Kavitha: ఎమ్మెల్సీ కవితపై (MLC Kavitha) సొంతపార్టీలోనే కుట్రలు జరుగుతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తున్నది. ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే నిజమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో జాగృతితో ప్రజల్లోకి క్షేత్రస్థాయిలోకి వెళ్లారు. రాష్ట్ర ఏర్పాటులో తనవంతు కీలక భూమిక పోషించారు. అయితే, ప్రస్తుతం పార్టీలో మాత్రం ఆశించిన స్థాయిలో గుర్తింపు ఇవ్వడం లేదని, ఆమెపై ఇతర పార్టీల నేతలు ఆరోపణలు చేసినా, (Social media) సోషల్ మీడియాలో ట్రోల్ చేసినా గులాబీ నేతలు స్పందించడం లేదని ఆమె సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కవిత కలత చెందినట్లు సమాచారం.
సోషల్ మీడియాలో ట్రోల్స్.. కానీ..
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆమె రాజకీయ ప్యూచర్‌ను అడ్డుకోవాలనే కుట్రలు, ప్రయత్నాలు జరుగుతున్నాయని కవిత (Kavitha) అనుచరులు ఆరోపిస్తున్నారు. రాజకీయ అంశాలతోపాటు క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై అవగాహన ఉండడం, రాజకీయంగా దూకుడు పెంచడంతో ఆమెపై (Social media) సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతున్నాయి. కానీ, పార్టీ ఆశించిన మేరకు స్పందించకపోవడం, విపక్షాలు చేస్తున్న విమర్శలను సైతం తిప్పికొట్టకపోవడంతో కొంత అసహనం, ఆవేదన, మనోవేదనకు గురవుతున్నట్లు సమాచారం. ప్రభుత్వంగానీ, బీజేపీ గానీ (KCR) కేసీఆర్‌పై, పార్టీపై విమర్శలు చేస్తూ వెంటనే ప్రతి విమర్శలకు పదును పెడుతుండడంతో ఈ మధ్య కాలంలో (Social media) సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువ అవుతున్నాయని ఆమె అనుచరులు పేర్కొంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో.. కీలక పరిణామాలు!
మహేశ్ గౌడ్ విషయంలో..
తాజాగా టీపీసీసీ మహేశ్ కుమార్ గౌడ్ సైతం (BRS) బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ (Congress) నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారని మండిపడ్డారు. (BRS) బీఆర్ఎస్ నేతలతో పాటు కవిత ఫోన్ కూడా ట్యాప్ చేసి ఉండొచ్చు అని వ్యాఖ్యలు చేశారు. (KTR) కేటీఆర్ ఘాటుగా స్పందించి (Mahesh Kumar Goud) మహేశ్ కుమార్ గౌడ్‌కు లీగల్ నోటీసు పంపారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే కోర్టుకీడుస్తానని హెచ్చరించారు. అయితే, (Kavitha Phone Typping) కవిత ఫోన్ ట్యాప్ చేసిన వ్యాఖ్యలపై మాత్రం స్పందించకపోవడంతో ఆమె కలత చెందినట్లు సమాచారం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ పార్టీ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారనే అంశాన్ని ఎందుకు సీరియస్‌గా తీసుకోలేదు, కేవలం నోటీసులు ఇస్తే సరిపోతుందా అనేది ఇప్పుడు చర్చకు దారితీసింది. పార్టీ స్పందించకపోవడంతోనే మాగంటి గోపీనాథ్ దశదిన కర్మ కార్యక్రమానికి కవిత హాజరు కాలేదనే ప్రచారం జరుగుతున్నది.
కేసీఆర్, కవిత మధ్య గ్యాప్?
కవిత, ( Kavitha) కేసీఆర్‌కు (KCR) మధ్య గ్యాప్ పెరిగిందని, (KTR) కేటీఆర్‌తో రాజకీయంగా పడడం లేదని (Social media) సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. రాజకీయ వర్గాల్లోనూ ఇది చర్చనీయాంశమైంది. కానీ ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నాలు పార్టీ నుంచి జరుగకపోవడం, బీఆర్ఎస్‌కు అనుంబంధంగా ఉన్న సోషల్ మీడియాలోనూ కవితకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని ఆమె అనుచరులు ఆరోపిస్తున్నారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ఇలాంటి ప్రచారం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
కవిత, ( Kavitha) కేసీఆర్ (KCR) మధ్య దూరం పెంచాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుచరులు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిన సమయంలో కుటుంబం మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు ప్రచారం జరుగుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. గతంలో కవిత ( Kavitha) తనపై పార్టీలో కుట్రలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో అప్పుడు ఎమ్మెల్యేలు కలిసి పనిచేయకుండా ఓడించారని పేర్కొన్నారు. కొంతమంది పార్టీలోని నేతలే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కేసీఆర్‌కు (KTR) సైతం లేనిపోని అబద్ధాలు చెబుతున్నారని, తనను దూరం చేసేందుకు పనిగట్టుకున్నారని పరోక్షంగా విమర్శలు చేశారు.
Also Read: GHMC Commissioner and CDMA: అదనపు కమిషనర్ల కుదింపుపై గందరగోళం!