leopard not entering cages which put up by forest officials in shamshabad area Leopard: చిరుత.. దోబూచాట
leopard (tiger)
క్రైమ్

Leopard: చిరుత.. దోబూచాట

Shamshabad: హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయ అధీనంలోని భూభాగంలో చిరుత సంచారం కలకలం రేపింది. చిరుత అక్కడ సంచారం చేస్తూ కలవరపెట్టడమే కాకుండా.. దాన్ని బంధించడానికి ఏర్పాటు చేసిన బోనులను పరిహసిస్తూ తప్పించుకు తిరుగుతూ మరో సవాల్‌ను విసురుతున్నది. మంగళవారం రాత్రి ఆ చిరుత బోనుకు అత్యంత సమీపానికి వచ్చి వెళ్లిపోయింది. నీటి కుంటల వద్ద బోనులు ఏర్పాటు చేశారు. బోనుల సంఖ్యను పెంచారు. అయినా ఆ చిరుత చిక్కడం లేదు. ఏకంగా ఎరగా మేకను వేసినా పచ్చి శాకహారిలా బోను దగ్గరికి రాకపోవడం ఆందోళనతోపాటు ఆశ్చర్యాన్నీ కలుగజేస్తున్నాయి. ఆరు రోజులుగా అధికారులతో చిరుత దోబూచులాడుతున్నది.

విమానాశ్రయం అధీనంలోని ఖాళీ స్థలంలో పెద్దగా చెట్లు, పొదలు దట్టంగా ఉండటంతో చిరుత అక్కడే దాక్కుని ఉంది. అక్కడే నీటి కుంటలు కూడా ఉండటంతో చిరుత నీరు తాగడానికి బయటికి రావాల్సిన అవసరం లేకపోతున్నది. మంగళవారం రాత్రి 8 గంటలకు సీఐఎస్ఎఫ్ అధికారులకు చిరుత కనిపించింది. వెంటనే అటవీ శాఖ అధికారులను అలర్ట్ చేశారు. చిరుతను పట్టుకోవడానికి బోనుల సంఖ్యను పెంచారు. నీటి కుంటల వద్ద మరో మూడు బోనులను ఏర్పాటు చేశారు. మంగళవారం రాత్రి ఆ చిరుత బోనుకు అత్యంత సమీపానికి వెళ్లి వెనుదిరిగింది.

Also Read: తెలంగాణలో కాంగ్రెస్ జోష్.. రాహుల్, ప్రియాంక ప్రచారం ముమ్మరం

చిరుతను బంధించడానికి అధికారులు ఐదు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. చిరుత నిన్నటి కదలికలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే పులి సంచరిస్తున్న రెండు ఏరియాలను కనుక్కున్నారు. ఆ చిరుత ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లుతున్నదో నిఘా పెట్టి.. ఒకట్రెండు రోజుల్లో చిరుతను బంధిస్తామని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.

Just In

01

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..

Sree Vishnu: శాకాహార ప్రియులందరికీ హీరో శ్రీ విష్ణు సజెషన్ ఇదే..

Crime News: జైలు నుంచి ఇటీవలే విడుదల.. అంతలోనే చంపేశారు.. దారుణ ప్రతీకార హత్య