SSC CGL 2025: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) అధికారికంగా CGL కోసం నియామక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నియామక ప్రక్రియ, అర్హత, దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం, అధికారిక నోటిఫికేషన్‌ను చూడండి. అర్హత గల అభ్యర్థులు దిగువ లింక్ నుండి దానిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Also Read: Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లిపై జ్యోతిష్యుడు అంత మాట అనేశాడేంటి? ఆమెకు వివాహం జరగదా..?
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామ్ (CGL-2025) ఖాళీల నియామకానికి నోటిఫికేషన్ ప్రకటించింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న ఉండి అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అర్హత గల అభ్యర్థులు నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోవచ్చు.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) రిక్రూట్‌మెంట్ 2025లో 14,582 CGL పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, 12వ తరగతి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు 09-06-2025న ప్రారంభమై 04-07-2025న ముగుస్తుంది. అభ్యర్థి SSC వెబ్‌సైట్, ssc.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
Also Read: Mahesh Goud on Srinivas: పొంగులేటి వర్సెస్ టీపీసీసీ చీఫ్.. మంత్రిపై మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం!
దరఖాస్తు రుసుము
జనరల్/ఓబీసీ అభ్యర్థులకు: రూ.100/- ను చెల్లించాలి.
SC/ST/PH/ మహిళా అభ్యర్థులకు: ఎటువంటి ఫీజు లేదు
SSC రిక్రూట్‌మెంట్ 2025 ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 09-06-2025
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 04-07-2025
చెల్లింపుకు చివరి తేదీ: 05-07-2025
ఆన్‌లైన్ దిద్దుబాటు: 09-07-2025 నుండి 10-07-2025
టైర్ I అడ్మిట్ కార్డ్: ఆగస్టు 2025
టైర్ I పరీక్ష తేదీ: 13-30 ఆగస్టు 2025
టైర్-II (కంప్యూటర్ ఆధారిత పరీక్ష) యొక్క తాత్కాలిక షెడ్యూల్: డిసెంబర్ 2025
SSC రిక్రూట్‌మెంట్ 2025 వయోపరిమితి
కనీస వయోపరిమితి: 18 సంవత్సరాలు
గరిష్ట వయోపరిమితి: 30 సంవత్సరాలు
18-27 సంవత్సరాలు ఉన్న పోస్టులకు – అభ్యర్థి 02-08-1998 కంటే ముందు 01-08- 2007 కంటే తరువాత జన్మించి ఉండాలి.
20-30 సంవత్సరాలు ఉన్న పోస్టులకు: అభ్యర్థి 02-08-1995 కంటే ముందు 01-08- 2005 కంటే తరువాత జన్మించి ఉన్న వారు అర్హులు. ఉండాలి.
18-30 సంవత్సరాలు ఉన్న పోస్టులకు: అభ్యర్థి 02-08-1995 కంటే ముందు 01-08- 2007 కంటే తరువాత జన్మించి ఉన్న వారు అర్హులు.
వయోపరిమితి 18-32 సంవత్సరాలు ఉన్న పోస్టులకు: అభ్యర్థి 02-08-1993 కంటే ముందు 01-08- 2007 కంటే తరువాత ఉన్న వారు అర్హులు.
జీతం
పే లెవల్-7 రూ. 44,900 నుండి రూ. 1,42, 400 వరకు వేతనాన్ని చెల్లిస్తారు.
పే లెవల్-6 రూ. 35,400 నుండి 1,12, 400 వరకు వేతనాన్ని చెల్లిస్తారు.
పే లెవల్-5 రూ.29,200 నుండి 92, 300 వరకు వేతనాన్ని చెల్లిస్తారు.
పే లెవల్-4 రూ. 25, 500 నుండి 81, 100 వరకు వేతనాన్ని చెల్లిస్తారు.