Serilingampally( image Credit: swetcha reporter)
హైదరాబాద్

Serilingampally: బచ్చుకుంటను మింగేస్తున్న కబ్జాదారులు.. పట్టించుకోని అధికారులు

Serilingampally: శేరిలింగంపల్లి మండల పరిధిలో కబ్జాదారులు హైడ్రాకు సవాలు విసురుతున్నారు. చెరువుల పునరుద్ధరణకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హైడ్రా దూసుకుపోతున్నప్పటికీ, కొంతమంది తమకేం పట్టనట్టుగా కబ్జాలకు ప్రయత్నాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. శేరిలింగంపల్లి (Serilingampally)  మండల పరిధిలోని హఫీజ్ పేట్ బచ్చుకుంట చెరువులో యదేచ్ఛగా వ్యర్థాలను నింపుతూ కబ్జాకు యతిస్తున్న స్థానిక అధికార యంత్రాంగం పట్టించుకోకుండా కబ్జా కోరులకు అండగా నిలుస్తున్నారు.

Also ReadSpecial Meeting On Banakacherla Project: బనకచర్లపై పీపీపీ.. లోక్‌సభ రాజ్యసభ సభ్యులకు ఆహ్వానం!

చెరువులో అక్రమ డంపింగ్ పై పలువురు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం శూన్యంగా మారింది.  (HYDRA) హైడ్రాకు సవాలు విసురుతున్న కబ్జాదారులు శేరిలింగంపల్లి (Serilingampally) మండల పరిధిలోని చెరువులు ఇప్పటికే చాలావరకు కబ్జాలకు గురయ్యాయి. హైడ్రా  (HYDRA) పనితీరుతో ప్రజల్లో చెరువుల ఆక్రమణలపై భయం పెరిగినప్పటికీ, కొంతమంది కబ్జాదాలలో స్థానిక అధికారుల అండదండలతో  (HYDRA) హైడ్రాకే సవాలు విసురుతున్నారు. హఫీజ్ పేట్ బచ్చుకుంటలో వ్యర్ధాలను నింపుతూ చెరువును చెరపట్టేందుకు పావులు కదుపుతున్నారు. హైడ్రాధికారులు వెంటనే దృష్టి సారించి సదరు కబ్జాదారులపై చర్యలు తీసుకుని చెరువును పునరుద్ధరించాలంటూ స్థానికులు కోరుతున్నారు.

ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు  మిద్దెల మల్లారెడ్డి
హఫీజ్ పేట్ బచ్చుకుంట చెరువు ఆక్రమణలపై టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులకు వాట్స్అప్ ద్వారా సమాచారం ఇచ్చినప్పటికీ పట్టించుకోవడం లేదు. ఇప్పటికే నియోజకవర్గంలోని చాలా చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి. (HYDRA) హైడ్రా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.

 Also Read: Ranga Reddy District: పక్కదారి పడుతున్న గోధుమలు.. సందట్లో సడేమియాలా డీలర్ల తీరు!

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!