేతలకు పరోక్షంగా మద్దతు పలుకుతాయి. ఈ నేపథ్యంలో ఆయా సర్పంచ్ అభ్యర్థులకూ ఎన్నికల ఖర్చుల నిమిత్తం కొంత మేరకు సాయాన్ని పార్టీలు అందజేస్తుంటాయి. కాంగ్రెస్ పార్టీ (Congress Party) మద్దతుదారులుగా పోటీ చేయాలని భావిస్తున్న వారు టిక్కెట్ల కోసం ప్రయత్నాలు చేస్తుండగా, బీఆర్ఎస్  (BRS) నేతలు మాత్రం ఆర్థిక సాయం కోసం ప్రయత్నాలు చేయడం గమనార్హం.

 Also Read: Kavitha: కలత చెందిన కవిత?.. పార్టీలో చర్చనీయాంశం!

పట్టు కోసం ప్రతిపక్షం తాపత్రాయం

పదేళ్లు పవర్‌లో ఉన్న బీఆర్ఎస్ (BRS) 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో చతికిలపడింది. ఘోర పరాజయాన్ని చవి చూసింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చాటాలని భావిస్తున్నది. అయితే, సహజంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో పవర్‌లో ఉన్న పార్టీ మెజార్టీ సీట్లు కైవసం చేసుకునే ఛాన్స్ ఉన్నది. కానీ, ఆ రికార్డును బ్రేక్ చేయాలని బీఆర్ఎస్ (BRS) భావిస్తున్నది. ఇందుకోసం ఆర్థిక పరంగా బలమైన అభ్యర్ధుల కోసం పార్టీ ఆన్వేషిస్తుందట. దీంతో ఇన్నాళ్ల పాటు (BRS) బీఆర్ఎస్‌లో సంపూర్ణంగా పనిచేస్తున్న నేతలు కాస్త మనోవేదనలో ఉన్నారు. తమకు ఆర్థిక పరమైన సమస్యలు ఉండడం వలనే టిక్కెట్ రాదనే అపోహతో ఆయా నేతలు ఉన్నారు. అయితే, బీఆర్ఎస్ (BRS) స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది సస్పెన్స్‌గా మారింది.

పవర్ హ్యాట్రిక్

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు చూపించిన కాంగ్రెస్ పార్టీ, (Congress Party) స్థానిక సంస్థల్లోనూ తన సత్తా చాటాలని భావిస్తున్నది. (BRS) బీఆర్ఎస్‌ను భూ స్థాపితం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నది. ఇందుకోసం ప్రజలతో మంచి సంబంధాలు కలిగిన నేతలను ఎంపిక చేయాలని టీపీసీసీ (MPTC) ఇప్పటికే ఆదేశాలిచ్చింది. ఆర్థిక పరంగా పార్టీ అండగా ఉంటుందని, కానీ గ్రౌండ్ లెవల్‌లో ప్రజలతో గుడ్ రిలేషన్స్ మెయింటెన్ చేసే వ్యక్తులే పార్టీకి అవసరమంటూ పీసీసీ అధ్యక్షుడు కూడా ఇటీవల ఓ కామెంట్ చేశారు. దీంతో లోకల్ బాడీ ఎన్నికల్లోనూ Local Body Election బీఆర్ఎస్‌‌ను (BRS) మట్టి కరిపించేలా కాంగ్రెస్ (Congress) వ్యూహాత్మకంగా వెళ్లనున్నది. ఇందుకోసం మండల స్థాయిలో కమిటీలను కూడా వేయనున్నది. ఈ వారంలోనే డీసీసీల అధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు కానున్నట్లు ఓ నేత తెలిపారు.

 Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో.. కీలక పరిణామాలు!

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!