PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi), ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ (Giorgia Meloni) మధ్య చక్కటి మైత్రి ఉంది. అంతర్జాతీయ సదస్సుల్లో వీరిద్దరూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు. ఇద్దరూ కలిసివున్న పలు ఫొటోలు, వీడియోలు గతంలో పలుమార్లు వైరల్ అయ్యాయి. చాలా మీమ్స్ కూడా పుట్టుకొచ్చాయి. దీంతో, నెటిజన్లు ఈ జంటకు ‘మెలోడీ’ (#Melodi) అని పేరు కూడా పెట్టారు. కెనడా వేదికగా జరుగుతున్న జీ7 (G7 Summit) నేపథ్యంలో మరోసారి ‘మెలోడి’ పదం ట్రెండింగ్‌గా మారింది. మోదీ, మెలోని మధ్య స్నేహపూర్వక బంధాన్ని తెలియజేసే ఫొటో ఒకటి వైరల్ కావడం ఇందుకు కారణమైంది.
Read this- Viral News: అనారోగ్యంతో భర్త చనిపోయాడన్న భార్య.. 9 ఏళ్ల కొడుకు సాక్ష్యంతో సంచలనం
జీ7 సదస్సులో పాల్గొనేందుకు కెనడా వెళ్లిన ఇరుదేశాధినేతలు మోదీ, మెలోని కొద్దిసేపు ప్రత్యేకంగా ముఖాముఖీ సమావేశమయ్యారు. పరస్పరం ‘షేక్ హ్యాండ్’ ఇచ్చుకొని ఒకరినొకరు పలకరించుకున్నారు. కొద్ది సమయమే అయినప్పటికీ ఇరువురూ ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. వీరి భేటీకి సంబంధించిన ఫొటోను ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తన ఎక్స్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. ‘ఇటలీ, భారత్ మధ్య గొప్ప మైత్రి ఉంది’ అని ఆమె క్యాప్షన్ ఇచ్చారు. ప్రధాని మోదీ కూడా అదే ఫొటోను రీట్వీట్ చేశారు. ‘‘మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను ప్రధాని జార్జియా మెలోనీ గారు. భారత్-ఇటలీ మధ్య స్నేహ బంధం మరింత బలపడుతుంది. ఇరుదేశాల ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది!’’ అని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో, ఒక్కసారిగా మోదీ, మెలోని ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇండియన్ నెటిజన్లు ‘మెలోడి’ (Meloni + Modi) మీమ్స్‌ను మళ్లీ ట్రెండింగ్‌గా మార్చారు.
Venu Swamy: మరో బిగ్ బాంబ్ పేల్చిన వేణు స్వామి.. అదే జరిగితే మొత్తం నాశనమే?
మెలోడి ఎఫెక్ట్‌తో, ప్రధాని మోదీ ఎక్స్ పోస్టుకు గంటల వ్యవధిలోనే 1.5 లక్షలకుపైగా లైకులు, 15 వేలకుపైగా రీట్వీట్లు వచ్చాయి. గతేడాది ఇటలీలో జరిగిన జీ7 సదస్సు సమయంలో ప్రధాని మోదీతో జార్జియా మెలోని ఒక సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అప్పటి నుంచి ‘మెలోడీ’ పదం బాగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత, దుబాయ్ వేదికగా జరిగిన ‘కాప్28’ సదస్సులో కూడా మోదీతో సెల్ఫీ దిగి మెలోని షేర్ చేశారు. ‘కాప్‌లో గుడ్ ఫ్రెండ్స్ #మెలోడి’ అంటూ ఆమె క్యాప్షన్ ఇచ్చారు. దీంతో, ఈ ఇరువురి నేతల మధ్య సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. 2023లో భారత్‌లో జరిగిన జీ20 సదస్సు సమయంలో కూడా వీరిద్దరి ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ‘మెలోడి’ మీమ్స్ గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బ్రోకింగ్ సంస్థ జెరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ ఈ ఏడాది ఆరంభంలో నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో ప్రశ్నించారు. మీమ్స్, ఆన్‌లైన్ డిబేట్లపై తాను దృష్టిపెట్టబోనని, అవన్నీ నిత్యం జరుగుతూనే ఉంటాయని మోదీ వ్యాఖ్యానించారు.
మోదీ.. మీరు అత్యుత్తములు
కెనడా వేదికగా జరుగుతున్న జీ7 సదస్సులో ప్రత్యేకంగా భేటీ అయిన ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, ప్రధాని మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. ‘‘ మీరు అత్యుత్తమ వ్యక్తి. మీలాగే ఉండేందుకు నేను ప్రయత్నిస్తు్న్నాను’’ అని మెలోని పేర్కొన్నారు. పలు అంశాలపై కొద్దిసేపు క్లుప్తంగా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఇతర దేశాల నేతలతో మాట్లాడారు.