Bayya Sunny Yadav: యూట్యూబర్స్ అన్వేష్-భయ్యా సన్నీ యాదవ్ మధ్య వివాదానికి ఇప్పట్లో ఫుల్‌స్టాప్ పడే అవకాశాలు ఏ మాత్రం కనిపించట్లేదు. భారత్-పాక్ యుద్ధ నేపథ్యంలో తెలుగు ట్రావెలర్ సన్నీని ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) అదుపులోనికి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల పాకిస్థాన్‌కు వెళ్లిరాగా సన్నీని ఎన్ఐఏ (NIA) అధికారులు విచారించారు. అయితే విచారణపై ఇంతవరకూ ఎన్ఐఏ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అసలు ఎన్ఐఏ విచారణకు నిజంగా తీసుకెళ్లిందా? లేదా అనేదానిపై కూడా ఫుల్ క్లారిటీ రావట్లేదు. ఇన్నిరోజులు ఏమయ్యాడో తెలియట్లేదు కానీ, చాలా రోజుల తర్వాత బయటికొచ్చిన యూట్యూబర్.. తన అజాత శత్రువుగా ఉన్న అన్వేష్‌పై రివెంజ్ తీర్చుకోవడానికి సిద్ధమయ్యాడు. అందుకే నేరుగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంకు వెళ్లాడు. సింహాచలంలో ప్రత్యక్షమై.. ‘ నేను వచ్చేశా’ అంటూ పోస్ట్ పెట్టాడు. ఇప్పటి వరకూ ఇరువురి మధ్య యూట్యూబ్ వేదికగా మాత్రమే విమర్శలు, ప్రతివిమర్శలు.. కౌంటర్లు నడవగా ఇప్పుడు అది కాస్త పీక్స్‌కు వెళ్లింది. ఏకంగా అన్వేష్ ఇంటికి వెళ్తున్నట్లు భయ్యా షాకింగ్ ప్రకటన చేశాడు. దీంతో మళ్లీ ఇంటికెళ్లి ఏం చేస్తాడో అని ఒకింత ఇరువురి అభిమానులు, ఫాలోవర్స్ ఒకింత టెన్షన్‌లో పడ్డారు.
Read Also- Naa Anveshana: అమ్మాయితో నా అన్వేష్.. ఆటగాడు మళ్లీ రెచ్చిపోయాడు..
ధైర్యంగా చెబుతా..
‘ నేను వచ్చేశా.. వైజాగ్ వెళ్తున్నా, మీ ఇంటికి వెళ్తా. మీ అమ్మానాన్నలకు ధైర్యంగా చెబుతాను. నువ్వు టెన్షన్ పడకు’ అని అన్వేష్‌కు పోస్ట్ రూపంలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. అయితే సన్నీ ఏం చెబుతాడు? ఇంటికెళ్లి ఏం చేయాలని అనుకుంటున్నాడు? అనేది తెలియరాలేదు. కాగా, ఇప్పటి వరకూ నా అన్వేష్‌ను టార్గెట్ చేస్తూ పోస్టులు మాత్రమే పెట్టిన సన్నీ యాదవ్ ఇప్పుడు ఇలా ఇంటికెళ్లడంపై చిత్ర విచిత్రాలుగా కామెంట్స్ వస్తున్నాయి. ఏమైనా ఉంటే మీ ఇద్దరు చూసుకోవాలి అంతేకానీ, మధ్యలో పేరెంట్స్ ఏం చేశారు? అని తిట్టిపోస్తున్నారు. ఈ విషయంలో సన్నీ ఓవరాక్షన్‌కు మించి చేస్తున్నాడని మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ మధ్యనే అన్వేష్‌ను బూతులు తిడుతూ పోస్టు పెట్టడంతో మళ్లీ అన్వేష్ వర్సెస్ సన్నీగా పరిస్థితులు మరింతగా మారిపోయాయి. ఈ క్రమంలోనే తానూ ఏమాత్రం తక్కువ కాదని అన్వేష్ కూడా.. అసలు సన్నీ యాదవ్ ఏమయ్యాడు? ఉన్నాడా.. లేడా? నిజంగానే ఎన్ఐఏ విచారణకు పిలిచిందా లేదా? ఇలా నాలుగైదు కారణాలు చూపిస్తూ ఓ వీడియో రూపంలో వివరించాడు. ఏం జరిగి ఉండొచ్చు? అనేది కూడా అన్వేష్ జోస్యం చెప్పాడు. సీన్ కట్ చేస్తే.. ఇవన్నీ కాదు అన్వేష్ బండారం మొత్తం బయటపెట్టాలని అనుకున్నాడో, లేకుంటే పెద్ద బాంబే పేల్చాలని ఫిక్స్ అయ్యాడో కానీ సింహాచలంలో ప్రత్యక్షమై అందరినీ షాక్‌కు గురిచేశాడు.
అసలు ఎందుకీ గొడవలు?
అన్వేష్- భయ్యా సన్నీ యాదవ్ మధ్య గొడవలకు ఒకటి కాదు రెండు కాదు చాలానే కారణాలు ఉన్నాయి. ఆ మధ్య.. సన్నీ యాదవ్ ఎక్కువగా బైక్‌పై వివిధ దేశాలకు ప్రయాణాలు చేస్తూ వాటిని వీడియోలుగా పోస్ట్ చేసేవాడు. ‘ ఇండియా నుంచి అమెరికాకు బైక్ మీద వెళ్ళా’ అని సన్నీ చేసిన ఒక వీడియోపై అన్వేష్ ఓ రేంజిలో సెటైర్లు వేశాడు. నిజానికి బైక్‌ను షిప్‌లో పంపి, సన్నీ విమానంలో వెళ్లాడని ఆయన ఆరోపించాడు. దీనిపై సన్నీ యాదవ్ తీవ్రంగా స్పందించడమే కాదు.. అన్వేష్‌పై అసభ్య పదజాలంతో దూషణలకు దిగాడు. అన్వేష్ కూడా తాను వెళ్ళిన దేశాల గురించి కొన్నిసార్లు తప్పుడు సమాచారం ఇస్తున్నాడని సన్నీ యాదవ్ వర్గం సైతం విమర్శించింది. సన్నీ యాదవ్ ఒక అమ్మాయిని మోసం చేశాడని, మరొక కడపకు చెందిన పోలీస్ ఆఫీసర్ కుమార్తెను ట్రాప్ చేసి అస్సాంకు తీసుకెళ్లాడని అన్వేష్ సంచలన ఆరోపణలు చేశాడు. దీంతో సన్నీ కూడా అన్వేష్‌పై వ్యక్తిగత ఆరోపణలకు దిగాడు. మరీ ముఖ్యంగా.. పలువురు యూట్యూబర్లు, ముఖ్యంగా బిగ్‌బాస్ కంటెస్టెంట్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నారని పెద్ద ఎత్తునే ఆరోపణలు వచ్చిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ జాబితాలో భయ్యా సన్నీ యాదవ్ పేరు కూడా ఉండటంతో పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఈ క్రమంలోనే.. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై, ముఖ్యంగా సన్నీ యాదవ్ లాంటి యూట్యూబర్ల పాత్రపై విమర్శలు చేస్తూ వీడియోలు చేశాడు. ఇది వీరి మధ్య మరింత ఘర్షణకు దారితీసింది. ఇలా వీరిద్దరి మధ్య గొడవ ఇప్పటికీ పూర్తిగా సద్దుమణగలేదు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, సవాళ్లు విసురుకోవడం వంటివి తరచుగా జరుగుతూనే ఉన్నాయి. ఈ గొడవ తరచుగా మీడియాలో, సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతున్నది. ఇప్పుడు ఏకంగా అన్వేష్ ఇంటికి సన్నీ వెళ్తుండటంతో ఏం జరుగుతుందో..? దీనిపై అన్వేష్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.
Read Also- Bayya Sunny Yadav: మరో వివాదంలో భయ్యా సన్నీ యాదవ్.. ఈ దెబ్బతో ఇక ఔటేనా?
వీడియో కోసం క్లిక్ చేయండి..