Phone Tapping Case( image credit: free pic or twitter)
తెలంగాణ

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో.. కీలక పరిణామాలు!

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) సిట్ క్రమంగా దూకుడు పెంచుతున్నది. విచారణకు ప్రభాకర్ రావు సహకరించకపోతుండడంతో పక్కా వ్యూహం ప్రకారం దర్యాప్తును ముందుకు తీసుకెళుతున్నది. ఇందులో భాగంగా గతంలో రివ్యూ కమిటీ సభ్యులుగా ఉన్న అప్పటి ఛీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్, (Somesh Kumar)  డీజీపీ మహేందర్ రెడ్డి (DGP Mahendhar Reddy) నుంచి కూడా స్టేట్మెంట్లు తీసుకోవాలని సిట్ అధికారులు యోచిస్తున్నట్టు తెలిసింది.

క్యూ కడుతున్న బాధితులు

ట్యాపింగ్ బాధితులు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలని సిట్ అధికారులు సూచించిన నేపథ్యంలో పలువురు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు లైన్ కడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒక్కరోజే ప్రణీత్ రావు నేతృత్వంలోని బృందం ఆరు వందల మందికి పైగా ఫోన్లను ట్యాప్ చేసినట్టు ఇప్పటికే అధికారులు గుర్తించారు. వీరందరికీ సమాచారం ఇచ్చి పిలిపిస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం టీపీసీసీ అధికార ప్రతినిధి ముంగి జైపాల్ రెడ్డి సిట్ ఆఫీస్‌కు వచ్చారు.

 Also Read: Rythu Bharosa: రైతుల ఖాతాల్లో.. రూ.1,313.53 కోట్లు జమ!

సాక్ష్యం ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన ఫోన్‌ను ట్యాప్ చేశారని చెప్పారు. తన డ్రైవర్ ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారన్నారు. తన ప్రతీ కదలికను గమనించారని చెప్పారు. వీటి ఆధారంగా తనిఖీల పేర ఇబ్బందులు పెట్టినట్టు తెలిపారు. అప్పట్లో తనకు ఎదురైన ఇబ్బందులను సిట్ అధికారులకు చెప్పానన్నారు. ఇక, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తరపున సర్వేలు చేసిన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గుండ్లపల్లి సైదులు కూడా సిట్ ఆఫీస్‌కు వచ్చారు. తన ఫోన్‌ను ఎన్నికల సమయంలో ట్యాప్ చేసిన విషయం సిట్ అధికారుల ద్వారానే తెలిసిందన్నారు. దర్యాప్తు అధికారులు అడిగిన సమాచారాన్ని తెలియచేసినట్టు తెలిపారు.

ప్రభాకర్ రావు డుమ్మా

బుధవారం ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు (Prabhakar Rao)  విచారణకు రాలేదు. నిజానికి మంగళవారమే ఆయన రావాల్సి ఉంది. అయితే, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (pcc Mahesh Kumar Goud)  సాక్ష్యం ఇవ్వడానికి వచ్చిన నేపథ్యంలో బుధవారం రావాలని ప్రభాకర్ రావుకు (Prabhakar Rao) సూచించారు. కానీ, ఆయన రాలేదు. దాంతో నేడు విచారణకు రావాలని సిట్ అధికారులు (SIT officials) సూచించినట్టు తెలిసింది.

ప్రణీత్ రావు హాజరు

ఈ కేసులో మరో కీలక నిందితుడిగా ఉన్న ప్రణీత్ రావు (Praneeth Rao)  సిట్ విచారణకు హాజరయ్యాడు. కొన్ని డాక్యుమెంట్లను అధికారులకు అందచేశాడు. కేసులో కీలక సాక్ష్యం అయిన హార్డ్ డిస్కుల ధ్వంసంపై మరోసారి ఆయనను ప్రశ్నించినట్టు తెలిసింది. అయితే, అడిగిన ప్రతీ ప్రశ్నకు అంతా పై అధికారుల సూచనల మేరకే చేశానని ప్రణీత్ రావు (Praneeth Rao) జవాబు ఇచ్చినట్టు సమాచారం.

ఆ ఇద్దరివి కూడా..

బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఛీఫ్ సెక్రెటరీగా పని చేసిన సోమేశ్ కుమార్,( Somesh Kumar)  మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి (Mahendhar Reddy)  నుంచి కూడా వాంగ్మూలాలు తీసుకోవాలని సిట్ అధికారులు నిర్ణయించినట్టుగా తెలిసింది. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన రివ్యూ కమిటీలో ఈ ఇద్దరు కూడా సభ్యులుగా పని చేశారు. కమిటీ దృష్టికి ప్రభాకర్ రావు ఎన్ని ఫోన్ నెంబర్లు తీసుకు వచ్చారు, ఆ నెంబర్లు ఎవరివని చెప్పారు అనే దాంతోపాటు మరికొన్ని వివరాలు తీసుకోవాలని భావిస్తున్నారు.

 Also Read: Local Elections: గ్రౌండ్ ప్రిపరేషన్‌లో అధికార కాంగ్రెస్!

సుప్రీంకోర్టుకు నివేదిక

సుప్రీంకోర్టు కల్పించిన మధ్యంతర రక్షణతో ( Prabhakar Rao) ప్రభాకర్ రావు సిట్ విచారణకు హాజరవుతున్నాడు. అయితే, విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు చెప్పినా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడని సిట్ అధికారులు చెబుతున్నారు. ఇదే స్థితి కొనసాగితే బాధితుల నుంచి సేకరిస్తున్న స్టేట్మెంట్లను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని అధికారులు భావిస్తున్నారు. ఆయనకు ప్రస్తుతం ఉన్న మధ్యంతర రక్షణ లేకుండా చేస్తే పెదవి విప్పే అవకాశం ఉందని చెబుతున్నారు.

box
సీఎం స్టేట్మెంట్ తీసుకుంటారా?

అవసరమైన పక్షంలో సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకోవాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. గత సెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ( Revanth Reddy)  తన, తన కుటుంబ సభ్యులతోపాటు సన్నిహితుల ఫోన్లు ట్యాప్ అయ్యాయని పలుమార్లు బహిరంగంగానే చెప్పారు. ఇప్పటికే సీఎం సోదరుల వద్ద డ్రైవర్లుగా పని చేసిన వారి ఫోన్లను ట్యాప్ చేసినట్టు అధికారులు గుర్తించారు.

(ఇండికేషన్)
సిట్ ముందుకు ఆ ఇద్దరు

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకున్నది. గత హోమ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ జితేందర్(ప్రస్తుత డీజీపీ)తో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్‌ అనిల్ కుమార్‌ను సిట్ ప్రశ్నించింది. వీరిద్దరి దగ్గర నుంచి స్టేట్మెంట్లను రికార్డ్ చేసింది. రివ్యూ కమిటీలో వీరు కీలక సభ్యులుగా ఉన్నారు. ప్రభాకర్ రావు ఇచ్చిన ఫోన్ నెంబర్లను రివ్యూ కమిటీ నేరుగా డీవోటీకి పంపారు. 2023 నవంబర్‌లో 600 సెల్ ఫోన్ నెంబర్స్‌ను రివ్యూ కమిటీకి ప్రభాకర్ రావు (Pranhakar Rao)  అందించాడు. సాధారణ ఎన్నికల సమయంలో మావోయిస్టుల పేరుతో ఫోన్లను ట్యాప్ చేశారు. అధికార, ప్రతిపక్ష నేతలతోపాటు, వ్యాపారవేత్తలు, ఐఏఎస్, ఐపీఎస్‌ల ఫోన్లను ట్యాప్ చేశారు. దానికి సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు సిట్ జితేందర్, అనిల్ స్టేట్మెంట్లను తీసుకున్నది.

 Also Read: GHMC Commissioner and CDMA: అదనపు కమిషనర్ల కుదింపుపై గందరగోళం!

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్