Watch Video: అహ్మాదాబద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం.. యావత్ దేశాన్ని శోక సంద్రంలోకి నెట్టిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఏకంగా 274 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 241 మంది ప్రయాణికులు ఉండగా.. విమానం ఓ బిల్డింగ్ పై కూలడంతో అందులోని 33 మంది మృతి చెందారు. దీంతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. అయితే ఈ దుర్ఘటనకు సంబంధించి తాజాగా మరో వీడియో బయటకొచ్చింది. ప్రస్తుతం అది నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
బాల్కనీ నుంచి దూకి..
అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం.. జూన్ 12న బీజే మెడికల్ కాలేజీ హాస్టర్ పై కుప్పకూలిన విషయం తెలిసిందే. దీంతో బిల్డింగ్ లోని విద్యార్థులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని.. దావనంలా వ్యాపిస్తున్న మంటల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. 2, 3 అంతస్తుల్లోని విద్యార్థులు.. బెడ్ షీట్ల సాయంతో బాల్కనీ నుంచి కిందికి దూకి ప్రాణాలు కాపాడుతున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Medical students saving lives in Ahmedabad plane crash.#AhemdabadPlaneCrash #planecrash
pic.twitter.com/NIUVWuHbo7— डॉ. इन्द्र दमन तिवारी (@DamanIndra) June 17, 2025
యువతి సాహసం
వైరల్ అవుతున్న వీడియోను గమనిస్తే ఓ విద్యార్థిని స్నేహితుల చేతిని పట్టుకొని బాల్కనీ గుండా కిందికి దిగే ప్రయత్నం చేసింది. బాల్కనీకి అమర్చిన గ్రిల్స్ ను పట్టుకొని సేఫ్ గా కిందికి దిగి.. ప్రాణాలను రక్షించుకుంది. హాస్టల్ లోని పలువురు విద్యార్థులు సైతం అదే విధంగా కిందకు దిగి తమ ప్రాణాలను రక్షించుకున్నారు. అక్కడే ఉన్న ఓ విద్యార్థి ఆ దృశ్యాలను తన సెల్ ఫోన్ లో బంధించగా.. తాజాగా అవి వెలుగులోకి వచ్చాయి.
Also Read: Genelia Marriage: ఆ స్టార్ హీరోతో జెనీలియా సీక్రెట్ పెళ్లి.. 14 ఏళ్ల తర్వాత బయటకొచ్చిన నిజం.. అతనెవరంటే?
పలు వీడియోలు వైరల్
ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన విమాన ప్రమాదాల్లో ఒకటిగా అహ్మాదాబాద్ ఘటన నిలిచింది. అయితే ఈ దుర్ఘటన అనంతరం పలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సీతాబెన్ అనే మహిళ.. ఆకాష్ అనే తన కుమారుడ్ని కాపాడుకునేందుకు ఎంతగానో శ్రమించింది. ఈ ఘటనలో ఆకాష్ మరణించగా.. సీతాబెన్ గాయాలతో బయటపడ్డారు. అలాగే మరోక వీడియోలో రమేష్ విశ్వాస్ కుమార్(Ramesh Kumar Vishwas) అనే మంటల్లో నుంచి నడుచుకుంటూ బయటకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. విమాన ప్రమాదంలో బయటపడ్డ ఏకైక ప్రయాణికుడు అతడే కావడం గమనార్హం.