Venu Swamy: వేణుస్వామి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినీ హీరో హీరోయిన్ల జాతకాలు చెబుతూ చాలా ఫేమస్ అయ్యాడు. ఒక స్టార్ హీరోకు ఎంత క్రేజ్ ఉంటుందో అతను కూడా అంత గుర్తింపు తెచ్చుకున్నాడు. వేణుస్వామి ఏం చెప్పినా కూడా అది క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది. ఈయన నిత్యం ట్రెండింగ్ లో ఉంటూనే ఉంటారు. ఏపీ , తెలంగాణ ఎన్నికల రిజల్ట్స్ విషయంలో ఆయన చెప్పింది నిజం కాలేదు. అప్పటి నుంచి ఈయన్ని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.
Also Read: Viral News: అనారోగ్యంతో భర్త చనిపోయాడన్న భార్య.. 9 ఏళ్ల బాలుడి సాక్ష్యంతో సంచలనం
చాలామంది హీరోయిన్లకు పూజలు చేసి వారికి విజయాలు వచ్చేలా చేశాడు. గతంలో వేణుస్వామి రాజకీయ నాయకుల జాతకాలు చెప్పడంతో అవి నిజం కాకపోవడంతో అన్ని అబద్దాలు చెబుతున్నడంటూ చాలామంది అన్నారు. కానీ వేణుస్వామి చెప్పిన వాటిలో కొన్ని జరగలేదేమో కానీ, కొన్ని మాత్రం జరిగాయి. 2025లో జరిగే సంఘటనలు గురించి కూడా ఈయన ముందే చెప్పాడు. ఆయన చెప్పినట్టే జరిగాయి. ఆయన ఎలా చెప్పాడో అలాగే జరుగుతున్నాయి. అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం గురించి కూడా అందరి కంటే ముందుగా చెప్పాడు. అయితే, తాజాగా మరో బిగ్ బాంబ్ పేల్చాడు.
Also Read: Suniel Narang: సినిమాలే చూడను.. వారి ముందు నేను ఎంత?.. కుబేర నిర్మాత సంచలన కామెంట్స్
త్వరలో ఇంటర్నెట్ కూడా ఆగిపోతుందని బిగ్ బాంబ్ పేల్చాడు. అదే జరిగితే మొత్తం నాశనం అవుతుంది. అంతే కాదు .. రాశుల గురించి కూడా చెప్పాడు. సింహా రాశిలో కుజ, కేతువులు కలవడంతో కొన్ని రాశులకు కష్టాలు మొదలు కానున్నాయి. అలాగే ప్రకృతి పరమైన వైపరీత్యాల వలన అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. సెప్టెంబర్ 1, 2025 వరకు సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. మరి, ముఖ్యంగా కొన్ని రాశులు వారికి తీవ్ర ఇబ్బందులు వస్తాయని వేణుస్వామి ఆయన మాటల్లో చెప్పుకొచ్చాడు.
సింహా రాశి, మీన రాశి , మకర రాశి , వృషభ రాశి , కన్యా రాశి వారి జీవితంలో విపరీతమైన సమస్యలు వస్తాయట. కుజ, కేతువులు సింహా రాశిలో కలిసి ఉండటం వలన సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎలాంటి సమస్యలు అంటే ఆర్ధిక పరమైన ఇబ్బందులు, నరాలు, లీగల్ సమస్యలు, తల్లికి పరమైన ఆరోగ్య సమస్యలు, ఉద్యోగం కోల్పోవడం , వ్యాపారాల్లో నష్టాలు రావడం , వాహన ప్రమాదాలు, అతి ముఖ్యంగా భార్య భర్తల మధ్య గొడవలు ఇవి కూడా జరిగే అవకాశం ఉందని వేణు స్వామి అంటున్నారు. వీటిలో కొన్నైన జరిగే అవకాశం ఉందని ఆయన మాటల్లో చెప్పుకొచ్చాడు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు