YS Jagan: రూ.80 వేలు అప్పు తీర్చలేదని సీఎం చంద్రబాబు (CM Chandraabu) సొంత ఇలాకా కుప్పంలో మహిళను (Kuppam Woman Incident) చెట్టుకు తాళ్లతో కట్టేసి చిత్రహింసలు దారుణ ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనకు పాల్పడింది టీడీపీ కార్యకర్త కావడంతో ఇది మరింత వివాదానికి దారితీసింది. చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో ఈ దారుణం వెలుగుచూసింది. నారాయణపురం గ్రామానికి చెందిన శిరీష (25) భర్త తిమ్మరాయప్ప దంపతులు అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద మూడేళ్ల క్రితం రూ.80 వేలు అప్పు తీసుకున్నారు. అప్పు తీర్చలేక భార్య, బిడ్డలు, గ్రామాన్ని వదిలి తిమ్మరాయప్ప వెళ్ళిపోయాడు. దీంతో కూలి పనులు చేసుకుంటూ పిల్లలు పోషించుకుంటూ శిరీష అప్పులు తీరుస్తున్నది. అయితే, సకాలంలో అప్పు చెల్లించలేదని రోడ్డుపై వెళ్తుండగా అసభ్యకరమైన పదజాలంతో దూషించి, తన అప్పుడబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరింపులు దిగాడు. ఆఖరికి ఈడ్చుకొంటూ వెళ్ళి తాడుతో బలవంతంగా వేప చెట్టుకు శిరీషను కట్టేసిన కొట్టాడు టీడీపీ కార్యకర్త. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్‌గా మారింది. సీఎం సొంత నియోజకవర్గం కావడంతో పెను దుమారంగా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో #SaveAP అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో నడుస్తున్నది. ఈ క్రమంలో అటు సీఎం చంద్రబాబు.. ఇటు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఎక్స్ వేదిగా తీవ్రంగా స్పందించారు.
Read Also- YSRCP: ‘కుప్పం’ సాక్షిగా నారా లోకేష్ మోసం బట్టబయలు.. పెద్ద కథే ఉందిగా..
రోదిస్తున్నా కనికరం లేదా?
‘ చంద్రబాబూ.. రాష్ట్రంలో మహిళలకు మీరు కల్పిస్తున్న రక్షణ ఇదేనా? మీ పాలనలో మహిళలకు లభిస్తున్న ఆత్మగౌరవం ఇదేనా? సాక్షాత్తూ మీరు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం నారాయణపురం గ్రామంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి, హింసిస్తున్న ఘటన, మీ దుర్మార్గపు పరిపాలన ఫలితమే. తిమ్మరాయప్ప అనే కూలీ అప్పు చెల్లించలేదనే కారణంతో అతని భార్య శిరీషను మీ పార్టీ కార్యకర్త చెట్టుకు కట్టేసి, హింసించాడు. ఆమె బిడ్డలు రోదిస్తున్నా సరే కనికరం చూపలేదు, విడిచిపెట్టలేదు. చంద్రబాబు.. మీ హయాంలో జరిగిన అనేక క్రూరమైన ఘటనల్లో ఇదొకటి. పొలిటికల్ గవర్నెన్స్, రెడ్‌బుక్ పేరిట మీరు నెలకొల్పిన దుష్ట సంప్రదాయంలో భాగంగా మీరు, మీ పార్టీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా చెలరేగిపోయి చేస్తున్న దుర్మార్గాలకు మహిళలు, యువతులు, బాలికలు ఇలా ఎందరో బలైపోతున్నారు. ఈ ఘటనతోపాటు, ఏడాదికాలంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై జరిగిన అన్యాయాలు, అఘాయిత్యాలను సీరియస్‌గా తీసుకోవాలని, చట్టప్రకారం కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాను’ అని వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
ఏం చేస్తారో..?
‘ మొన్న ఒకాయన ఏదో సర్వే అంటూ డిబేట్‌లో మాట్లాడితే అరెస్ట్ చెయ్యాలని ఎంతో మంది మహిళమూర్తులు బయటకి వచ్చారు కదా..? ఈ రోజు సాక్షాత్తు సీఎం చంద్రబాబు ఇలాకాలో అప్పు తీర్చలేదని ఓ మహిళను రోడ్డు మీద చెట్టుకి కట్టేసినందుకు ఎంత మంది మహిళలు రోడ్లమీదకు వస్తారో చూద్దాం..!’ అని నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు.. ‘ఒక మహిళను తన ఇద్దరు చిన్న పిల్లల ముందే చెట్టుకు కట్టేసి కొడుతున్నారు. అసలు వీళ్ళు మనుషులేనా? కనీసం ఆ చిన్న పిల్లల ఏడుపు చూసైనా అయ్యో పాపం అనిపించలేదా? ఈ వీడియో బయటకు వచ్చింది కాబట్టి ఈ దుర్మార్గం ప్రపంచానికి తెలిసింది. అదే గనుక వీడియో లేకపోయి ఉంటే? సీఎం చంద్రబాబు నియోజకవర్గంలోనే జరిగిన ఈ దారుణ ఘటన మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి’ అని జర్నలిస్టులు సైతం వీడియోను పోస్ట్ చేసి ఎక్స్ వేదికగా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఇక వైసీపీ కార్యకర్తలు, జగన్ వీరాభిమానుల కామెంట్ల గురించి అయితే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కావడం, ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తి టీడీపీ కార్యకర్త కావడంతో సోషల్ మీడియా వేదికగా.. దుమ్ము దులిపి వదులుతున్నారు.
Read Also- Kuppam Incident: సీఎం ఇలాకాలో దారుణం.. మహిళను చెట్టుకు కట్టేసి చిత్ర హింసలు
.@ncbn గారూ.. రాష్ట్రంలో మహిళలకు మీరు కల్పిస్తున్న రక్షణ ఇదేనా? మీ పాలనలో మహిళలకు లభిస్తున్న ఆత్మగౌరవం ఇదేనా? సాక్షాత్తూ మీరు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం నారాయణపురం గ్రామంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి, హింసిస్తున్న ఘటన, మీ దుర్మార్గపు పరిపాలన ఫలితమే. తిమ్మరాయప్ప… pic.twitter.com/GDVWPB65AZ
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 17, 2025