Kranthi Vallur (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Kranthi Vallur: సంగారెడ్డి జిల్లాతో అనుబంధం మరువలేనిది.. వల్లూరు క్రాంతి

Kranthi Vallur: సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా తను పనిచేసిన 17 నెల కాలంలో జిల్లా ప్రజలు అధికారులు ఉద్యోగుల సహకారం మరువలేనిదని తెలంగాణ రాష్ట్ర టూరిజం ఎండి క్రాంతి వల్లూరు అన్నారు. జిల్లా కలెక్టర్ గా 17 నెలపాటు పనిచేసే ఇటీవల పదోన్నతి పై పర్యాటక శాఖ ఎం.డి గా వెళ్లిన క్రాంతి వల్లూరుకు ఉద్యోగుల సంఘాల నాయకులు కలెక్టరేట్ సిబ్బంది ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, జిల్లా అధికారులు, వివిధ శాఖల అధికారులు, గెజిటెడ్ అధికారుల సంఘం, రెవెన్యూ ఉద్యోగుల సంఘం, నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం హాజరయ్యారు.

17 నెలల కాలం మరువలేనిది

ఈ సందర్భంగా టూరిజం ఎండి క్రాంతి వల్లూరు మాట్లాడారు. తన సర్వీసులో సంగారెడ్డి జిల్లాలో పనిచేసిన 17 నెలల కాలం మరువలేనిది అన్నారు. ఎన్నో సంతోషకరమైన అనుభవాలతో జిల్లా నుండి వెళ్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. జిల్లా అధికారులు ఉద్యోగుల సహకారంతో ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక పథకాలను జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసినట్లు తెలిపారు. జిల్లా అధికారులు సహాయ రిటర్నింగ్ అధికారుల సహకారంతో జహీరాబాద్ పార్లమెంటు ఎన్నికలు సజావుగా నిర్వహించినట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సోషల్ ఎకనామిక్ సర్వే, ప్రజా పాలన కార్యక్రమం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక లాంటి పథకాలను సమర్థవంతంగా నిర్వహించినట్లు తెలిపారు.

Also Read: Minister Sridhar Babu: స్కిల్ వర్సిటీకి సహకరించండి.. కేంద్ర మంత్రికి విజ్ఞప్తి

రాష్ట్రస్థాయిలో జిల్లాను అగ్రస్థానం

ఇందుకు సహకరించిన ఉద్యోగులకు, జిల్లా అధికారులకు ఈ సందర్భంగా క్రాంతి వల్లూరు కృతజ్ఞతలు తెలిపారు. తన సర్వీసులో సంగారెడ్డి జిల్లాను జిల్లా ప్రజలను మరువలేను అన్నారు. పెద్ద జిల్లా అయినప్పటికీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం పథకాల అమలులో రాష్ట్రస్థాయిలో జిల్లాను అగ్రస్థానంలో నిలపడానికి తనకు సహకరించిన ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. వరి ధాన్యం సేకరణలో, భూముల సర్వేలో తలెత్తిన సమస్యలను జిల్లా అధికారుల సహకారంతో సమర్థవంతంగా పరిష్కరించినట్లు క్రాంతి వల్లూరు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు, సిబ్బంది,పాత్రికేయ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Also Read: Flight Emergency: గాల్లో ఉన్న ఫ్లైట్‌కు బాంబు బెదిరింపు.. కెప్టెన్ ఏం చేశాడంటే

 

Just In

01

Chamal Kiran Kumar: ఉద్యోగాల్లో కృత్రిమ మేధస్సు కీ రోల్.. ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు

Peddi Update: రత్నవేలు ఇచ్చిన అప్డేట్‌తో రామ్ చరణ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ!

Harish Rao: కవిత వ్యాఖ్యలపై.. తొలిసారి స్పందించిన హరీశ్‌ రావు

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?