Train Tragedy
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Hyderabad Tragedy: రైల్వే ట్రాక్‌పై కూతురిని కాపాడబోయి.. కన్నీళ్లు పెట్టించే ఘటన

Hyderabad Tragedy: కన్నపేగు ప్రాణాపాయంలో ఉంటే ఏ తండ్రి మాత్రం తట్టుకోగలడు. ప్రాణానికి ప్రాణం అడ్డువేసైనా సరే కూతురిని కాపాడుకునేందుకు ఏమాత్రం వెనుకాడబోరని ఓ నాన్న నిరూపించాడు. హైదరాబాద్‌లో గతవారం తీవ్ర విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్‌లో కూతురు బలవన్మరణ ప్రయత్నాన్ని నిలువరించేందుకు ప్రయత్నించి ఓ తండ్రి చనిపోయాడు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి కూతురిని కాపాడాడు. కుమార్తెను రక్షించే క్రమంలో ఆయన మృత్యువాతపడ్డాడు.

హైదరాబాద్‌లోని సంజీవయ్య పార్క్ రైల్వే స్టేషన్‌లో గతవారం సోమవారం (జూన్ 9న) ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న లోకో మోటివ్ ఇంజిన్ కింద పడి చనిపోయేందుకు కూతురు ప్రయత్నించగా, ఆమెను 50 ఏళ్ల వయసున్న తండ్రి కాపాడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఇద్దరినీ లోకోమోటివ్ ఇంజిన్ ఢీకొట్టింది.

Read this- Kavya Kalyanram: కావ్య క‌ళ్యాణ్ రామ్ కొత్త ఫొటోలొచ్చాయ్.. సోషల్ మీడియా షేక్!

వైవాహిక సమస్యలు
ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన అలియా బేగం అనే 30 ఏళ్ల యువతికి వైవాహిక సమస్యలు ఎదురయ్యాయి. తీవ్రంగా కలత చెందిన ఆమె, తనువు చాలించాలని నిర్ణయించుకుంది. అందుకోసం రైల్వే స్టేషన్‌కు వెళ్లింది. కూతురి మనసులో ఆలోచనను గుర్తించిన తండ్రి మొహమ్మద్ (50) ఆమెను అనుసరిస్తూ, పరిగెత్తుకుంటూ రైల్వే స్టేషన్‌కు వెళ్లాడు. వేగంగా వస్తున్న లోకో మోటివ్ ఇంజిన్‌కు ఎదురుగా ట్రాక్‌పై అలియా బేగం నిలబడి ఉండగా, ఆమె పక్కను నెట్టేందుకు మొహమ్మద్ ప్రయత్నించాడు. కానీ, క్షణాల్లో ఇద్దరినీ ట్రైన్ ఢీకొట్టింది. ఇద్దరికీ తీవ్రమైన గాయాలయ్యాయి. మొహమ్మద్ చనిపోగా, అలియా బేగం చికిత్స పొందుతోంది.

Read this- Plane Crash Tragedy: నాన్నకు మాటిచ్చి కానరాని లోకాలకు

సికింద్రాబాద్‌లోని ప్రభుత్వ రైల్వే పోలీసులు (GRP) మాట్లాడుతూ, మొహమ్మద్ తన కూతురిని రైలు ట్రాక్ నుంచి దూరంగా లాగే ప్రయత్నం చేశాడని వివరించారు. మొహమ్మద్ తన కూతురిని చేరుకోగలిగినప్పటికీ, లోకోమోటివ్ ఇంజిన్ వేగంగా వచ్చి ఢీకొట్టిందని తెలిపారు. ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారని ఓ అధికారి వివరించారు. అలియా అక్కడికక్కడే చనిపోయిందని, తీవ్రంగా గాయపడిన మహ్మద్ పట్టాలపై పడిపోయాడని చెపపారు. విషయాన్ని గమనించిన కొందరు వ్యక్తులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారని, మొహమ్మద్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారని పేర్కొన్నారు. జీఆర్‌పీ సికింద్రాబాద్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read this- Wild Breath: కంటెంట్ ఉన్నోడి కటౌట్ చాలు.. డైలాగ్ మారింది బ్రో!

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..