Celebrities Fathers Day wish
ఎంటర్‌టైన్మెంట్

Fathers Day 2025: ఫాదర్స్ డే స్పెషల్‌గా సెలబ్రిటీలు.. వారి పిల్లలు చేసిన పోస్ట్‌లివే!

Fathers Day 2025: అమ్మ తన కడుపులో పిల్లల్ని 9 నెలలు మాత్రమే మోస్తుంది. కానీ నాన్న, జీవితాంతం వాళ్లని తలపై పెట్టుకుని మోస్తుంటాడు. అలాంటి నాన్నను గౌరవించుకునే రోజుది. జూన్ మూడో ఆదివారాన్ని ఫాదర్స్ డే‌గా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సెలబ్రిటీలు, వారి పిల్లలు చేసిన పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. సెలబ్రిటీలు వారి నాన్నతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటుంటే.. వారి పిల్లలు వారి నాన్నను ఎంతగానో ప్రేమిస్తున్నట్లుగా చెబుతూ.. ఫాదర్స్ డే శుభాకాంక్షలు చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), మహేష్ బాబు (Mahesh Babu), అల్లు అర్జున్ (Allu Arjun) వంటి వారంతా ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి.

Also Read- Mohanlal: కాల్చి చంపేస్తా.. అంటూ మోహన్ బాబుకు మోహన్ లాల్ వార్నింగ్!

‘‘ఈ భూమిపై మనం స్థిరంగా ఉండటానికి మూలాలను, ఆకాశంలో ఎగరడానికి రెక్కలను ఇస్తారు నాన్నలు. నా సూపర్ హీరో అయిన మా నాన్నను గుర్తు చేసుకుంటూ.. తమ బిడ్డల కోసం బలం, తెలివి, ప్రేమలను పంచి, వారి జీవితాలను తీర్చిదిద్దే ఈ ప్రపంచంలోని అద్భుతమైన తండ్రులందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’’ అని మెగాస్టార్ చిరంజీవి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని తన తండ్రితో కలిసి ఉన్న మిర్రర్ సెల్ఫీలను పోస్ట్ చేసింది. కెమెరా కోసం పోజులిస్తూ ఆమె తలపై ప్రేమగా ముద్దు ఇస్తున్నట్లుగా మహేష్ బాబు ఇందులో కనిపిస్తున్నారు. ఈ ఫొటోలను షేర్ చేసిన సితార.. ‘హ్యాపీ ఫాదర్స్ డే నానా.. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను’ అని తెలిపింది.

">

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన పిల్లలు అయాన్, అర్హ నుండి అందుకున్న స్పెషల్‌‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఇందులో చెర్రీలతో అలంకరించిన చాక్లెట్ కేక్.. దానిపై ‘హ్యాపీ ఫాదర్స్ డే’ అని రాసి ఉన్న వైట్ చాక్లెట్ లేబుల్‌ని అల్లు అర్జున్‌కు బహుమతిగా ఇచ్చారు. ఈ కేక్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన అల్లు అర్జున్ ‘థాంక్యూ అయాన్ అండ్ అర్హ.. నేను మిమ్మల్ని మిస్ అవుతున్నాను!’’ అని పోస్ట్ చేశారు. మరో పోస్ట్‌లో తన తండ్రి అల్లు అరవింద్‌తో కలిసి గద్దర్ అవార్డ్స్ పట్టుకుని ఉన్న ఫొటోని షేర్ చేసి.. ‘హ్యాపీ ఫాదర్స్ డే టు మై గాడ్’ అని పేర్కొన్నారు.

Allu Arjun Fathers Day post

Also Read- Salman Khan Marriage: నేను పెళ్లి చేసుకుంటా.. రిజెక్ట్ చేసిన అమ్మాయిని మర్చిపోలేను.. సల్మాన్ ఖాన్ కామెంట్స్

కన్నడ స్టార్ హీరో, కెజియఫ్ ఫేమ్ యష్.. తన పిల్లలతో కలిసి సరదాగా గడిపిన క్షణాలను ఆయన భార్య రాధికా పండిట్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ఓ స్పెషల్ వీడియోను ఆమె పోస్ట్ చేశారు. ఇందులో తమ పిల్లలతో కలిసి యష్ పల్టీలు కొడుతున్నారు. వారితో కలిసి నేలపై పల్టీలు కొడుతున్న వీడియోను షేర్ చేసిన రాధిక.. ‘ప్రపంచంలోని ఉత్తమ తండ్రి.. తన పిల్లల కోసం ప్రపంచాన్ని తలక్రిందులు చేస్తాడు.. హ్యాపీ ఫాదర్స్ డే’ అని పేర్కొంది.

ఇంకా నయనతార, టొవినో థామస్, అనన్య పాండే, బెల్లంకొండ శ్రీనివాస్, వరలక్ష్మీ శరత్ కుమార్, మంచు లక్ష్మీ వంటి వారంతా ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ.. సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేశారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!