Mahabubabad District (imagecredit:twitter)
నార్త్ తెలంగాణ

Mahabubabad District: ఇనుగుర్తిలో గిరిజన హక్కు పత్రాలు.. చెల్లవంటున్న అధికారులు

Mahabubabad District: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలోని ఇనుగుర్తి పరిధిలోని సెక్షన్ లో సౌత్ బీటులోని 1149 కంపార్ట్మెంట్ నెంబర్లో గత కొన్ని సంవత్సరాలుగా పాత తండాకు చెందిన గిరిజన రైతులు పోడుచేసుకుంటున్నారు. వివరాలలోకి వెళితే.. కంపార్ట్మెంట్ నెంబర్ 1149లో గిరిజన పోడు రైతులు అటవీ భూమిని ఆక్రమించకుండా ట్రెంచ్ పనులను జెసిబి సహయంతో అటవీ అభివృద్ధి సంస్థ అధికారులు, అటవీ అధికారులు సంయుక్తంగా కలిసి కందకం పనులను ప్రారంభించారు.

భూములు ఫారెస్ట్ అధికారులు స్వాధీనం

ఎన్నో సంవత్సరాల నుండి పోడు వ్యవసాయం చేసుకుంటున్న భూములను ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకొని మా పొట్ట కొట్టొద్దంటూ గిరిజన మహిళలు, రైతులు జెసిబి ముందు బైఠాయించి ఆందోళన చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోడు చేసుకునే రైతులు వారం లోపు భూమికి సంబంధించిన పత్రాలు, ఆధారాలు ఉంటే అటవీ అధికారులకు సమర్పిచాలని అప్పటివరకు ట్రెంచ్ పనులను నిలిపివేయలని అటవీ అధికారులను కోరుతు సమస్యను తాత్కాలికంగా పరిష్కరించారు.

Also Read: Kuppam Incident: సీఎం ఇలాకాలో దారుణం.. మహిళను చెట్టుకు కట్టేసి చిత్ర హింసలు

సరైన ధృవపత్రాలు సమర్పించాలి

వారంలోపు సరైన ధృవపత్రాలు సమర్పించాలని, ఫారెస్ట్ డివిజనల్ మెనేజర్ మాదవి తెలిపారు. ఇనుగుర్తి సౌత్ బీట్ పరిధిలోని 1149 కంపార్ట్మెంట్ నెంబర్‌లో పోడు చేసుకుంటున్న రైతులు వారంలోపు సరైన ధృవపత్రాలు అందించాలి. రైతులు సాగు చేసుకునే భూమి యొక్క ఆధారాలను అటవీ శాఖ కార్యాలయంలో సమర్పించాలని పలు మార్లు నోటిసులు జారీ చేసిన రైతులు పట్టించుకోలేదు. కందకం తీయడానికి యంత్రాలతో రాగానే కంపార్ట్ నెంబర్, ల్యాట్ ల్యాగ్స్ లేని నకిలీ హక్కు పత్రాలను తీసుకోస్తున్నారు.

Also Read: Watch Video: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో వైరల్

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!