Narayanguda Police(image credit: swetcha Reporter)
క్రైమ్

Narayanguda Police: దొంగల ముఠా అరెస్ట్.. 1.7 కోట్ల సొత్తు నగదు స్వాధీనం!

Narayanguda Police: నారాయణగూడ పోలీసులు, (NarayangudaPolice) ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ (East Zone Task Force) సిబ్బందితో కలిసి, నగరంలో సంచలనం సృష్టించిన ఓ దొంగతనానికి పాల్పడిన కరడుగట్టిన ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 1.7 కోట్ల విలువైన భారీ సొత్తును, నగదును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటిలో 158 తులాల బంగారు నగలు, రూ. 10.75 లక్షల నగదు, 8 విలువైన వాచీలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ అరెస్టులకు సంబంధించిన వివరాలను ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి, (Balaswamy) టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాస్ రావు, (Ande Srinivas Rao) ఈస్ట్ జోన్ అదనపు డీసీపీ జే. నర్సయ్య సంయుక్తంగా వెల్లడించారు.

 Also Read: Minister Ponnam Prabhakar: గోల్కొండ బోనాలకు.. పకడ్బందీ ఏర్పాట్లు!

కేసు నమోదు

ఈ కేసులోని దొంగతనం జూన్ మొదటి వారంలో బషీర్ బాగ్ అవంతి నగర్‌లో నివసించే వ్యాపారి రామకృష్ణ ఇంట్లో జరిగింది. రామకృష్ణ కుటుంబంతో కలిసి బయటకు వెళ్లిన సమయంలో, దొంగలు కిటికీ గ్రిల్ తొలగించి ఇంట్లోకి ప్రవేశించారు. లాకర్‌లో భద్రపరిచిన 173 తులాల బంగారు నగలు, రూ. 17.50 లక్షల నగదు, విలువైన రిస్ట్ వాచీలను దొంగిలించి పరారయ్యారు. జూన్ 7న రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నారాయణగూడ పోలీసులు (NarayangudaPolice) కేసు నమోదు చేశారు.

బృందాలు క్షుణ్ణంగా దర్యాప్తు

కేసు తీవ్రత దృష్ట్యా, ఉన్నతాధికారులు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఈ బృందాలు క్షుణ్ణంగా దర్యాప్తు చేసి కీలక ఆధారాలు సేకరించాయి. ఈ దర్యాప్తులో సాగర్ కుమార్ (22), ఆకాశ్ కుమార్ మండల్ (19), సక్లైన్ ఖాన్ (19) అనే ముగ్గురు ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా, దొంగిలించిన సొత్తును కొనుగోలు చేసిన రిసీవర్ చంద్రశేఖర్ (Chandra Shekar) (49)ను కూడా అరెస్ట్ చేశారు. అయితే, ఈ కేసులో పరారీలో ఉన్న ఆశిష్, అశ్విని రచు, శాలిని రచు కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ విజయవంతమైన కేసు ఛేదనలో కీలక పాత్ర పోషించిన నారాయణగూడ సీఐ చంద్రశేఖర్, డీఐ నాగార్జున, టాస్క్ ఫోర్స్ సిబ్బందితో పాటు కేసును పర్యవేక్షించిన సుల్తాన్ బజార్ ఏసీపీ మట్టయ్యను డీసీపీ బాలస్వామి , (Balaswamy) అభినందించారు.

 Also Read: Ponnam Prabhakar: రవాణా శాఖలో.. ఎన్‌ఫోర్స్‌మెంట్ పెంచాలి!

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్