Kavitha: రాజకీయ నేపథ్యం లేని యువత, విద్యార్థులు, మహిళలకు తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) ఒక రాజకీయ శిక్షణా వేదికగా మారబోతుందని ఆ సంస్థ అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. యువత రాజకీయాల్లోకి వస్తే స్వచ్ఛమైన రాజకీయాలకు నాంది పడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని తన నివాసంలో తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) ఆధ్వర్యంలో ‘లీడర్’ పేరిట నిర్వహించబోయే రాజకీయ శిక్షణా తరగతుల పోస్టర్‌ను ఆవిష్కరించిన సందర్భంగా కవిత (Kavitha) ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read: Harish Rao: బనకచర్లతో గోదావరి జలాల్లో తెలంగాణకు నష్టం!
శిక్షణా తరగతులు నిర్వహిస్తాం
తెలంగాణ (Telangana) గడ్డ అంటే ప్రశ్నించేతత్వం గల గడ్డ అని, ప్రశ్నించేతత్వం తమతో ఆగవద్దని, భవిష్యత్ తరాలకు కూడా ప్రశ్నించేతత్వాన్ని నేర్పించాలని ఆమె పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వచ్చే వరకు ఉద్యమిస్తామని కవిత ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెలా మూడు రోజుల పాటు శిక్షణా తరగతులు నిర్వహిస్తామని కవిత ప్రకటించారు. జూలైలో (Hyderabad) శిక్షణా తరగతులు ప్రారంభించి, ఆగస్టు నుంచి జిల్లాల్లో ప్రతి నెలా నిర్వహిస్తామని తెలిపారు.
ప్రజాస్వామ్యంపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ, విద్యార్థులు, మహిళలు, యువత ఈ శిక్షణా తరగతుల్లో పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వరంగల్, హన్మకొండకు చెందిన విద్యార్థులు, యువత, హైదరాబాద్‌లోని బాగ్ లింగంపల్లి, ముక్కపల్లి భారతి నాయకత్వంలో అంబర్‌పేట ప్రాంతాలకు చెందిన మహిళలు (Jagruthi) జాగృతిలో చేరారు. వారికి ఎమ్మెల్సీ కవిత జాగృతి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
Also Read: Government Aims: 540 నుంచి 5 వేలకు పైగా ప్రైమరీ స్కూళ్లకు విస్తరణ!