Smriti Mandhana: స్మృతి మంధాన.. భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్. క్రికెట్ అభిమానులనే కాకుండా, కుర్రోళ్ల డ్రీమ్ గాళ్‌గా పేరు తెచ్చుకున్న స్మృతి మరో ఘనత సాధించింది. వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఈ మేరకు మంగళవారం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. అందులో 727 పాయింట్లతో స్మృతి అగ్రస్థానంలో నిలిచింది.
ఆరేళ్ల తర్వాత..
ఇప్పటిదాకా సౌతాఫ్రికా మహిళా క్రికెటర్ లారా వోల్వార్డ్ ఫస్ట్ ప్లేస్‌లో ఉండేది. ఆమెను వెనక్కి నెట్టిన స్మృతి మంధాన, దాదాపు ఆరేళ్ల తర్వాత మొదటి స్థానానికి చేరుకున్నది. లారాతోపాటు ఇంగ్లండ్ కెప్టెన్ నటలీ స్కైవర్ కూడా రెండో స్థానంలో కొనసాగుతున్నది. వీరిద్దరికి 719 రేటింగ్ పాయింట్స్ దక్కాయి. వీళ్లిద్దరి మధ్య కౌంట్ బ్యాక్ చూస్తే, లారా వెనుకబడింది. దీంతో ఆమెకు మూడో స్థానం దక్కింది. నాలుగు, ఐదు స్థానాల్లో ఇంగ్లండ్ వికెట్ కీపర్ అమీ జోన్స్, ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఎల్లీస్ పెర్రీ కొనసాగుతున్నారు.
అద్భుతమైన ఫామ్‌లో ఉన్న స్మృతి
ఈ మధ్య కాలంలో టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన అద్భుతమైన ఫామ్‌తో క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరిస్తున్నది. దక్షిణాఫ్రికాతో జరిగిన ట్రై సిరీస్ ఫైనల్‌లో శ్రీలంకపై శతకం బాదింది. ఈ సిరీస్‌లో ఐదు మ్యాచులు ఆడి 264 పరుగులు సాధించింది. 50 సగటుతో అత్యధిక రన్స్ సాధించిన రెండో బ్యాటర్‌గా నిలిచింది. ఈ సిరీస్‌లో దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ లారా వోల్వార్డ్ పెద్దగా రాణించలేదు. ఐదు మ్యాచుల్లో ఒక్క ఆఫ్ సెంచరీ కూడా చేయలేకపోయింది. దీంతో పాయింట్ల రేటింగ్‌లో ర్యాంక్ దిగజారిపోయింది. అప్పటిదాకా ఉన్న అగ్రస్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది.
Read Also- Indus Water Treaty: భారత్ దెబ్బకు పాక్ విలవిల.. రిపోర్ట్ విడుదల
2024లో స్మృతి రికార్డులు
గతేడాది అసాధారణ ప్రదర్శన కనబరిచింది స్మృతి మంధాన. ఐసీసీ ఉమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. మొత్తం 13 మ్యాచులు ఆడి 747 పరుగులు చేసింది. వాటిలో 4 సెంచరీలు ఉన్నాయి. 57.86 సగటుతో ఒకే క్యాలెండర్ ఈయర్‌లో అత్యధిక శతకాలు బాదిన మహిళా క్రికెటర్‌గా రికార్డులకెక్కింది.
𝙏𝙤𝙥𝙥𝙞𝙣𝙜 𝙩𝙝𝙚 𝙘𝙝𝙖𝙧𝙩𝙨 🥇
Congratulations to #TeamIndia vice-captain Smriti Mandhana on reclaiming the 🔝 spot in ICC Women’s ODI batting rankings 👏👏@mandhana_smriti pic.twitter.com/OfiSxX70Dh
— BCCI Women (@BCCIWomen) June 17, 2025
త్వరలో ఇంగ్లండ్‌తో సిరీస్
వన్డే వరల్డ్ కప్ 2025 సన్నాహకాల్లో భాగంగా త్వరలో ఇంగ్లండ్ సిరీస్ జరగనున్నది. ఇప్పటికే బీసీసీఐ భారత మహిళా జట్టును ప్రకటించింది.
భారత మహిళా జట్టు
హర్మన్ ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మతి మంధాన(వైస్ కెప్టెన్) ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, యాస్తికా భాటియా, రిచా ఘోష్(వికెట్ కీపర్), తేజ్ హస్బానిస్, స్నేహి రాణా, దీప్తి శర్మ, శ్రీ చరణి, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, సయాలీ సత్ఘరే.
Read Also- Model Sheetal Choudhary: గొంతు కోసి కత్తితో పొడిచి.. మోడల్ హత్య.. ప్రియుడే విలన్!