Air India Flight (Image Source: Twitter)
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Air India Flight: మరో ఎయిర్ఇండియా విమానంలో సమస్య.. హడలిపోయిన ప్రయాణికులు!

Air India Flight: అహ్మాదాబాద్ విమాన ప్రమాదాన్ని మరిచిపోక ముందే మరో ఎయిర్ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తించింది. ఎయిర్ఇండియా ఫ్లైట్ ఏఐ180 (Air India flight AI180)లో టెక్నికల్ ప్రాబ్లమ్ రావడంతో గమ్యస్థానం చేరుకోకముందే ప్రయాణికులను అత్యవసరంగా దించేశారు. శాన్ ఫ్రాన్సిస్కో నుండి కోల్‌కతా మీదుగా ముంబై వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే..
అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో విమానశ్రయం (San Francisco Airport) నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఏఐ180 విమానం.. షెడ్యూల్ ప్రకారం అర్ధరాత్రి 12:45 గం.లకు కోల్ కత్తా ఎయిర్ పోర్ట్ కు చేరుకుంది. తిరిగి ముంబయికి బయలుదేరే క్రమంలో ఎడమ వైపు గల ఇంజిన్ టెక్నికల్ గ్లిచ్ ను పైలట్స్ గుర్తించారు. అయితే ఇవేమి తెలియని ప్రయాణికులు.. ఫ్లైట్ లోనే ఉండిపోయారు. ఎంతకీ విమానం బయలుదేరకపోవడంతో విషయం తెలియక తీవ్ర అసంతృప్తి లోనయ్యారు. 4 గంటల నిరీక్షణ తర్వాత.. ప్రయాణాన్ని రద్దు చేస్తున్నట్లు విమాన సిబ్బంది ప్రకటించారు. దీంతో ప్రయాణికులు ముంబయి చేరుకోకుండానే కోల్ కత్తాలో దిగిపోవాల్సి వచ్చింది.

పాసింజర్స్ భద్రత కోసమే
ప్రయాణికుల భద్రతా దృష్ట్యా వారిని విమానం నుంచి దించివేసినట్లు ఫ్లైట్ కెప్టెన్ తెలిపారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఫ్లైట్ లో ప్రయాణికులు వేచి చూస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో ఎయిర్ ఇండియా విమానాల్లో ఏం జరుగుతోందంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల అహ్మదాబాద్ లో జరిగిన ఘోర ప్రమాదంలో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలి 270 మంది పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఫ్లైట్ ఎక్కాలంటేనే భయంగా ఉందంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: KTR Appears for ACB Inquiry: ఎఫ్ఈవో చెల్లింపుల్లో.. నిబంధనలెందుకు పాటించలేదు!

వరుస ఘటనలు
సోమవారం ఉదయం హాంగ్‌కాంగ్ ఎయిర్‌పోర్టు (Hong Kong Airport) నుంచి ఢిల్లీ బయలుదేరిన ‘ఎయిరిండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్’ (Air India, Boeing 787 Dreamliner) ఫ్లైట్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో, విమానాన్ని మార్గమధ్యంలోనే వెనక్కి మళ్లించారు. తిరిగి హాంగ్‌కాంగ్ ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లారు. ఈ పరిణామంతో ఫ్లైట్‌లోని ప్యాసింజర్లు ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆదివారం కూడా ఎయిరిండియాకు చెందిన ఒక విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఢిల్లీ నుంచి వడోదర బయలుదేరిన ఫ్లైట్ ఏఐ819లో సమస్య తలెత్తడంతో విమానాన్ని వెనక్కి తిప్పి ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టుకు తరలించారు. ల్యాండింగ్ గేర్‌లో సమస్య ఉన్నట్టుగా గుర్తించారు.

Also Read This: HYDRA Commissioner: ప్రజావసరాల స్థలాలను కాపాడుతున్నాం.. రంగనాథ్ స్పష్టం!

Just In

01

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!