Warangal District (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Warangal District: రెడ్ క్రాస్ అవార్డు అందుకున్న.. వరంగల్ పోలీస్ కమిషనర్

Warangal District: ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్త దానం చేసి ప్రాణ దాతలుగా నిలవాలని ప్రేరేపిస్తూ అత్యధిక సంఖ్యలో రక్తదానాన్ని చేసేందుకు ప్రోత్సాహించినందుకు గాను అందించే రెడ్ క్రాస్ హై బ్లడ్ డోనార్ మోటివేటర్ అవార్డును వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అందుకున్నారు. ప్రపంచ రక్తదాత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని రాజ్ భవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్‌లో రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ మరియు రెడ్ క్రాస్ రాష్ట్ర అధ్యక్షులు జిష్ణుదేవ్ వర్మచేతుల మీదుగా వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ హై బ్లడ్ డోనార్ మోటివేటర్ అవార్డును అందుకున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ

ప్రపంచ రక్తదాత దినోత్సవం (World Blood Donor Day) ప్రతి సంవత్సరం జూన్ 14న జరుపుకుంటారు. రక్తదానం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం, మరియు స్వచ్ఛంద రక్తదాతలను ప్రోత్సహించడం ఈ దినోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. 2025లో ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ రెడ్ క్రాస్ అవార్డును రక్తదాన కార్యక్రమాలను ప్రోత్సహించినందుకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మచేతుల మీదుగా అందుకున్నారు.

Also Read: Kedarnath Helicopter Crash: గాలిలో కలిసిపోతున్న ప్రాణాలు.. రెండు నెలల గ్యాప్‌లో…

స్వచ్ఛందంగా రక్తదానం

రక్తదానం యొక్క అవసరం, ప్రాముఖ్యత గురించి ప్రజల్లో చైతన్యం కల్పించడం మరియు ఎటువంటి ఆర్థిక ప్రయోజనం లేకుండా స్వచ్ఛందంగా రక్తదానం చేసే వారిని ప్రోత్సహించడంతో పాటు. సురక్షితమైన, నాణ్యమైన రక్త సరఫరాను నిర్ధారించడం ద్వారా వైద్య అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడడంకోసం దీన్ని ఉపయొగిస్తుంటారు. రక్తదానం చేసిన వారిని గౌరవించి వారి సేవలను స్మరించడం. రక్త బ్యాంకులు, ఆసుపత్రులలో తగినంత రక్త నిల్వలు ఉండేలా చూడడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. దీనికి సంభందించి అన్ని విషయాలను ప్రపంచ ఆరోగ్యసంస్థ సూచనలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు

Also Read: Solar Power Plants: రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ప్లాంట్లు.. ప్రతి జిల్లాకు రెండు

 

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!