Diabetes Temple (Image Source: Twitter)
Viral

Diabetes Temple: మీకు షుగర్ ఉందా.. ఆ గుడికి వెళ్తే సరి.. ఇక రోజూ స్వీట్స్ తినొచ్చు!

Diabetes Temple: సనాతన ధర్మంలో ఆలయాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. దేవాలయాన్ని దర్శించడం ద్వారా కష్టాలు తీరి.. మనసుకు ప్రశాంతత లభిస్తుందని చాలా మంది హిందువుల నమ్మకం. ఇష్టదైవాన్ని ప్రార్థించడం ద్వారా జీవితంలో ఎదురయ్యే ఒడిదొడుకులు తొలగిపోతాయని హిందువులు భావిస్తుంటారు. అయితే ఇప్పుడు చెప్పబోయే గుడికి వెళ్తే.. పుణ్యం దక్కడంతో పాటు మధుమేహం కూడా తొలగిపోతుందని అంటున్నారు భక్తులు. ఇంతకీ ఆ దేవాలయం ఏది? ఎక్కడ ఉంది? అందులో వాస్తవమెంతా? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

ఆలయం ఎక్కడ ఉంది?
తమిళనాడు (Tamilnadu)లోని తిరువారూర్ జిల్లాకు సమీపంలో గల కోవిల్ వెన్ని గ్రామంలో శ్రీ వెన్ని కరుంబేశ్వరర్ ఆలయం (Venni Karumbeswarar Temple) ఉంది. ఆలయాన్ని దర్శిస్తే మధుమేహం మటుమాయం అవుతుందని భక్తులు చెబుతుంటారు. ఈ ఆలయంలో పూజింపబడే శివలింగం.. 5,000 ఏళ్ల నాటిదని భక్తులు నమ్ముతారు. స్వయంగా శ్రీకృష్ణుడే (Lord Sri Krishna) గుడిలో లింగాన్ని ప్రతిష్టించినట్లు స్థానికులు విశ్వసిస్తారు.

మధుమేహం తగ్గిస్తుందా?
షుగర్ వ్యాధి (Diabetes) తో బాధపడే వారు ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించి అక్కడి లింగానికి పూజలు చేస్తే మధుమేహం పూర్తిగా తగ్గిపోతుందని భక్తులు చెబుతుంటారు. వెన్ని కరుంబేశ్వరర్ ఆలయాన్ని దర్శించిన తర్వాత తమ శరీరంలో చక్కెర స్థాయిలు నియంత్రణలోకి వచ్చాయని చాలా మంది భక్తులు పేర్కొన్నారు. దీంతో దేశ విదేశాల నుంచి ఆ ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు.

ప్రసాదంలోనే అసలు కిటుకు!
ఆలయంలో కొలువుదీరిన శివలింగానికి భక్తులు గోధుమ రవ్వ, చక్కెరతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం దానిని ఆలయ పరిసరాల్లో ఉండే చీమలకు పెడతారు. అక్కడ ఉన్న చీమలు ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే తమ వ్యాధి తగ్గుముఖం పడుతుందని భక్తులు నమ్ముతారు. చీమలు స్వీకరించిన తర్వాత తమకు షుగర్ తగ్గిపోయిందని చాలా మంది భక్తులు తెలిపారు.

Also Read: Chamala Kiran on KTR: మా రేవంత్‌ను అంటావా? కేటీఆర్‌పై విరుచుకుపడ్డ ఎంపీ చామల..!

శాస్త్రవ్తేతలు ఏం చేశారంటే?
మధుమేహం తగ్గించుకునేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు వస్తుండటంతో శాస్త్రవేత్తల దృష్టి శ్రీ వెన్ని కరుంబేశ్వరర్ దేవాలయంపై పడింది. భక్తులు చెబుతున్న వాటిలో నిజా నిజాలు తెలుసుకునేందుకు కొందరు భక్తులకు వైద్య పరీక్షలు సైతం నిర్వహించినట్లు సమాచారం. అనూహ్యంగా షుగర్ వ్యాధి నయమైనట్లు ఆ పరీక్షల్లో తేలిందని తెలుస్తోంది. కాబట్టి షుగర్ తో ఏళ్ల తరబడి బాధపడుతున్న వారు వెంటనే ఈ ఆలయాన్ని దర్శించి.. వ్యాధిని నయం చేసుకోండి మరి.

Also Read: This: ISRO – Ax-4 Mission: శుభాంశు శుక్లా రోదసీ యాత్ర.. డేట్ ఫిక్స్ చేసిన ఇస్రో.. ఎప్పుడంటే? 

గమనిక: ఇది భక్తుల నమ్మకానికి సంబంధించిన అంశం. దానిని పరిగణలోకి తీసుకొని మాత్రమే వార్తను రాయడం జరిగింది. అనారోగ్య సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమమైన మార్గం.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు