Plane Crash: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గురువారం మధ్యాహ్న సమయంలో ఎయిరిండియా బోయింగ్ 787-7 స్టార్ లైనర్ (Air India Plane Crash) విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. ప్రమాద సమయంలో ఫ్లైట్‌లో 230 మంది ప్యాసింజర్లు, 12 మంది సిబ్బంది ఉండగా, కేవలం ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఆ మృత్యుంజయుడి పేరు విశ్వాస్ కుమార్ రమేష్ (Viswas Kumar Ramesh). ఇంతటి ఘోర ప్రమాదంలో రమేష్ బతకడం ఒక మిరాకిల్‌గా మారింది. దీంతో, ఆయన కూర్చున్న ‘11ఏ’ సీటుపై (11A Mistory) ప్రపంచవ్యాప్తంగా ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
27 ఏళ్ల క్రితం సేమ్ సీన్
ఎయిరిండియా విమాన ప్రమాదంలో ‘11ఏ సీటు’లో కూర్చున్న విశ్వాస్ కుమార్ రమేష్ ప్రాణాలతో బయటపడ్డట్టుగానే, 27 ఏళ్ల క్రితం కూడా ఒక మిరాకిల్ జరిగింది. 1998 డిసెంబర్ 11న థాయ్ ఎయిర్‌వేస్ విమానం (టీజీ261) ఘోర ప్రమాదానికి గురైంది. అప్పుడు కూడా ఫ్లైట్‌లో 11వ సీటులో కూర్చున్న థాయ్‌లాండ్ ప్రముఖ సింగర్, నటుడు రువాంగ్‌సక్ లాయ్‌చూజాక్ (Ruangsak Layjack) ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదానికి గురైన విమానంలో మొత్తం 146 మంది ప్రయాణించగా, అందులో 101 మంది చనిపోయారు. 45 మంది తీవ్ర గాయాలతో బయటపడ్డారు. అయితే, 11ఏ సీటులో కూర్చున్న రువాంగ్‌సక్ మాత్రం ఎలాంటి గాయాలు కాకుండానే బతికి బట్టకట్టారు. అందుకే, ఎయిరిండియా విమాన ప్రమాదంపై ఆయన స్పందించారు.
Read this- WTC Final: దక్షిణాఫ్రికా నయా హిస్టరీ.. డబ్ల్యూటీసీ కైవసం
ఆ ప్రమాదం నాకు పునర్జన్మ
1998లో జరిగిన విమాన ప్రమాద ఘటన తనకు పునర్జర్మ అని రువాంగ్‌సక్ వ్యాఖ్యానించారు. ‘11ఏ సీటు’లో కూర్చున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారనే వార్త తెలియగానే తన రోమాలు నిక్కబొడుచుకున్నాయంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. సుమారుగా 27 ఏళ్ల క్రితం జరిగిన విషాద గాథను ఆయన మరోసారి గుర్తుచేసుకున్నారు. చాన్నాళ్ల తర్వాత తిరిగి అదే రీతిలో ఒక ప్యాసింజర్ ప్రాణాలతో బయటపడడం షాకింగ్‌గా అనిపిస్తోందని రువాంగ్‌సక్ చెప్పారు. ఆ ప్రమాదం తర్వాత కొన్ని రోజుల పాటు షాక్ నుంచి తేరుకోలేక పోయానని గుర్తుచేసుకున్నారు. భయంతో 10 సంవత్సరాల పాటు విమానప్రయాణం చేయలేదని వెల్లడించారు. దీంతో, రువాంగ్‌సక్ పెట్టిన పోస్టు చర్చనీయాంశంగా మారింది. కాగా, 11ఏ సీటులో కూర్చుంటే ప్రమాద సమయాల్లో సురక్షితంగా బయటపడే అవకాశాలు మెండుగా ఉంటాయని చర్చ వినిపిస్తోంది. పలువురు నిపుణులు సైతం ఇదే తరహా విశ్లేషణలు చేస్తున్నారు.
Read this- OP Rising Lion: ఇరాన్ అణు ప్లాన్ మటాష్.. ఇజ్రాయెల్ దాడి ఇప్పుడే ఎందుకు?
విమానంలో సేఫ్ సీట్లు ఇవేనా?
విశ్వాస్ కుమార్ రమేష్ 11ఏ సీటులో కూర్చొని ప్రాణాలతో బయటపడడంతో విమానంలో సేఫ్ సీట్లపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. విమాన ప్రమాదాల్లో బయటపడ్డ వారు కూర్చున్న సీట్లను బట్టి పరిశీలిస్తే, విమానంలో సురక్షితమైన సీట్లు ఉంటాయని విమానయాన రంగ నిపుణుడు అంగద్ సింగ్ అన్నారు. విమానంలో చివరన లేదా ముందు భాగం కుడివైపున ఉండే సీట్లు కొంతమేర సురక్షితమైనవిగా భావించవచ్చని విశ్లేషించారు. కాగా, ఎయిరిండియా ప్రమాదం నుంచి బయటపడిన విశ్వాస్ కుమార్ రమేష్, తాను సజీవంగా బయటకు వచ్చానో తనకు తెలియదని అన్నారు. ‘‘నేను చనిపోతానని కొద్దిసేపు అనిపించింది. కానీ, నేను కళ్లు తెరిచి చూస్తే బతికే ఉన్నాను. నా సీట్ బెల్ట్ ఓపెన్ చేసి అక్కడి నుంచి బయటకు వచ్చాను. ఎయిర్‌హోస్టెస్, అత్తామామ, అందరూ నా కళ్ల ముందే చనిపోయారు’’ అని ఆయన పేర్కొన్నారు.