Kuberaa Trailer: ఒక బెగ్గర్ గవర్నమెంట్‌నే రిస్క్‌లో పెడితే..!
Kuberaa
ఎంటర్‌టైన్‌మెంట్

Kuberaa Trailer: ఒక బెగ్గర్ గవర్నమెంట్‌నే రిస్క్‌లో పెడితే..! శేఖర్ కమ్ముల కొట్టేస్తున్నాడు.. నో డౌట్!

Kuberaa Trailer: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush), టాలీవుడ్ కింగ్ నాగార్జున (King Nagarjuna), నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) కాంబోలో రూపుదిద్దుకుంటోన్న హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘కుబేర’. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైన ఈ చిత్ర ప్రమోషన్స్‌ని మేకర్స్ యమా జోరుగా నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌తో పాటు ప్రస్తుతం ఆర్టిస్ట్‌ల ఇంటర్వ్యూలతో ఈ సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలపై మరింత హైప్ పెంచేలా మేకర్స్ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను వదిలారు. ఆదివారం, హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా హాజరైన దర్శకధీరుడు రాజమౌళి చేతుల మీదుగా మేకర్స్ ఈ ట్రైలర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ టాప్‌లో ట్రెండ్ అవుతూ.. సినిమా కోసం వెయిట్ చేసేలా చేస్తోంది.

Also Read- Dil Raju: ప్రభుత్వం అవార్డులు ఇస్తుంటే.. తీసుకోవడానికి రారా? దిల్ రాజు ఫైర్!

ట్రైలర్ విషయానికి వస్తే.. శేఖర్ కమ్ముల సినిమాలన్నీ ఒక టెంపోలో ఉంటాయనేది తెలియంది కాదు. కొత్తదనం నిండిన కథలతో సినిమాలు చేసే శేఖర్ కమ్ముల.. ఇప్పుడు మరోసారి ఓ వైవిధ్యమైన కథతో ‘కుబేర’ చిత్రాన్ని రూపొందించినట్లుగా ఈ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. ‘కోట్లు కోట్లు కోట్లు అంటే ఎంత సార్..’ అనే డైలాగ్‌లో మొదలైన ఈ ట్రైలర్‌లో ఎమోషన్స్ లెవల్ మాములుగా లేదు. ముఖ్యంగా ధనుష్ పాత్రకు ఉన్న ఇంపార్టెన్స్ ఏంటో ఒకే ఒక్క డైలాగ్‌తో ఇందులో చెప్పేశారు. ‘బికారోడికి అడ్రస్సేం ఉంటుంది. ఒక ముష్టోడు ఇప్పుడు గవర్నమెంట్‌నే రిస్క్‌లో పడేశాడు’ అనే డైలాగ్‌లోని తీవ్రత.. సినిమా స్థాయిని తెలియజేస్తుంది. సినిమా పేరు ‘కుబేర’. హీరో ముష్టోడు.. ఇంతకంటే ఆసక్తికరమైన విషయం ఏం కావాలి.

Also Read- Fathers Day 2025: ఫాదర్స్ డే స్పెషల్‌గా సెలబ్రిటీలు.. వారి పిల్లలు చేసిన పోస్ట్‌లివే!

‘ఆయిల్ అంటే సాధారణ విషయం కాదు.. మనందరి తొక్కతీసి పదవి నుంచి దింపేసే పవర్ ఫుల్ విషయం’ అనే డైలాగ్‌తో ఇందులో మనీ ఏ రూపంలో వస్తుందో తెలియజేశారు. నాగార్జున, ధనుష్ పాత్రలు కలిసే తీరు, నాగ్ చెప్పే ‘ఈ దేశంలో డబ్బు, పవరే పని చేస్తాయ్. నీతి, న్యాయాలు కాదు. ఇది చరిత్ర’ డైలాగ్.. ఆ తర్వాత ధనుష్ కోసం అంతా గాలించే సన్నివేశాలు, ఆ సమయంలో ధనుష్ ప్రవర్తించే విధానం అంతా కూడా కొత్తగా అనిపిస్తున్నాయి. ‘జాలి పడటం బాగుంటుంది కానీ.. అది మెల్లగా మిమ్మల్ని చంపేస్తుంది’ వంటి శేఖర్ కమ్ముల మార్క్ డైలాగ్‌తో పాటు, రష్మిక మందన్నా చెప్పే ‘డబ్బులు, పోలీసులు, కోర్టులు అన్నీ వాళ్లవే. మనలాంటోళ్ల చేతుల్లో ఏమీ ఉండదు. ఈ ప్రపంచం మొత్తం వాళ్లదే..’ అనే డైలాగ్ సినిమాలోని మెయిన్ కథాంశాన్ని తెలియజేస్తున్నాయి. ఈ ట్రైలర్‌తో దాదాపు కథేంటో హింట్ ఇచ్చిన శేఖర్ కమ్ముల.. అసలు విషయం తెలియనీయకుండా ట్రైలర్‌ని చాలా ఇంపాక్ట్‌గా కట్ చేయించారు. ఓవరాల్‌గా అయితే.. శేఖర్ కమ్ముల నుంచి చాలా కాలంగా ఎదురు చూస్తున్న సినిమా అయితే రాబోతుందనే ఫీల్‌ని ఈ ట్రైలర్ ఇచ్చేసింది. అలాగే సినిమాపై అంచనాలను పెంచేయడంలో కూడా ఈ ట్రైలర్ సక్సెస్ అయింది. ఇక సినిమా కోసం జూన్ 20 వరకు వెయిట్ చేయాల్సిందే.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Kerala News: కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హవా.. పంచాయతీ ఎన్నికల్లో యూటీఎఫ్ సత్తా

Brown University: అమెరికాలో కాల్పులు.. ఇద్దరు మృతి, ఎనిమిది మంది పరిస్థితి విషమం

Etela Rajender: నేను ఏ పార్టీలో ఉన్నానో వారే చెప్పాలి: ఈటల రాజేందర్

Overdraft vs Personal Loan: ఓవర్‌డ్రాఫ్ట్ vs పర్సనల్ లోన్.. మీ డబ్బు అవసరంలో ఏది సరైన ఎంపిక?

MLC Kavitha: గులాబీ నాయకులకు కవిత గుబులు.. ఎవరి అవినీతిని బయట పడుతుందో అని కీలక నేతల్లో టెన్షన్!