Ex Minister Srinivas Goud( Image credit: swetcha reporter)
Politics

Ex Minister Srinivas Goud: ఫార్ములా ఈ కార్ రేస్‌లో.. అవినీతి జరగలేదు!

Ex Minister Srinivas Goud: ఫార్మూలా ఈ కారు రేసులో అవినీతి జరగలేదని, అయినా కేటీఆర్ ( KTR) ను విచారణకు పిలిచారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. తెలంగాణ భవన్‌ లో (Telangana Bhavan) మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తో (Ex Mla Mallaih Yadav) తో కలిసి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి (Congress Government) పాలన గురించి పట్టింపు లేదన్నారు. కక్ష సాధింపునకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షం ఏదైనా చెబితే పాలకపక్షం సూచన అనుకుని తమ లోపాలు సమీక్షించుకోవాలని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ప్రతిపక్షాన్ని వేధించడానికి పూర్తి సమయం వెచ్చిస్తోందని ఆరోపించారు.నయవంచన, అబద్ధాలకు కాంగ్రెస్ (Congress) కేరాఫ్ అడ్రస్‌గా మారిందన్నారు.

 Also Read: Minister Sridhar Babu: స్కిల్ వర్సిటీకి సహకరించండి.. కేంద్ర మంత్రికి విజ్ఞప్తి!

అందాల పోటీలతో ఏమైనా ఒరిగిందా ?

ఫార్మూలా ఈ కారు రేసు కేసులో (Formula E car race case) అవినీతి సొమ్ము ఎవరికీ ముట్టలేదని, పారదర్శకంగా డబ్బు బదిలీ ప్రక్రియ జరిగిందన్నారు. ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరగడానికి ఈ రేసింగ్ తోడ్పడిందన్నారు. పెట్టుబడులు తెచ్చిన (KTR) కేటీఆర్‌పై కేసు పెడతారా ? అని ప్రశ్నించారు. అందాల పోటీల్లో అసభ్యంగా ప్రవర్తించిన వారిపై కేసులు పెట్టరా ? అని నిలదీశారు. తెలంగాణ ప్రతిష్ట దెబ్బతీయడం తప్ప అందాల పోటీలతో ఏమైనా ఒరిగిందా ? అన్నారు. సోనియాగాంధీకి అవమానం జరిగిన మిల్లా మ్యాగీ కూడా పిర్యాదు చేశారని, అయినా అందాల పోటీల్లో అవమానాలు చేసిన వారిపై కేసులు పెట్టలేదని ఆరోపించారు.

ఓ పద్దతి ఉందా ?

ప్రభుత్వంలో ఓ పద్దతి ఉందా ? పాలన ఉందా ? అని ప్రశ్నించారు. ఇండియాలో ఎందరో ప్రయత్నం చేసినా ఫార్ములా ఈ రేసింగ్ ఘనత తెలంగాణ కే దక్కిందన్నారు. దమ్ముంటే ఫార్ములా ఈ కారు రేసింగ్ కోసం విదేశీ సంస్థకు ఇచ్చిన డబ్బులు రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. 40 కోట్లు ఎటూ పోలేదు భద్రంగా ఉన్నాయి. తెలంగాణ ప్రజలు ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ (Congress) చేస్తున్న దుష్ప్రచారాన్ని అర్థం చేసుకోవాలని, ఆ డబ్బులు వెనక్కి తీసుకోవాలని ఈ ప్రభుత్వం ఒక్కసారి అడగలేదన్నారు. భవిష్యత్ ఎలక్ట్రికల్ వెహికల్ దే అని నమ్మి కేటీఆర్ (KTR) ఈ రేస్ నిర్వహించారని వెల్లడించారు.

 Also Read: Minister Seethakka: పొగరుతో కేటీఆర్‌.. మంత్రి సంచలన వ్యాఖ్యలు!

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు