Chiranjeevi: అవును.. మీరు వింటున్నది నిజమే. మెగాస్టార్ కొణిదెల చిరంజీవికి తెలుగుదేశం (Telugu Desam) పార్టీలోకి రావాలని ఆహ్వానం వచ్చింది. బహుశా అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి, నటుడు నందమూరి తారకరామారావు (NTR) ఆహ్వానం ప్రకారం టీడీపీలోకి వెళ్లి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదనే మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇదంతా 1993 జులైలో జరిగిన సంఘటన. చిరంజీవిని తన రాజకీయ వారసుడుగా రావాలని అప్పట్లోనే ఎన్టీఆర్ కోరారు. టీడీపీ ఎమ్మెల్యేలను కొనేసి ఎన్టీఆర్‌ను కుటుంబ సభ్యులు, చంద్రబాబు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న పరిస్థితుల్లో న్యూయార్క్ వేదికగా నటరత్న, మెగాస్టార్ మధ్య చర్చలు జరిగినట్లుగా నాటి దినపత్రికల్లో వచ్చిన వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అప్పట్లో ఏం జరిగింది? ఎందుకు ఎన్టీఆర్ ఆహ్వానాన్ని చిరు తిరస్కరించారు? ఆ తర్వాత ఏం జరిగింది? అనే అలనాటి ఇంట్రెస్టింగ్ విషయాలు చూద్దాం వచ్చేయండి..
రా బ్రదర్.. నడిపించు!
అప్పట్లో చిరు మంచి స్వింగ్ మీద ఉండటం, ముఠామేస్త్రి రిలీజ్ తర్వాత మెగాస్టార్ రాజకీయ అరంగేట్రం మీద చర్చ జరిగినప్పుడు స్వయంగా చిరును ఎన్టీఆర్ ఆహ్వానించారు. మరోవైపు.. తెలుగుదేశం పార్టీని కాపాడుకోడానికి ఎన్టీఆర్ చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేసేశారు. ఆ క్రమంలోనే.. ‘ రా బ్రదర్ నా పార్టీని నడిపించు.. ఈ రాష్ట్రాన్ని పాలించు’ అని చిరుకు ఆహ్వానం పంపారు. చిరంజీవి తన ప్రజాదరణతో రాజకీయాల్లోకి వస్తే, పార్టీకి మరింత బలం చేకూరుతుందని ఎన్టీఆర్ ఆశించారు. అయితే, ఆ సమయంలో చిరంజీవి రాజకీయాల పట్ల పెద్దగా ఆసక్తి చూపలేదు. తన దృష్టి మొత్తం సినిమాలపైనే కేంద్రీకరించారు. కాబట్టి, ఎన్టీఆర్ గారి ఆహ్వానాన్ని ఆయన సున్నితంగా తిరస్కరించారు. రాజకీయాల్లోకి ప్రవేశించడానికి అది సరైన సమయం కాదని చిరంజీవి భావించారు. అప్పట్లో ఈ సంఘటన తెలుగు రాజకీయ, సినీ చరిత్రలో ఒక ఆసక్తికరమైన ఘట్టంగా నిలిచిపోయింది. ఇద్దరు అగ్రశ్రేణి నాయకులు, ఒకరు రాజకీయాల్లో, మరొకరు సినిమాల్లో, ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్న గౌరవానికి ఇది నిదర్శనం అని చెప్పుకోవచ్చు.
Read Also- Thalliki Vandanam: బాబోయ్.. తల్లికి వందనం కాదు.. ‘తండ్రి’కి వందనం!
చరిత్ర వేరేలా ఉండేదేమో?
ఎందుకో అప్పట్లో ఎన్టీఆర్ ఆహ్వానాన్ని చిరంజీవి స్వీకరించకుండా వెనకడుగు వేశారు. లేదంటే చరిత్ర వేరేలా ఉండేదని మెగాభిమానులు చెప్పుకుంటున్నారు. అయితే.. అప్పట్లో ఎందుకు వద్దనుకున్నారో ఏంటి? అనే కారణాలు మాత్రం ఇప్పటికీ తెలియరాలేదు. బహుశా తానే రాజకీయ పార్టీని స్థాపిస్తానని ముందుగానే గ్రహించే, ఇలా చేసి ఉంటారని అభిమానులు చెప్పుకుంటున్న పరిస్థితి. ఆ తర్వాత 26 ఆగస్టు, 2008లో ‘ప్రజారాజ్యం’ (PrajaRajyam) అనే పార్టీని మెగాస్టార్ స్థాపించారు. ‘ప్రజలే పాలకులు.. నేను వారధిని’ అనేది చిరు భావన. 2009లో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాధారణ శాసనసభ ఎన్నికల్లో 294 స్థానాల్లో పోటీ చేయగా.. 18 స్థానాల్లో ప్రజారాజ్యం గెలిచింది. మొత్తం ఓట్లలో 18 శాతం ఓట్లు ఈ పార్టీ దక్కించుకోవడం అప్పట్లో రికార్డ్. చిరంజీవి తిరుపతి, పాలకొల్లు నియోజకవర్గాల నుంచి పోటీ చేయగా తిరుపతి నుంచి మంచి మెజార్టీతో గెలిచారు. కొన్ని అనివార్య కారణాలు, అప్పటి పరిస్థితుల రీత్యా పార్టీ స్థాపించిన మూడేళ్లకే (2011) ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేశారు. ఆ తర్వాత కేంద్ర మంత్రిగా చిరుకు అవకాశం దక్కింది. అప్పుడు జరిగిన రాజకీయ పరిణామాలు ఏంటి, ఈ విలీనానికి కారకులు ఎవరు? అనేది ఇప్పుడు అప్రస్తుతం.
ఇప్పుడు ఎందుకీ చర్చ?
‘ సీనియర్ ఎన్టీఆర్‌కు తెలిసిన మెగాస్టార్ రేంజ్ ఇప్పుడున్న ఎవ్వరికీ తెలియకపోవడం విడ్డూరం’ అని చిరు సన్నిహితులు, వీరాభిమానులు చెప్పుకుంటున్నారు. ‘ గొప్పవాళ్లు ఎప్పుడూ ఎదుటి వారి గొప్పతనాన్ని గుర్తిస్తారు. జై ఎన్టీఆర్.. జై చిరంజీవ’ అని ఆ పేపర్ క్లిప్పింగ్స్ చూసిన జనాలు కామెంట్స్ చేస్తున్నారు. శ్రీనివాసరావ్ బీరం అనే పవన్ కళ్యాణ్ వీరాభిమాని తన ఫేస్‌బుక్‌లో ఈ పేపర్ క్లిప్పింగ్‌ను పోస్ట్ చేశాడు. దీనికి కొన్ని ఆసక్తికర విషయాలను జోడిస్తూ పోస్ట్ చేయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. అయితే అప్పట్లో చంద్రబాబు అనుకూలంగా దినపత్రికలు, టీవీ చానెళ్లలో ఈ వార్తలు రాకుండా చేశారని విమర్శలు ఉన్నాయి. ప్రధాన దినపత్రికలన్నీ చంద్రబాబుకు మద్దతుగానే నిలుస్తూ.. పూర్తిగా సీబీఎన్ వైపే ఉన్నాయని.. నాటి నుంచి నేటి వరకూ ఆయన్నే ఆకాశానికి ఎత్తుతూ నడుస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. అయితే జనసేన (Janasena), ప్రజారాజ్యం పార్టీలపై కొందరు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఇదిగో ఇదీ చిరు రేంజి అని చెబుతూ మెగాభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్లు ఎలాగో ఉంటారు.. అవన్నీ మామూలే.
Sr NTR: సీనియర్ ఎన్టీఆర్ గురించి రెండు షాకింగ్ విషయాలు.. ముక్కున వేలేసుకుంటారు!
ఫేస్‌బుక్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
https://www.facebook.com/groups/278322375857441/permalink/2527864044236585/