PM Modi on Pahalgam attack (Image Source: Twitter)
అంతర్జాతీయం, లేటెస్ట్ న్యూస్

PM Modi on Pahalgam attack: ప్రపంచ వేదికపై ప్రధాని మాస్ స్పీచ్.. పాకిస్థాన్‌కు ఇక మూడినట్లేనా!

PM Modi on Pahalgam attack: పహల్గాం ఉగ్రదాడి యావత్ దేశాన్ని శోక సంద్రంలో ముంచేసిన సంగతి తెలసిందే. ప్రస్తుతం కెనడాలో జరుగుతున్న జీ7 సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ (prime Minister Modi).. పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack)పై స్పందించారు. సదస్సులో మాట్లాడుతూ.. ఉగ్రవాదం (Terrorism)పై ద్వంద్వ వైఖరి ఉండకూడదని స్పష్టం చేశారు. యావత్ మానవాళిపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు.

తమ దేశంలో జరుగుతున్న జీ 7 సదస్సులో పాల్గొనాలని ప్రధాని మోదీని కెనడా పీఎం మార్క్ కార్నీ (Mark Carney) ఆహ్వానించారు. ఆయన పిలుపు మేరకు జీ7 సదస్సులో పాల్గొన్న ప్రధాని.. అక్కడ జీ7 దేశాలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా పహల్గాంలో పాక్ (Pakisthan) ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడి గురించి ప్రస్తావించారు. అది కేవలం ఉగ్రదాడి మాత్రమే కాదని.. భారతీయుల ఆత్మ, గౌరవం, గుర్తింపుపై జరిగిన దాడి అని మోదీ అభివర్ణించారు. మెుత్తం మానవాళిపై జరిగిన దాడిగా పేర్కొన్నారు. ఉగ్రవాదం ప్రపంచ మానవాళికి శత్రువు అన్న ప్రధాని.. ప్రజాస్వామ్య విలువలను కాపాడే దేశాలకు అది వ్యతిరేకంగా పనిచేస్తోందని అన్నారు.

Also Read: Deputy CM Bhatti Vikramarka: సింగరేణి బలోపేతమే లక్ష్యం.. డిప్యూటీ సీఎం కీలక వాఖ్యలు!

ప్రపంచ శాంతి, శ్రేయస్సు కాపాడే క్రమంలో ఉగ్రవాదంపై అన్ని దేశాలు స్పష్టమైన వైఖరిని అవలంభించాలని సూచించారు. ఏదైనా దేశం ఉగ్రవాదాన్ని సమర్థిస్తే దానికి మూల్యం చెల్లించుకోవాల్సిందేనని మోదీ అన్నారు. మరోవైపు గ్లోబల్ సౌత్ దేశాలు ప్రస్తుతం ఘర్షణలు, అనిశ్చితితో సమస్యలు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. ఆహారం, చమురు, ఎరువులు, ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయని మోదీ అన్నారు. గ్లోబల్ సౌత్ దేశాల (Global South Countries) సమస్యలు, ప్రాధాన్యతలు ప్రపంచ వేదికపై తీసుకురావడం భారత్ బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు.

Also Read This: Bomb Threat to Airport: బేగంపేట ఎయిర్ పోర్టులో హై అలర్ట్.. అందరినీ బయటకు పంపేసిన పోలీసులు!

 

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?