Houses to Journalists(imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Houses to Journalists: జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి.. కలెక్టర్‌‌కు వినతి

Houses to Journalists: నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టు ఫెడరేషన్‌ (టిడబ్ల్యూజెఎఫ్‌) ప్రతినిధులు కలెక్టర్‌ టీ వినయ్‌ కృష్ణ రెడ్డిని కోరారు. జిల్లా కలెక్టర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించగా బుధవారం టి డబ్ల్యూ జె ఎఫ్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆయనను కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులు సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ఇండ్లు, ఇళ్ల స్థలాల అంశంపై జర్నలిస్ట్‌ నాయకులు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు.

ఇళ్లస్థలాల కోసం ఎదురుచూపు

ఈ సందర్భంగా టీ డబ్ల్యూ జెఎఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఏం భాస్కర్‌ ఏ రామచందర్‌ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని ఆయా మండలాలు, జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు సుదీర్ఘకాలంగా ఇండ్లు, ఇళ్లస్థలాల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. చాలీచాలని వేతనాలతో బతికీడుస్తున్న జర్నలిస్టులకు అద్దెలు ఆర్థిక భారంగా మారుతున్నాయని వివరించారు. జర్నలిస్టుల కోసం గతంలో గుండారం శివారులో స్థల పరిశీలన జరిగినా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదని వాపోయారు.

Also Reas: Ranga Reddy District: పక్కదారి పడుతున్న గోధుమలు.. సందట్లో సడేమియాలా డీలర్ల తీరు!

కలెక్టర్‌‌కు వినతి

ఈ అంశంపై కలెక్టర్‌ టీ వినయ్‌ కృష్ణరెడ్డి సానుకూలంగా స్పందించారు. ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు తన వంతుగా కృషి చేస్తానని హామీనిచ్చారు. ఇళ్ల స్థలాల పంపిణీలో సాంకేతిక, రాజకీయ సమస్యలు లేకుండా పరిష్కారం లభించేలా చొరవ చూపుతానన్నారు. కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి కె వెంకటేశ్, రాష్ట్ర కమిటీ సభ్యులు అనిత, పరమేశ్వర్, ప్రతినిధులు మధు, రాజు, నరేష్, వినీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Also Read: PM Modi – Trump: నీకు అంత సీన్ లేదు.. ట్రంప్ గాలి తీసేసిన ప్రధాని మోదీ!

 

 

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!