Hyderabad Crime: కల్లు కాంపౌండ్ వద్ద జరిగిన గొడవలో యువకుడిని విచక్షణ రహితంగా కొట్టి చంపిన ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం సిరిగిరిపేట్ గ్రామానికి చెందిన మాసాన్పల్లి రామచందర్, పసుపు రామచందర్ (23)లు నగరానికి వలస వచ్చి లింగంపల్లి లో రాపిడో నడుపుకుంటున్నారు. రాత్రి వేళలో లింగంపల్లి రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫారం పై పడుకుంటూ పనులు చేసుకుంటున్నారు.
Also Read: Honeymoon Murder: బాబోయ్.. ఒకటి కాదు రెండు.. హనీమూన్ కేసులో బిగ్ ట్విస్ట్!
మహిళ వీడియో కాల్
కాగా మంగళవారం రాత్రి రైల్వే స్టేషన్ సమీపంలోని కల్లు కాంపౌండ్ కు ఇరువురు వెళ్లారు. అక్కడే ఉన్న ఓ మహిళ అమరేశ్‌ను అడ్డుకుని వారం క్రితం మా ఆడ మనిషిని బైక్ పై ఎక్కించుకుని ఎక్కడికి తీసుకెళ్లావురా అంటూ దుర్భాషలాడుతూ గొడవకు దిగింది. రాంచందర్ గొడవ ఆపేందుకు ప్రయత్నించగా పక్కనే ఉన్న మరో మహిళ వీడియో కాల్ చేసి ఇద్దరు వ్యక్తులకు అక్కడికి పిలిచి, అమరేశ్ ని కొట్టాలని చెప్పింది. దీంతో రెచ్చిపోయిన సదరు వ్యక్తులు అమరేష్ ని విచక్షణ రహితంగా కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయాడు.
గమనించిన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. వెంటనే రాంచందర్ అమరేష్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, 100 డయల్ ద్వారా పోలీసులకు సమాచారం అందజేశాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు 108 అంబులెన్స్ సిబ్బంది సహాయంతో అమరేష్ ను పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అమరేష్ పై దాడికి దిగి కొట్టి చంపిన నిందితులను అదుపులోకి తీసుకునీ విచారిస్తున్నట్లు సమాచారం.
Also Read: Narayanguda Police: దొంగల ముఠా అరెస్ట్.. 1.7 కోట్ల సొత్తు నగదు స్వాధీనం!