Minister Konda Surekha: పేదవారి ఆత్మగౌరవ ప్రతిక సొంత ఇల్లు పేదల కలలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. వరంగల్ నగరంలోని ఓ సిటీ లోని మంత్రి క్యాంప్ కార్యాలయ ఆవరణలో వరంగల్ తూర్పు నియోజకవర్గం లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు ఉత్తర్వులు పత్రాలు మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని మోసం చేసింది. ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ ఫలాలను అమలు చేస్తున్నామన్నారు. ప్రతి నిరుపేద బిడ్డకు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో 3500 ఇండ్లు మంజూరు చేస్తూ, ప్రతి నిరుపేద కుటుంబానికి 5 లక్షల రూపాయలతో ఇండ్లను నిర్మించుకోవడానికి అవకాశం కల్పించిందన్నారు.
పేదవారి ఆశయాన్ని నెరవేర్చడం లక్ష్యం
గత ఎన్నికలకు ముందు ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు నూతన హామీలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. పేదవారి ఆశయాన్ని నెరవేర్చడం కోసం రాష్ట్రంలో కోట్ల రూపాయలు వెచ్చించి 20 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను చేపట్టడం జరుగుతున్నదని మంత్రి అన్నారు. ఎన్నికల ముందు నియోజకవర్గ అభివృద్ధికి కోసం ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేరుస్తామని మంత్రి అన్నారు. వరంగల్ తూర్పు నియోజక వర్గానికి 3500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా అందులో 1659 ఇందిరమ్మ ఇళ్ల ఉత్తర్వుల పత్రాలను లబ్ధిదారులకు ఈరోజు అందజేయడం జరిగిందన్నారు. మిగిలిన అర్హులైన లబ్ధిదారులకు వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే మంజూరు పత్రాలు అందజేయడం జరుగుతుందన్నారు.
Also Read: Plane Crash: ఎయిరిండియా ‘ప్రమాదాన్ని’ వీడియో తీసిన బాలుడు ఇతడే
పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ
అత్యంత నిరుపేద అర్హులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యేలా ప్రభుత్వం పారదర్శకంగా పోర్టల్ ద్వారా మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మంజూరి పత్రాలు స్వీకరించిన లబ్ధిదారులు త్వరగా ఇళ్ళను నిర్మించుకొని గృహ ప్రవేశానికి ఆహ్వానించాలని మంత్రి కోరారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500 లకే సబ్సిడీపై గ్యాస్ సిలిండర్, 200 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం అన్నారు. స్లమ్ ఏరియాలో నివశించే పేదలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని ఇంచార్జీ మంత్రిని కోరామని, లేఅవుట్ రూపొందించాలని సూచించారు. అనుమతులు రాగానే పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని మంత్రి అన్నారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండా సుధారాణి, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద, మాజీ ఎమ్మెల్సీ కొండ మురధర్ రావు, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యా రాణి, కార్పొరేటర్లు వస్కుల బాబు సోమిశెట్టి ప్రవీణ్ పల్లం పద్మ, ముష్కమల్ల అరుణ, చింతాకుల అనిల్ కుమార్, భోగి సువర్ణ, పోశాల పద్మ, కావేటి కవిత, బైరబోయిన ఉమా దామోదర్ యాదవ్, గుండు చందన పూర్ణ చందర్, ఓని స్వర్ణ లత, ఫూర్కాన్ బాల్నే సురేష్, బస్వరాజు కుమార స్వామి, సురేష్ జోషి ఇందిరమ్మ ఇళ్ల జిల్లా నోడల్ అధికారి రామీ రెడ్డి, పిడి హాజింగ్ గణపతి, డిప్యూటీ కమిషనర్ ప్రసన్న రాణి ఆర్ డి ఓ సత్య పాల్ రెడ్డి పాల్గొన్నారు.
Also Read: Kavitha: యువతకు.. జాగృతి రాజకీయ శిక్షణా వేదిక!